Big Stories

Rohit Sharma New Record: సిక్సర్ల శర్మగా నయా చరిత్ర.. రికార్డు బద్దలు కొట్టిన హిట్ మ్యాన్..!

Rohit Sharma Created New Record in T20 History: టీ 20 ప్రపంచకప్ లో ఇంతవరకు సరిగ్గా ఆడని కెప్టెన్ రోహిత్ శర్మ సరిగ్గా సెమీస్ ముందు జూలు విదిల్చాడు. అది కూడా బలమైన ఆస్ట్రేలియాపై తన ప్రతాపాన్ని చూపించాడు. ఈ మ్యాచ్‌లో తను 41 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 92 పరుగులు చేశాడు.

- Advertisement -

అందరూ చిన్న జట్లపై ధనాధన్ ఆడేసి, రికార్డులు అంటుంటారు. కానీ హిట్ మ్యాన్ అలా చేయలేదు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలని భావించి, ఆస్ట్రేలియాని చితక్కొట్టాడు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులు తన వెంట వచ్చాయి. కొన్ని బద్ధలయ్యాయి. అవేమిటో ఒకసారి చూద్దామా..

- Advertisement -

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఏకైక క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. తను 157 మ్యాచ్ ల్లో 203 సిక్సర్లు కొట్టాడు.

Also Read: సెమీస్‌కు టీమిండియా.. ఆసీస్‌పై ఘనవిజయం..

తన తర్వాత అత్యధిక సిక్సర్లు కొట్టిన వారిలో మార్టిన్ గప్టిల్ (173), జోస్ బట్లర్ (137), గ్లేన్ మ్యాక్స్‌వెల్ (133), నికోలస్ పూరన్ (132), సూర్యకుమార్ యాదవ్ (131) ఉన్నారు.

ఒకే దేశంపై అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. తను ఆస్ట్రేలియాపై 132 సిక్స్ లు కొట్టాడు. ఇంతకుముందు క్రిస్ గేల్ మూడు ఫార్మాట్లలో కలిపి ఇంగ్లండ్‌పై 130 సిక్స్‌లు కొట్టాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే, తను యూనివర్శల్ బాస్ నే అధిగమించాడు.

Also Read: Gulbadin Naib Alleged Of Cheating: ఆఫ్గాన్ ఛీటింగ్ పై.. ఐసీసీ సీరియస్

2010లో ఆస్ట్రేలియాపై 79 పరుగులతో నాటౌట్ గా నిలిచిన రోహిత్.. తాజాగా 92 పరుగులు చేసి తన వ్యక్తిగత రికార్డ్‌ను మెరుగుపరుచుకున్నాడు. తనకన్నా ముందు సురేశ్ రైనా (101)టాప్‌లో ఉండగా.. విరాట్ కోహ్లీ(89 నాటౌట్) తర్వాతి స్థానంలో ఉన్నాడు.

టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (92) చేసిన రెండో కెప్టెన్ గా ఘనత సాధించాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్(98) టాప్‌లో ఉన్నాడు.

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానూ రోహిత్ (4,165) నిలిచాడు. తన తర్వాత బాబర్ (4,145), విరాట్ (4,103)తో ఉన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News