Big Stories

Pakistan Captain Babar Azam: ఒక ప్రణాళిక లేకుండా వచ్చాం: ఓటమిపై పాక్ కెప్టెన్ బాబర్ అజామ్!

Pakistan Captain Babar Azam Comments Lost Match with India: గెలవాల్సిన మ్యాచ్ ని చేజేతులా ఓడిపోయిన అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ మాట్లాడాడు. ఓటమికి కారణాలు వివరించాడు. తక్కువ స్కోరు కదా అని, ఒక ప్రణాళిక లేకుండా వచ్చాం. లేదంటే బుమ్రా బౌలింగ్ వచ్చినప్పుడు జాగ్రత్త పడేవాళ్లమని అన్నాడు.

- Advertisement -

పిచ్ బాగానే ఉందని, దానిపై ఎలాంటి ఫిర్యాదులు లేవని అన్నాడు. బంతి మంచిగానే వస్తుంది. కానీ కాస్త స్లోగా ఉంది.దానిని అంచనా వేసేసరికి, బ్యాటర్ పొజిషన్, షాట్ టైమింగ్ కుదరక డాట్ బాల్స్ ఆడాల్సి వచ్చిందని అన్నాడు. అయితే కొన్నిబంతులు మాత్రం ఎక్స్‌ట్రా బౌన్స్ వచ్చాయని వివరించాడు. బౌలింగులో అద్భుతంగా రాణించామని తెలిపాడు.

- Advertisement -

అందుకే టెన్షన్ లేకుండా సింపుల్‌గా, నార్మల్‌గా బ్యాటింగు చేయాలని అనుకున్నాం. స్ట్రైక్ రొటేట్ చేస్తూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీ సాధించాలనుకున్నాం. కానీ కుదరలేదు. వికెట్లు కాపాడుకునే ఉద్దేశంతో అతిగా డాట్ బాల్స్ ఆడామని, అదే కొంప ముంచిందని అన్నాడు. ప్రధాన బ్యాటర్లే ఇబ్బందులు పడితే, ఇక టెయిల్ ఎండర్స్ పై ఎలా ఆశలు పెట్టుకుంటామని అన్నాడు. ఎప్పుడైతే రిజ్వాన్ అయిపోయాడో, అప్పుడే మ్యాచ్ డిసైడ్ అయిపోయిందని అన్నాడు. ఫీల్డింగ్ కొన్ని అద్భుత క్యాచ్ లు పట్టామని, అదే రిషబ్ పంత్ ఇచ్చిన క్యాచ్ లు చాలా వదిలేశాం.. అది కూడా ఓటమికి ఒక కారణమే అన్నాడు.

Also Read: వావ్ ! ఏం గెలుపు .. ఏం ఆనందం.. ఇండో-పాక్ మ్యాచ్ హైలైట్స్

టీమ్ ఇండియా చాలా వ్యూహాత్మకంగా ఆడింది. పవర్ ప్లేను సద్వినియోగం చేసుకుంది. రెండు మెయిన్ వికెట్లు పడిపోయినా రిషబ్ పంత్, అక్షర్ పటేల్ చకచకా పరుగులు తీశారు. ఆ పరుగులే చివరికి టీమ్ ఇండియాను కాపాడాయని అన్నాడు. దానిని మేం ఆచరణలో పెట్టలేకపోయామని అన్నాడు. ఒక వికెట్ పడగానే పరిస్థితి మారిపోయిందని అన్నాడు. తొలి ఆరు ఓవర్లలో మా మార్క్‌ను చూపించలేకపోయామని అన్నాడు.

ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించడానికి ప్రయత్నిస్తాం. ఒక దగ్గర కూర్చొని మా తప్పుల గురించి విశ్లేషించుకుంటాం” అని బాబర్ అజామ్ అన్నాడు. అమెరికాతో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో పాక్ ఓడిపోయిన విషయం తెలిసిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News