Big Stories

OMA vs ENG ICC Men’s T20 World CUP : 3.1 ఓవర్లలో గెలిచిన ఇంగ్లండ్ : పసికూన ఒమన్ విలవిల

OMA vs ENG ICC Men’s T20 World CUP(Sports news headlines): టీ 20 ప్రపంచకప్ లో మరో సంచలనం నమోదైంది. గ్రూప్ బిలో భాగంగా ఇండియా వర్సెస్ ఒమన్ మధ్య అంటిగ్వా వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలో డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ జూలు విదిల్చింది. కేవలం 3.1 ఓవర్లలోనే విజయం సాధించి రికార్డ్ బ్రేక్ చేసింది.

- Advertisement -

ఎట్టకేలకు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ జూలు విదిల్చింది. సూపర్-8కు అర్హత సాధించాలంటే భారీ విజయం సాధించాల్సిన తరుణంలో పసికూన ఒమన్‌పై పంజా విసిరింది. ఆంటిగ్వా వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదట బంతితో ఆటాడించింది. తర్వాత బ్యాటుతో చెలరేగింది. చివరికి ఎనిమిది వికెట్ల తేడాతో ఘనంగా నెగ్గింది. ఎట్టకేలకు మూడు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్ బోణీ కొట్టింది.

- Advertisement -

స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడం ఇంగ్లండ్ కి శాపంగా మారింది. దీంతో ఒక పాయింట్ తో ఉండిపోయింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ఓటమిపాలైంది. ఇప్పుడు గెలవక తప్పని పరిస్థితుల్లో భారీ రన్ రేట్ తో గెలవాల్సి రావడంతో ఒమన్ ని ఒక ఆటాడుకుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగ్ కి వచ్చిన ఒమన్ 13.2 ఓవర్లలో 47 పరుగులకి ఆలౌట్ అయ్యింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ కేవలం 3.1 ఓవర్ లో 2 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసి రన్ రేట్ పెంచుకుంది.

Also Read : గెలిచిన బంగ్లా.. పోరాడి ఓడిన నెదర్లాండ్స్

48 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ 3 బంతుల్లో 2 సిక్స్ లతో 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత కెప్టెన్ జోస్ బట్లర్ 8 బంతుల్లో 1 సిక్సర్, 4 ఫోర్ల సాయంతో 24 పరగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తర్వాత విల్ జాక్స్ (5) తక్కువ పరుగులకే అయిపోయాడు. అనంతరం వచ్చిన జానీ బెయిర్ స్టో 2 బంతుల్లో 2 ఫోర్లు కొట్టి 8 పరుగులు చేసి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. మొత్తానికి ఇంగ్లండ్ 3.1 ఓవర్ లో 50 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది.

ఒమన్ బౌలింగులో బిలాల్ ఖాన్ 1, కలీముల్లా 1 వికెట్ తీసుకున్నారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఒమన్ కి ఓపెనర్లే కాదు, ఎవరూ సరిగ్గా ఆడలేదు. ఒకే ఒక్కడు షోయబ్ ఖాన్ మాత్రమే రెండంకెల స్కోరు అది కూడా 11 చేశాడు. ముగ్గురు డక్ అవుట్లు అయ్యారు. ముగ్గురైతే ఒకొక్క పరుగు చేశారు. ఒకరు 2 పరుగులు, ఇద్దరేమో 5 పరుగులు చొప్పున చేశారు. కెప్టెన్ అకిబ్ లియాస్ (8) చేశాడు. మన ప్రవాస భారతీయుడు కశ్యప్ ప్రజాపతి (9) చేశాడు. ఇలా చివరికి 13.1 ఓవర్ లో 47 పరుగులకి ఆలౌట్ అయ్యింది.

ఇంగ్లండ్ బౌలింగులో ఆదిల్ రషీద్ 4, మార్క్ వుడ్ 3, జోఫ్రా 3 వికెట్లు తీశారు. ఇప్పుడు స్కాట్లాండ్ 5 పాయింట్లతో ఉంది. తను ఇంకో మ్యాచ్ ఆడాలి. అందులో గెలిచిందంటే ఇంగ్లండ్ ఇంటికి రావల్సిందే. లేదా తను అక్కడ ఓడిపోయి, ఇక్కడ ఇంగ్లండ్ మరో మ్యాచ్ గెలిస్తే 5 పాయింట్లు అవుతాయి. అప్పుడు రన్ రేట్ ప్రకారం ఇంగ్లండ్ సూపర్ 8 కి చేరుతుంది.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News