Big Stories

India-Pakistan Match Records: ఇండియా-పాక్ మ్యాచ్.. బద్దలైన రికార్డులు

India Vs Pakistan Match Records: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే కోట్లాదిమంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటిది టీ 20 ప్రపంచకప్ లో జరిగింది. అది కూడా నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగింది. బాల్ టు బాల్ టెన్షన్…టెన్షన్…అందరూ మునివేళ్లపై నిలబడి మ్యాచ్ చూశారు. మొత్తానికి ఒత్తిడిని గెలిచిన టీమ్ ఇండియా విజయం సాధించింది. ఒత్తిడిలో పడి పాక్ పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్ ద్వారా పలు రికార్డులు బద్దలయ్యాయి. అవేమిటో చూద్దాం.

- Advertisement -
టీ20 వరల్డ్ కప్‌లో పాక్ పై.. అత్యధిక విజయాలు..

టీ20 వరల్డ్ కప్‌లో ప్రత్యర్థి జట్టుపై అంటే పాకిస్తాన్ పై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. ఇప్పటివరకు 7 సార్లు విజయం సాధించింది. ఈ జాబితాలో పాకిస్థాన్ కూడా రెండో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌పై ఇంతవరకు పాకిస్థాన్ 6 విజయాలు సాధించింది. శ్రీలంక కూడా వెస్టిండీస్‌పై 6 విజయాలు సాధించి సమఉజ్జీగా ఉంది.

- Advertisement -
స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న జట్టుగా టీమ్ ఇండియా రికార్డ్

2021లో జింబాబ్వే పై చేసిన 119 పరుగుల టార్గెట్‌ను భారత్ కాపాడుకుంది. మళ్లీ ఇప్పుడు అదే స్కోరును పాకిస్తాన్ పై కూడా డిఫెండ్ చేసుకోగలిగింది. మిగిలిన జట్ల విషయానికి వస్తే 2010లో పాక్‌పై 128 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా విజయవంతంగా కాపాడుకుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్ 130, జింబాబ్వే 131 పరుగుల లక్ష్యాలను కాపాడుకుని విజయం సాధించాయి.

Also Read: మనవాళ్లకు ఒకటే మాట చెప్పాను.. కెప్టెన్ రోహిత్ శర్మ

టీ20లో భారత్‌‌ అత్యల్ప లక్ష్యాలు..విజయాలు

1. 2024లో పాకిస్థాన్‌పై 120 పరుగుల టార్గెట్
2. 2016లో జింబాబ్వేపై 139 పరుగుల లక్ష్యం
3. 2017లో ఇంగ్లండ్‌పై 145 పరుగుల లక్ష్యం
4. 2016లో బంగ్లాదేశ్‌పై 147 పరుగుల లక్ష్యం

టీ20 వరల్డ్ కప్‌ ల్లో అత్యల్ప లక్ష్యాలు..గెలిచిన తీరు

1. 2024లో పాకిస్థాన్‌పై 120 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకున్న భారత్
2. 2014లో న్యూజిలాండ్‌పై 120 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకున్న శ్రీలంక
3. 2016లో వెస్టిండీస్‌పై 124 పరుగుల టార్గెట్‌ను కాపాడుకున్న ఆఫ్ఘనిస్థాన్
4. 2016లో ఇండియాపై 127 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకున్న న్యూజిలాండ్
5. 2009లో న్యూజిలాండ్‌పై 129 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకున్న దక్షిణాఫ్రికా

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News