Big Stories

ICC Men’s T20 World Cup : ఫైనల్, సెమీఫైనల్ మ్యాచ్ లకు వర్షం ఆటంకం

ICC Men’s T20 World Cup : టీ 20 ప్రపంచకప్ మ్యాచ్ లు మరో వారం రోజుల్లో ముగియనున్నాయి. సూపర్ 8లో గ్రూప్ ల మధ్య పోటీలు నువ్వా నేనా అన్నట్టు సాగుతున్నాయి. కొన్ని ఏకపక్షంగా ముగుస్తున్నాయి. అయితే ఆస్ట్రేలియా- బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ కి వర్షం అంతరాయం కలిగించింది. దాంతో డక్ వర్త్ లుయిస్ పద్ధతిలో ఆస్ట్రేలియాను విజేతగా ప్రకటించారు. ఇప్పుడిదే వర్షం సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ ల్లో పడే అవకాశాలున్నాయని అంటున్నారు.

- Advertisement -

జున్ 26న మొదటి సెమీఫైనల్, జున్ 27న రెండో సెమీఫైనల్ మ్యాచ్, జున్ 29న ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి. మొదటి సెమీఫైనల్ మ్యాచ్ కి వర్షం వస్తే రిజర్వ్ డే ఉంది. కానీ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ కి మాత్రం లేదు. ఎందుకంటే ఇక్కడ గెలిచిన వారు వెంటనే ఫైనల్ మ్యాచ్ కి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి.. సమయం లేక రిజర్వ్ డే ఇవ్వలేదు. అందువల్ల ఈ షెడ్యూల్ కొంచెం కన్ఫ్యూజ్ గానే ఉంది.

- Advertisement -

కనీసం సెమీస్ వరకైనా రిజర్వ్ డే ఇచ్చి ఉండాల్సిందని, ఇదేం షెడ్యూల్, ఎవరు చేశారని అభిమానులు సీరియస్ అవుతున్నారు. మనవాళ్లకి ఎందుకింత కోపం వస్తోందంటే.. ఒకవేళ మన టీమ్ ఇండియాకానీ రెండో సెమీఫైనల్ ఆడితే ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి.

Also Read : ఈ ఒక్కటీ గెలిస్తే ..సెమీస్ కి చేరిపోవచ్చు

ఎందుకంటే రిజర్వ్ డే లేదు కాబట్టి.. మ్యాచ్ జరిగే అవకాశం లేకపోతే.. సెకండ్ రౌండ్ గ్రూప్ దశలో అగ్ర స్థానంలో ఉన్న జట్టు ఫైనల్స్ కు అర్హత సాధిస్తుంది. ఇప్పుడు గ్రూప్ 1లో ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఇండియా ఉన్నాయి. వీటిలో ఆసిస్ గానీ టాప్ లో ఉంటే, ఆ జట్టు ఫైనల్ కి వెళ్లిపోతుంది. ఇదే పెద్ద తలనొప్పిగా ఉంది.

అందుకే టీమ్ ఇండియా ఒకవేళ బంగ్లాదేశ్ పై గెలిచినా.. ఆస్ట్రేలియాపై కూడా గెలవాల్సి ఉంటుంది. ఎందుకైనా మంచిది గ్రూప్ టాపర్ గా ఉండాలి. వర్షం రాకపోతే ఏ గొడవా లేదు. వచ్చి మ్యాచ్ కనీసం 5 ఓవర్లు కూడా ఆడే అవకాశం లేకపోతే మాత్రం, టీమ్ ఇండియా సెమీస్ ఆడకుండానే ఇంటికి వచ్చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఒకవేళ తొలి సెమీఫైనల్‌, ఫైనల్‌లో 10 ఓవర్లు మాత్రమే ఆట జరిగి, వర్షం కారణంగా మ్యాచ్‌ ఆగిపోతే మళ్లీ రిజర్వ్‌ డేలో కొత్త మ్యాచ్‌ జరగదు. మ్యాచ్ ఆగిపోయిన ఓవర్ నుంచి ఆట తిరిగి ప్రారంభిస్తారు. ఒకవేళ ఫైనల్లో మ్యాచ్‌కు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడితే మాత్రం ఇరు జట్లను విజేతలుగా ప్రకటిస్తారు. అయినా ఈ వర్షాల్లో మెగా టోర్నమెంటులు పెట్టడం ఏమిటి ? అని కొందరు మండిపడుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News