Big Stories

Virat Kohli’s Poor Performance: కోహ్లీకి ఏమైంది..? పాక్ పై నాటౌట్ రికార్డ్ అంతేనా..?

Virat Kohli’s Poor Performance in T20 World Cup 2024: టీమ్ ఇండియాకి వెన్నెముకగా నిలిచే విరాట్ కోహ్లీ.. ఎందుకిలా అవుట్ అయిపోయాడు? అని ఒకటే ప్రశ్నలు. టీ 20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ ల్లో అత్యధిక సార్లు నాటౌట్ గా ఉన్న కొహ్లీకి ఈసారి ఏమైంది? మరీ బొత్తిగా 4 పరుగులా? ఇవే ప్రశ్నలతో నెట్టిల్లు హోరెత్తిపోతోంది. నిజానికి పాకిస్తాన్ పై మ్యాచ్ అనేసరికి, ఒక కసితో, రెట్టించిన ఉత్సాహంతో ఆడే విరాట్ కొహ్లీకి ఏమైంది? ఎందుకిలా అవుట్ అయ్యాడు? అని సవాలక్ష ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

టీ 20 ప్రపంచకప్ ల్లో పాకిస్తాన్ తో ఇప్పటివరకూ ఆరు మ్యాచ్ లు ఆడిన విరాట్ 312 పరుగులు చేశాడు. అవి ఎలా చేశాడో ఒకసారి చూద్దాం..

- Advertisement -

2021 లో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్నాడు. ఆరోజు మ్యాచ్ లో 49 బంతుల్లో 57 పరుగులు చేశాడు. అయితే మ్యాచ్ ఓడిపోయినా, తనొక్కడే ఒంటరిగా నిలిచి ఆడాడు. 2012లో.. విరాట్ కోహ్లీ 61 బంతుల్లో 78 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

Also Read: ఒక ప్రణాళిక లేకుండా వచ్చాం : పాక్ కెప్టెన్ బాబర్ అజామ్

2014లో 32 బంతుల్లో 36 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. 2016లో 37 బంతుల్లో 55 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. 2022లో అయితే ఏకంగా 53 బంతుల్లో 82 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. ఆరు మ్యాచ్ ల్లో ఐదింట్లో నాటౌట్ గా ఉన్నాడు. మరిదేంటి? ఈసారి 4 పరుగులకే అవుట్ అయిపోయాడని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

తను ఫామ్ లో లేడా? అంటే అదేం లేదు. మొన్ననే ఐపీఎల్ లో ఆర్సీబీ తరఫున ఆడి, అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. అంతకుముందు వన్డే వరల్డ్ కప్ టోర్నమెంటులో కూడా తనే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంటుగా నిలిచాడు. టన్నుల కొద్దీ పరుగులు చేయగల ఫామ్ లో ఉన్నాడు. ఈసారెందుకిలా జరిగింది.?

Also Read: శివమ్ దుబె అవుట్.. కొత్త బ్యాటర్ ఇన్ ! టీమ్ ఇండియాలో మార్పులు- చేర్పులు

న్యూయార్క్ పిచ్ ని అంచనా వేయడంలో టెన్షన్ పడుతున్నాడా? లేక ఓపెనర్ గా ఇబ్బంది పడుతున్నాడా? రకరకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సరే కోహ్లీ ఆడకపోయినా, రోహిత్ ఆడకపోయినా మ్యాచ్ గెలిచారు కాబట్టి పర్వాలేదు. అదే ఓడిపోయి ఉంటే, ప్రతీ ఒక్కరు జవాబుదారీగా ఉండాల్సి వచ్చేది. ఇప్పటికి ఆడిన రెండు టీ 20 ప్రపంచకప్ మ్యాచ్ ల్లో కోహ్లీ ఆశించిన రీతిలో ఆడటం లేదు. రేపు యూఎస్ఏతో జరిగే మ్యాచ్ లోనైనా విరాట్ మంచిగా ఆడాలని కోరుకుందాం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News