Big Stories

Rohit Sharma on IND VS ENG: ఒత్తిడి భారత్ పైనే ఉంది.. అయినా సరే..?: రోహిత్ శర్మ!

Pressure on Team India Said by Rohit Sharma Before Semifinal Match: క్రీడాకారులకు ముఖ్యంగా కావల్సినదేమిటంటే ఆత్మవిశ్వాసం. అది ఉంటే సగం విజయం సాధించినట్టే అని అంటారు. అదే ఇప్పుడు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాటల్లో కనిపిస్తోంది. అయితే  నేడు ఇంగ్లండ్ తో జరిగే సెమీఫైనల్ పోరుకు భారత్ సిద్ధపడుతోంది. లెక్కలన్నీ తీస్తే భారత్ వైపే ఒత్తిడి కనిపిస్తోంది. ఎందుకంటే 2022 టీ 20 ప్రపంచకప్ సెమీస్ లో కూడా ఇదే ఇంగ్లండ్ తో భారత్ చిత్తుగా ఓడిపోయింది.

- Advertisement -

వాళ్లు టీమ్ ఇండియా చేసిన 168 పరుగులని, ఒక్క వికెట్ కోల్పోకుండా 16 ఓవర్లలో కొట్టి పారేశారు. అదే భయం ఇప్పుడందరిలో మొదలైంది. ఆ మ్యాచ్ లో జోస్ బట్లర్ 49 బంతుల్లో 80 (నాటౌట్) చేశాడు. మరో ఓపెనర్ అలెక్స్ హేల్స్ 47 బంతుల్లో 86 (నాటౌట్) చేశాడు. ఇప్పుడా అలెక్స్ లేడు. అది కొంత సంతోషం.. కానీ ఫిల్ సాల్ట్ ఉన్నాడు.

- Advertisement -

అయితే అదే మ్యాచ్ లో విరాట్ కొహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. హార్దిక్ పాండ్యా (63) చేశాడు. ఇప్పుడు కీలకమైన సెమీస్ లో వీరు రాణించి ఒత్తిడి తగ్గించాలని అభిమానులు కోరుతున్నారు. 2022లో ఇంగ్లండ్ లో కీలకంగా ఆడిన హేల్స్, స్టోక్స్, వోక్స్ లేరు. అయినా టీమ్ ఇండియా జాగ్రత్తగానే ఆడాల్సి ఉంటుంది. అయితే అన్నిటికన్నా మించి గ్రూప్ దశలో ఇంగ్లండ్ చచ్చీచెడి సూపర్ 8 కి చేరింది. అందువల్ల అంత ఫామ్ లేదని, జాగ్రత్తగా ఆడితే సరిపోతుందని రోహిత్ శర్మ అంటున్నాడు.

Also Read: బాబూ.. ఎంతో కొంత ఇవ్వండి! పాకిస్తాన్ ఆటగాళ్ల దైన్యం..

2014 తర్వాత ఐసీసీ టోర్నీల్లో భారత ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదని రోహిత్ శర్మ అన్నాడు. అప్పుడు ఒత్తిడి ఉంది, అదృష్టం కూడా కలిసి రాలేదని అన్నాడు. ఈ నేపథ్యంలో సెమీస్ మ్యాచ్ ని ఎప్పుడూ ఆడే ఒక సాధారణ మ్యాచ్ గానే భావించి ఆడతామని అన్నాడు. ఇది సెమీఫైనల్ మ్యాచ్ అని ఒత్తిడితో ఆడితే, వికెట్లు పారేసుకుంటామని అన్నాడు. అతిగా ఆలోచించడం వల్ల ఫలితం ఉండదని అన్నాడు.

టీమ్ ఇండియాలో ప్రతి మ్యాచ్ లో ఒకరిద్దరు బాగా ఆడుతున్నారు. వారి ఆటను మేం ఆస్వాదిస్తున్నాం. ఎంజాయ్ చేస్తున్నాం. మేం అలాగే ఆడాలని కష్టపడుతున్నాం. ఇంతవరకు అలాగే జరిగింది. ఇకముందు అలాగే చేస్తాం. క్రికెట్ మ్యాచ్ అనేది 11 మంది సమష్టిగా ఆడి రాణిస్తేనే విజయం సాధ్యమవుతుందని అన్నాడు. నేను ముందు మ్యాచ్ లో 92 పరుగులు చేశాను. మరి బౌలర్లు సరిగా బౌలింగు చేయకపోతే పరిస్థితేమిటి? అని అన్నాడు. అందుకు ఇది ఒక్కరి ఆట కాదని అన్నాడు.

ఇక మైదానంలో ఏం చేయాలనేదానిపై స్పష్టమైన అవగాహనతో ఉన్నాం. జట్టు ఆటగాళ్లతో కోచ్ మాట్లాడారు. నేను మాట్లాడాను. సీనియర్లు సలహాలిచ్చారు. అవి తీసుకున్నాం. ఒక స్పష్టమైన ప్రణాళికతో ఉన్నామని అన్నాడు. ఆట ఎలా సాగుతుందనేది చివరిగా గ్రౌండులో పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని అన్నాడు.

Also Read: Yuvraj Singh Tweet Viral: ‘గుడ్ నైట్ బామ్మర్దులూ’.. ఇంగ్లాండ్ ఆటగాళ్లపై యువరాజ్ సెటైరికల్ పోస్ట్..

బౌలర్లకు సూచన చేస్తామంతే. అయితే వాళ్లు తామెలా ఫీలై బాల్స్ వేస్తే, అందుకు తగినట్టుగా ఫీల్డింగ్ సెట్ చేయడం నా బాధ్యతని అన్నాడు. ప్రతి బాల్ కెప్టెన్ అనుకున్నట్టు అక్కడ పడదని అన్నాడు. ఒకొక్కసారి బౌలర్ అనుకున్నట్టు కూడా పడదు. ఆ లూజ్ బాల్స్ వచ్చినప్పుడే ప్రత్యర్థులు కొడుతుంటారు. అవి పడకుండా చూసుకోమని చెబుతాం అంతేనని అన్నాడు.

అంబటి రాయుడు ఒక ప్రశ్నవేశాడు. గత కెప్టెన్లతో పోల్చితే మీరెలా వ్యవహరిస్తారు? అంటే ఫీల్డ్ లో నిర్ణయాలు తీసుకోవాల్సింది నేనే అని అన్నాడు. గేమ్ లో కూల్ గా ఉండాలి. అప్పుడే బ్రెయిన్ యాక్టివ్ గా పనిచేస్తుంది. లేకపోతే ఆ ఉద్రేకంలో రాంగ్ డెసిషన్స్ పడతాయని అన్నాడు. కొన్నిసార్లు సహనం కోల్పోయి, మూల్యం చెల్లించుకుంటూ ఉంటాం. అందుకే 99శాతం కూల్ గా ఉండేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News