Big Stories

PM Modi Dials Team India: రోహిత్ కెప్టెన్సీ బాగుంది.. టీమిండియాకు ఫోన్ చేసిన మోదీ

PM Modi Dials Team India ‘Splendid’ Captaincy: టీ20 వరల్ట్ కప్‌లో విశ్వవిజేతగా భారత్ చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుతంగా ఆడింది. రోహిత్ కెప్టెన్సీలో ట్రోఫీ సొంతం చేసుకుంది. 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్‌ను ముద్దాడింది.

- Advertisement -

టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టుకు రాత్రి ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. దేశాన్ని విశ్వవిజేతగా నిలిపిన జట్టుని చూసి భారతీయులు గర్వపడుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వీడియో సందేశం విడుదల చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

తాజాగా, వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియాకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. ఆదివారం స్వయంగా ఫోన్ చేసి టీమిండియా ఆటగాళ్లను అభినందించారు. రోహిత్ కెప్టెన్సీ బాగుందని కితాబిచ్చారు. అద్భుతంగా నాయకత్వం వహించావని రోహిత్ శర్మపై ప్రశంసలు వర్షం కురిపించారు.

ఈ మేరకు రోహిత్, విరాట్ కోహ్లితో ఫోన్‌లో మాట్లాడారు. సూపర్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లిని అభినందించారు. ప్రత్యేకించి ఆఖరి ఓవర్ గురించి ఎక్కువగా మాట్లాడారు. చివరి ఓవర్‌లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన పాండ్యాను అభినందించారు.

దీంతోపాటు అద్భుతంగా క్యాచ్ అందుకున్న సూర్యకుమార్‌ను మెచ్చుకున్నారు. ఇక, టీమిండియా జట్టుకు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ చేసిన కృషికి మోదీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

Also Read: జయహో భారత్.. రోహిత్ సేనాకు పలువురు రాజకీయ ప్రముఖులు ప్రశంసలు

అంతకుముందు, రోహిత్..ద్రవిడ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ట్రోఫీకి కోచ్ రాహుల్ ద్రవిడ్ అర్హుడని చెప్పాడు. దాదాపు 25 ఏళ్లపాటు క్రికెటర్‌గా ద్రవిడ్ సేవలు అభినందనీయమని కొనియాడారు. కోచ్‌గానూ అద్భుతంగా బాధ్యతలు నిర్వర్తించినట్లు తెలిపారు. 2003, 2007 వన్డే ప్రపంచ కప్‌లు ద్రవిడ్ అడుగుదూరంలో మిస్ అయి ఉంటాడు. కానీ ఆయనకు మేము ఈ కప్పును అందిస్తున్నామన్నాడు. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత ద్రవిడ్ ఎంత గర్వపడ్డాడో అందరం చూశామన్నాడు.

టీమిండియా జట్టును విజేతగా నిలపడంలో చాలా కష్టపడినట్లు గుర్తు చేశాడు. కోచ్‌గా ద్రవిడ్ వచ్చిన తర్వాత కుర్రాళ్లకు తమ పాత్రపై స్పష్టమైన అవగాహన వచ్చిందని, టీంకు ఎంపిక, యువ క్రికెటర్లతో ద్రవిడ్ టచ్‌లో ఉండడం గొప్ప విషయమన్నారు. ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం పెంచేందుకు నిరంతరం కృషి చేశారని రోహిత్ తెలిపాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News