Big Stories

Pakistanis angry on Pakistan Cricketers: పాకిస్తాన్ లో ఆగ్రహ జ్వాలలు.. శ్రీలంక, కివీస్ లో ఎందుకు లేదు..?

Pakistanis angry on Pakistan Cricket Board and Cricketers: టీ 20 ప్రపంచకప్ లో పెను సంచలనాలు నమోదయ్యాయి. పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక లాంటి పెద్ద దేశాలు గ్రూప్ దశ నుంచే ఇంటికి చేరాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ కి చావు తప్పి కన్నులొట్టపోయింది. రన్ రేట్ తో బతికి సూపర్ 8కి చేరింది. లేదంటే స్కాట్లాండ్ ముందడుగు వేసి టీ20 ప్రపంచకప్ ని ఒక షేక్ చేసేది.

- Advertisement -

నిజానికి రెండు బలమైన జట్లు, మూడు కొత్త జట్లతో ప్రతి గ్రూప్ ని డిజైన్ చేశారు. అలా చూస్తే ఈ మూడు దేశాల స్థానంలో సూపర్ 8 కి చేరినవి ఏవంటే.. ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, అమెరికా ఉన్నాయి. వీటిలో రావడం రావడమే సూపర్ 8 కి చేరి సంచలనం సృష్టించిన జట్టు అమెరికా కావడం విశేషం.

- Advertisement -

అదే ఇప్పుడు పాకిస్తాన్ దేశంలో మంట పుట్టిస్తోంది. ఆ జట్టుతో ఓడిపోవడమే పాక్ కొంప ముంచింది. అయితే సూపర్ ఓవర్ కి చేరిన ఆ మ్యాచ్ లో అమెరికా అద్భుతంగా ఆడి విజయం సాధించింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో న్యూజిలాండ్, శ్రీలంక దేశాల్లో అక్కడ కొంత వ్యతిరేకత వచ్చినా పాకిస్తాన్ లో మాత్రం తీవ్రంగా ఉంది.

Also Read: బాబర్ నీకంత స్వార్థం పనికిరాదు: షాహిద్ ఆఫ్రిది

2023 ప్రపంచ కప్ తర్వాత బాబర్ అజామ్ ని కెప్టెన్సీ నుంచి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తొలిగించింది. ఆయన స్థానంలో కెప్టెన్ గా షాన్ మసూద్‌ ను ఎంపిక చేసింది. అలా తన నేతృత్వంలోని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనల్లో పాకిస్థాన్ ఆడింది. ఆస్ట్రేలియాతో ఆడిన మూడు టెస్టుల్లో, న్యూజిలాండ్‌లో జరిగిన టీ20 సిరీస్‌లో 1- 4 తేడాతో ఓడిపోయింది.

అలాగే టీ 20 కెప్టెన్ గా షహీన్ ఆఫ్రిదిని నియమించింది. అయినా సరే, ఫలితాల్లో సరైన మార్పు రాలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మారింది. అంతేకాదు ఓడిపోయిన ప్రతి మ్యాచ్ లో కూడా బాబర్ అజామ్ ఒక్కడే ఆడటం, మిగిలిన వాళ్లందరూ వైఫల్యం చెందడంతో టీ 20 ప్రపంచకప్ లో మళ్లీ తిరిగి బాబర్ అజామ్ కి కెప్టెన్సీ అప్పగించింది.

అయితే అక్కడే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్ద తప్పు చేసింది. అదేమిటంటే కొత్తగా ఇద్దరిని కెప్టెన్లుగా చేసింది. వాళ్లిప్పుడు బాబర్ అజామ్ కి ఏకు మేకై కూర్చున్నారు. చెప్పిన మాట వినడం లేదు. గ్రూప్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఆయన కెప్టెన్ అయినా, నేను కెప్టెన్ అయినా, ఫలితాల్లో తేడా లేనప్పుడు మమ్మల్ని మార్చేయాలా? అని ప్రశ్నిస్తున్నారని సమాచారం. దీంతో జట్టులో సమతుల్యత లోపించింది. ఫలితంగా టీ 20 ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ గ్రూప్ దశ నుంచి ఇంటికి వెళ్లింది.

Also Read: Indian Cricketers: పాక్ లోనే కాదు..ఇండియాలోనూ అంతే..! భారత క్రికెటర్లకు చేదు అనుభవాలు

న్యూజిలాండ్, శ్రీలంక దేశాల్లో మాత్రం ప్రజల్లో అంత ఆగ్రహం రాలేదు. నిజానికి కివీస్ దేశంలో అక్కడ ప్రజలని మెచ్చుకోవాలి. వారు ఆటని ఎంజాయ్ చేస్తారు తప్ప, గెలుపు, ఓటములను సమానంగా స్వీకరిస్తారు. క్రికెట్ అంటే జంటిల్మేన్ గేమ్ అనే పదానికి సరైన అర్థం అక్కడే కనిపిస్తుంది.

ఇంగ్లండులో కూడా అదే వాతావరణం ఉంటుంది. కాకపోతే వాళ్లు చావు తప్పి కన్ను లొట్టబోయి అన్నట్టు సూపర్ 8కి చేరారు. ఇక శ్రీలంక దేశంలో 2023 వన్డే వరల్డ్ కప్ లో ఇలాగే పెంట చేసుకుని, తీవ్ర ఇక్కట్ల పాలైంది. దీంతో ఎందుకొచ్చిన గొడవని కామ్ గా ఊరుకున్నారు. ఇదండీ సంగతి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News