Big Stories

PCB: ఫిక్సింగ్ ఆరోపణలు చేసేవారిపై.. పాక్ బోర్డు సీరియస్

PCB Breaks Silence: పాకిస్తాన్ జట్టు అటు వన్డే, ఇటు టీ 20 ప్రపంచకప్ ల్లో గ్రూప్ దశలోనే ఇంటి దారి పట్టింది. ఈ నేపథ్యంలో ఆ దేశంలో సీనియర్ క్రికెటర్లు, ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. తాజాగా టీ 20 ప్రపంచకప్ లో వైఫల్యంతో అవి మరింత ముదిరి, పాకిస్తాన్ జట్టు, కెప్టెన్ పై ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో ఆ దేశ బోర్డు సీరియస్ గా స్పందించింది.

- Advertisement -

బాబర్ అజామ్ టీమ్ పై నిరాధార ఆరోపణలు చేస్తే, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు వెనుకాడమని పీసీబీ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే టీ 20 ప్రపంచకప్ నుంచి ఇండియా కూడా ఇంటికి వచ్చేస్తే, ఇంత గొడవ ఉండేది కాదు. కానీ సూపర్ 8 కి కూడా వెళ్లేపోయేసరికి వారికి పుండు మీద కారం జల్లినట్టుగా ఉంది.

- Advertisement -

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సీనియర్ జర్నలిస్ట్ ముబాషిర్ లుక్మాన్ కుదురుగా ఉండకుండా బాబర్ అజాంపై తీవ్ర ఆరోపణలు చేశాడు. పాక్ కెప్టెన్ మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడ్డాడు.. అనే అర్థం వచ్చేలా మాట్లాడిన వీడియోను విడుదల చేశాడు.

దీనిని ఇలాగే వదిలేస్తే.. ఈ మంట ఎక్కడో అంటుకుంటుందని భావించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వర్గాలు స్పందించాయి. విమర్శలకు కూడా ఓ హద్దు ఉంటుందని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్లు, సమాజం పట్ల వాస్తవిక దృక్పథం ఉన్న జర్నలిస్టులు ఎవరైనా సరే, అదుపులో ఉండాలని అన్నారు.

నోటికి ఎంత వస్తే, అంతా మాట్లాడి, పాకిస్తాన్ ప్రజల్లో లేనిపోని అనుమానాలు కల్పిస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు. ఇది భవిష్యత్ పాక్ క్రికెట్ కి మంచిది కాదని అన్నారు. విమర్శలు సహేతుకంగా ఉన్నంతకాలం మాకెటువంటి అభ్యంతరంలేదని అన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ నిరాధార ఆరోపణలు చేస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఎవరేం మాట్లాడుతున్నారో అన్నీ గమనిస్తూనే ఉన్నామని తెలిపారు.

Also Read: ఫైనల్, సెమీఫైనల్ మ్యాచ్ లకు వర్షం ఆటంకం

ఫిక్సింగ్ అని చెప్పేవారు.. ఆధారాలతో సహా వచ్చి వివరించాలని తెలిపారు. ఆటగాళ్ల విషయంలో మాకెటువంటి సందేహాలు లేవు. కొత్తగా మీరు లేనిపోని అనుమానాలు కల్పించవద్దని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి.. ఓ కొత్త చట్టం తీసుకురాబోతున్నామని సదరు వర్గాలు పేర్కొన్నట్టు పాక్ మీడియా వెల్లడించింది. అయితే వీళ్లిక్కడ ఇలా జుత్తు జుత్తు పట్టుకుంటుంటే అక్కడ పాకిస్తాన్ ఆటగాళ్లు విదేశాల్లో ఎంజాయ్ చేయడం విశేషం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News