Big Stories

Hardik Pandya : ముంబై సెగ.. టీమ్ ఇండియాలో మండుతోందా ?

Hardik Pandya in T20 Worldcup Matches : టీ 20 ప్రపంచకప్ లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అదర గొడుతున్నాడు. అటు బ్యాటింగు, ఇటు బౌలింగులో భారత్ కి వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు. ముఖ్యంగా సూపర్ 8 లో ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో సూర్యకుమార్ కి తోడుగా నిలిచి, మంచి భాగస్వామ్యం నిర్మించిన తీరు అద్భుతంగా ఉంది. 24 బంతుల్లో విలువైన 32 పరుగులు చేశాడు.

- Advertisement -

అయితే ఐపీఎల్ లో పాండ్యా ఆడిన ఆటకి, ఇక్కడ టీ 20 ప్రపంచకప్ లో ఆడుతున్న ఆటకి అసలు పొంతన లేదన్నట్టు ఆడుతున్నాడు. ఒక దశలో సెలక్షన్ కమిటీ ఎంపిక చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించిందనే వార్తలు వచ్చాయి. కాకపోతే సీనియర్ కావడం, విదేశాల్లో ఆడిన అనుభవం రెండు కలిసి వచ్చి అతన్ని ఎంపికచేశారని అన్నారు. ఇప్పుడదే కలిసి వచ్చింది. ఐపీఎల్ లో ఆడిన అతగాడేనా ఇతను? అని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

- Advertisement -

మొత్తానికి టీమ్ ఇండియాలో తన పాత్ర ఎంత ముఖ్యమో అందరికీ చాటి చెప్పాడు. అలాగే విమర్శకుల నోళ్లు మూయించాడు. ఇప్పటివరకు టీ 20 ప్రపంచకప్ లో 4 మ్యాచ్ లు ఆడిన పాండ్యా 7 వికెట్లు తీసుకున్నాడు. 2 మ్యాచ్ ల్లో బ్యాటింగ్ చేయలేదు. పాకిస్తాన్ పై 7, ఆఫ్గాన్ పై 32 పరుగులు చేశాడు. రాబోవు సూపర్ 8 మ్యాచ్ ల్లో తన పాత్ర మరింత కీలకం కానుంది.

Also Read : ఈ ఒక్కటీ గెలిస్తే ..సెమీస్ కి చేరిపోవచ్చు

అయితే టీమ్ ఇండియాలో ఆడుతున్న సూర్య, రోహిత్, బుమ్రా, పాండ్యా నలుగురు ఆటగాళ్లు ఐపీఎల్ లోని ముంబయి ఇండియన్స్ జట్టులో ఉన్నారు. అక్కడ విభేదాలు ఇక్కడికేమీ తీసుకురావడం లేదు కదా అనే సందేహాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆ సెగ అంతర్గతంగా మండుతూనే ఉందని, అప్పుడప్పుడు అది బయటపడుతోందని అంటున్నారు.

ముఖ్యంగా పాండ్యా వికెట్లు తీసినప్పుడు రోహిత్ శర్మ పెద్దగా స్పందించడం లేదు. అదే బుమ్రా, ఇతరులు తీస్తే భుజాలపై చేయివేసి, హగ్ లు ఇస్తున్నాడు. ఆ స్పందన పాండ్యా విషయంలో కనిపించడం లేదని అంటున్నారు. ఆఫ్గాన్ పై బౌలింగ్ చేస్తూ పాండ్యా ఒక ఎల్బీని అప్పీలు చేశాడు. అది అంపైర్ ఇవ్వకపోతే రివ్యూకి వెళ్లారు. రోహిత్ శర్మకి ఇష్టం లేనట్టుగా ఫేస్ పెట్టాడు. అయితే వికెట్ రాలేదు. రివ్యూ వృధా కావడంతో తన మూతిని అష్టవంకరలు తిప్పుతూ విన్యాసం చేశాడు. కెమెరామెన్ క్లోజప్ లో దానిని చూపించాడు.

ఇదిలా ఉండగా మరోవైపు హార్దిక్ పాండ్యా ఏం చేస్తున్నాడంటే.. జస్ప్రీత్ బుమ్రాకి దూరంగా ఉంటున్నాడు. అది ఆఫ్గాన్ మ్యాచ్ లో స్పష్టంగా తెలిసింది. మ్యాచ్ గెలిచిన తర్వాత.. బుమ్రా అందరినీ అభినందిస్తూ పాండ్యా దగ్గరికి వెళుతుంటే, తను దూరంగా వెళ్లిపోవడం అందరి కంటా పడింది. దాంతో బుమ్రా చేసేదేమీలేక నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. ఇంకా కీలకమైన మ్యాచ్ లు ఇన్ని ఉండగా.. వీళ్లేంటి? ఇలా ఉన్నారు. పాకిస్తాన్ అందుకే కదా ఇంటికెళ్లిందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News