Big Stories

PAK Vs USA Highlights: అమెరికా ఎలా గెలిచింది..? పాక్ ఎలా ఓడింది..?

T20 world Cup – PAK Vs USA Highlights: టీ 20 ప్రపంచకప్ లో తొలి మ్యాచ్ ఆడిన పాకిస్తాన్ కి శుభారంభం దక్కలేదు. యూఎస్ఏ ని తక్కువ అంచనా వేసి భారీ మూల్యం చెల్లించింది. నిజానికి యూఎస్ఏ అంత గొప్పగా ఆడుతుందని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే అమెరికాలో పిచ్ లు అన్నీ బౌలింగ్ కి అనుకూలంగా ఉండటం, గ్రౌండ్ పరిణామాలు పెద్దవిగా ఉండటంతో పరుగులు అంత తేలిగ్గా రావడం లేదు. అంతేకాకుండా ఆటగాళ్లు గాయాలపాలవుతున్నారు.

- Advertisement -

ఈ సమయంలో ఈ పిచ్ లపై 160 పరుగులు చేయడమే గొప్పని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అనడం, అందుకు తగినట్టుగా మహా మహాజట్లన్నీ కూడా పడుతూ లేస్తూ ఆడటంతో అందరూ కరెక్టే అంటున్నారు. రోహిత్ శర్మకు మద్దతు ప్రకటిస్తున్నారు.

- Advertisement -

ఈ క్రమంలో అమెరికాతో జరిగిన మ్యాచ్ లో పాక్ చేసిన 159 పరుగులు సరిపోతాయని అంతా అనుకున్నారు. కానీ యూఎస్ఏ మాత్రం జాగ్రత్తగా వికెట్లను కాపాడుకుంటూ, రన్ రేట్ తగ్గకుండా స్ట్రయిక్ రొటేట్ చేస్తూ, షాట్లకు పోకుండా సింగిల్స్ తీస్తూ జాగ్రత్తగా ఆడి మ్యాచ్ ని చివరివరకు తీసుకువచ్చింది.

నిజానికి ఈ మ్యాచ్ పై మొదట నుంచి ఎవరికి పెద్ద అంచనాలు లేవు. ఎందుకంటే యూఎస్ఏ కొత్తగా ప్రపంచకప్ లో అడుగుపెట్టింది. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అమెరికా విజయం సాధించడంతో ఆశ్చర్యపోతున్నారు. కొందరు అనేమాట ఏమిటంటే.. ఇక్కడ సొంత మైదానాలు కావడంతో అమెరికా అలవోకగా విజయాలు సాధిస్తోందని అంటున్నారు.

కాకపోతే మ్యాచ్ మొదటి నుంచి అటు బౌలింగు, ఇటు బ్యాటింగులో ఎక్కడా అమెరికా తడబడలేదు. అనుభవలేమిని ప్రదర్శించలేదు. సాధికారికంగానే ఆడిందని మరికొందరు చెబుతున్నారు. పాకిస్తాన్ తేలికగా తీసుకోవడం వల్లే ఓటమి పాలైందని అంటున్నారు.

ఇకపోతే అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ అప్పుడే ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు. మేం ఇదే ఊపుతో ఇండియాని కూడా ఓడిస్తామని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో చిన్నజట్టేకదాని అమెరికాని తక్కువ అంచనావేయకుండా, కొంచెం జాగ్రత్తగా ఆడాలని సీనియర్లు అప్పుడే  కెప్టెన్ రోహిత్ శర్మకి సూచిస్తున్నారు.

Also Read: IND vs PAK: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఆ మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్ ?

అంతేకాదు.. దెబ్బతిన్న పులిలా పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుందని, ఆ పగను ఇండియా మీద చూపిస్తుంది కాబట్టి, ఆదివారం జరగబోయే మ్యాచ్ లో టీమ్  ఇండియా రెట్టించిన ఉత్సాహంతో ఆడాలని పేర్కొంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News