Big Stories

Rcb Hero’s : ఆర్‌సీబీలో ఒకప్పుడు హీరోలు.. జట్టు వీడారు, జీరోలు అయ్యారు. ఎవరు వాళ్లు?

- Advertisement -
Royal Challengers Bangalore

Rcb Hero’s : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే ఓ క్రేజ్. ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉన్న ఫ్రాంచైజీల్లో ఇదీ ఒకటి. మెయిన్‌గా ఈ జట్టులో ఉన్న ప్లేయర్ వల్లే ఆర్సీబీకి అంత క్రేజ్ వచ్చింది. విరాట్ కొహ్లీ, డివిలియర్స్, క్రిస్ గేల్, డేల్ స్టెయిన్, డూప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్ వెల్, డానియల్ వెటోరి వంటి టాప్ క్రికెటర్లు బెంగళూరు జట్టుకు ఆడడంతో.. వరల్డ్ వైడ్‌గా ఆర్సీబీకి ఓ రేంజ్‌లో క్రేజ్ ఉండేది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ కొట్టనప్పటికీ.. ఎన్నో సీజన్స్‌లో ప్లే ఆఫ్స్ వరకు వెళ్లింది. మూడు సార్లు ఫైనల్స్‌కు కూడా చేరింది. ఆర్సీబీ జట్టులో ఉండే ప్రతి ఆటగాడిపై స్పెషల్ ఫోకస్ ఉండేది. బెంగళూరు తరపున ఆడినంత కాలం హీరోలుగా ఉన్న వాళ్లు.. ఆ జట్టును వీడిన తరువాత జీరోలయ్యారు.

- Advertisement -

దేవదత్ పడిక్కల్. 2022లో బెంగళూరు నుంచి రాజస్తాన్ రాయల్స్ జట్టులోకి వెళ్లాడు. 2020లో ఆర్‌సీబీ జట్టులోకి వచ్చి ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్ ఆడిన పడిక్కల్.. ఆ సీజన్‌లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డ్ కూడా అందుకున్నాడు. 2021లో ఏకంగా సెంచరీ బాదాడు. 2022లో రాజస్తాన్ రాయల్స్ తీసుకున్న తరువాత ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ ఛాన్స్ రాలేదు. దీంతో గ్రాఫ్ కూడా తగ్గుతూ వచ్చింది.

మరో ప్లేయర్ రాస్ టేలర్. ఈ న్యూజిలాండ్ ప్లేయర్ 2008 నుంచి 2010 వరకు బెంగళూరు జట్టులో ఉన్నాడు. 142 స్ట్రైక్ రేట్‌తో 517 పరుగులు రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. 2011 మెగా ఆక్షన్‌లో రాస్ టేలర్‌ను రాజస్తాన్ తీసుకెళ్లిపోయింది. ఆ తరువాత ఢిల్లీ డేర్ డెవిల్స్, పుణె వారియర్స్ తరపున ఆడాడు. కాని, ఏ ఒక్క సీజన్‌లోనూ ఇంప్రెసివ్‌గా ఆడింది లేదు. ఆర్‌సీబీని వదిలేసిన తరువాత నాలుగు సీజన్లలో కేవలం ఒకే హాఫ్ సెంచరీ చేశాడు.

మరో ప్లేయర్ కేదార్ జాదవ్. 2017 సీజన్‌లో బెంగళూరు తరపున ఆడిన కేదార్ జాదవ్.. 143 స్ట్రైక్ రేట్‌తో 267 పరుగులు చేశాడు. బట్.. 2018 సీజన్‌కు చెన్నై సూపర్ కింగ్స్ జాదవ్ కొనుక్కుంది. వరుసగా మూడు సీజన్లలో అవకాశం ఇచ్చినప్పటికీ.. ఇంప్రెస్ చేయలేకపోయాడు. 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News