Big Stories

Vikram Rathour: విరాట్ ఫామ్ గురించి ఆందోళన అవసరం అక్కర్లే.. టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్..

Vikram Rathour Comments On Virat Kohli Form: టీమ్ ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ప్రస్తుతం జరుగుతున్న ICC పురుషుల T20 ప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లి ఫామ్‌కు సంబంధించి ఆందోళన అవసరం లేదని తేల్చిచెప్పాడు. కోహ్లీ సింగిల్ డిజిట్ గణాంకాలు అతనిపై ప్రభావం చూపవని అన్నాడు. అయినా విరాట్ కోహ్లీ పరుగుల దాహంతో ఉండటం మంచిదేనని విక్రమ్ రాథోడ్ అన్నాడు.

- Advertisement -

విరాట్ ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లోకి అద్భతమైన ఫామ్‌లోకి వచ్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్‌లో 15 మ్యాచులు ఆడిన కోహ్లీ 741 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

- Advertisement -

అయితే ఆ తరువాత జరుగుతున్న ప్రపంచ కప్‌లో మాత్రం అతడు తడబడుతున్నాడు. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు మాత్రమే చేసిన కోహ్లీ, పాకిస్థాన్‌‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు పరుగులు మాత్రమే చేశాడు. ఇక యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దీంతో కోహ్లీపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. అయితే కోహ్లీ ఫామ్‌పై టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ స్పందించాడు.

విక్రమ్ రాథోడ్ మాట్లాడుతూ.. తాను వచ్చిన ప్రతీసారీ విరాట్ బాగా రాణిస్తున్నాడా లేదా అనే ప్రశ్నపై స్పందించడానికి ఇష్టపడతాను.. విరాట్ ఫామ్‌పై అస్సలు ఆందోళన లేదు అని అన్నడు.

Also Read: కోహ్లీకి ఏమైంది..? పాక్ పై నాటౌట్ రికార్డ్ అంతేనా..?

అతను ఐపీఎల్‌లో అద్భుతంగా ఆడాడు.. ఇక్కడ రెండు చిన్నపాటి స్కోర్లు విరాట్ బ్యాటింగ్‌ను ఏ మాత్రం ప్రభావం చేయలేవని అన్నాడు. తదుపరి సూపర్ 8 పోరులో విరాట్ కోహ్లీ విజృంభిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News