Big Stories

Rohit and Virat: రోహిత్, విరాట్‌‌లకు ఇదే చివరి టీ20 మ్యాచ్ కానుందా ?

Last Match for Rohit and Virat in T20(Sports news in telugu): టీమిండియా క్రికెట్‌లో కీలక ఆటగాళ్లయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లితోపాటు ఇతర ఆటగాళ్ల భవిష్యత్తుపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. దశాబ్ధ కాలంగా భారత క్రికెట్‌కు ఎనలేని సేవలను అందించారు. స్టేడియంలో వీరిద్దరినీ చూసేందుకు వేలమంది క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తుంటారు. వీరిద్దరికీ దక్షిణాఫ్రికాతో రాత్రి 8 గంటలకు జరిగే టీ20 ప్రపంచ కప్ పైనల్ మ్యాచ్ అని తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచినా లేదా ఓడినా రోహిత్, విరాట్‌లు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు వీడ్కోలు పలికే అవకాశం ఉంది.

- Advertisement -

టీ20 క్రికెట్‌లో అద్భుతమైన రికార్డులు కలిగిన రన్ మెషీన్‌ విరాట్ తో పాటు కెప్టెన్ రోహిత్‌కి ఇదే ఆఖరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. కుర్రాళ్లకు అవకాశం ఇచ్చేందుకు వీరిద్దరూ పొట్టి ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ ఇదే జరిగితే విరాట్, రోహిత్ ఫ్యాన్స్ తోపాటు యావత్తు క్రీడాభిమానులు నిరాశకు గురయ్యే అవకాశం ఉంది.

- Advertisement -

ఇప్పటికీ కొంతమంది విరాట్, రోహిత్ లేని మ్యాచ్‌లను ఊహించుకోలేరు. ఇక వీళ్లు టీ20లకు శాశ్వతంగా దూరమవుతారనే వార్త వినగానే సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వన్డే, టెస్ట్ మ్యాచ్‌లలో రిటైర్మెంట్ పై ప్రస్తుతం ఎలాంటి ఆలోచన లేనట్లు కనిపిస్తుంది. అయితే ఈ ఫార్మాట్‌లో ఇంకా ఎన్ని సంవత్సరాలు కొనసాగుతారో విరాట్, రోహిత్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను సరిపోల్చడం తగదు. ఫిట్ నెస్ పరంగా రోహిత్ అంతబలంగా లేకపోయినా.. ప్రత్యర్థులను ఉతికి ఆరేస్తూ కీలక సమయాల్లో రాణిస్తుంటాడు. రన్ మెషీన్‌గా పేరొందిన విరాట్..ఫిట్ నెస్ విషయంలో ఎలాంటి సందేహం ఉండదు. విరాట్ వల్ల సహచర ఆటగాళ్లలోనూ చాలా మార్పు ఉంటుంది. సులువుగా షాట్‌లు ఆడగలడు. ఈ మెగా టోర్నీలో కోహ్లి పెద్దగా ప్రదర్శన చేయకపోయినా..రోహిత్ అద్భుతంగా రాణిస్తున్నాడు. అయితే కోహ్లిలా రోహిత్ మైదానంలో ఉత్సాహాన్ని ప్రదర్శించలేడు.

రోహిత్ కెప్టెన్సీ విషయానికొస్తే.. జట్టును సమర్థవంతంగా నడిపించిన కొద్దిమందిలో రోహిత్ ఒకడని చెప్పొచ్చు. చాలామంది ఆటగాళ్లు టీంలోకి వస్తుంటారు. ఎవరు వచ్చినా తమ సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ రోహిత్ మాత్రం జట్టు మొత్తాన్ని సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంటాడు.

Also Read: కత్తుల కొనలకు.. కత్తెర కొనలకు యుద్ధం.. సై

మరోవైపు, మాజీ క్రీడాకారుడు సెహ్వాగ్ ఈ విషయంపై స్పందించాడు. 37 ఏళ్ల రోహిత్, 35 ఏళ్ల కోహ్లి భవిష్యత్ లో ఫిట్ నెస్ ప్రమాణాలు పాటిస్తే.. వచ్చే వరల్డ్ కప్ లో బరిలోకి దిగే అవకాశం కూడా ఉందని తెలిపాడు. ప్రస్తుతం టీ 20 ప్రపంచ కప్ ఆడుతున్న ఏ సీనియర్ ఆటగాడైనా ఇదే తన చివరి మెగా టోర్నీగా భావిస్తుంటారు. విజయంతో ముగించాలని అనుకుంటారు. గత వన్డే వరల్డ్ కప్ భారత్ గెలిచి ఉంటే కోహ్లి, రోహిత్ లు.. ఇద్దరిలో ఒకరు టీ20 ప్రపంచకప్ లో ఆడేవారు కాదని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News