BigTV English

Naseem Shah:బాడీ షేమింగ్.. పాక్ పరువు తీసిన నసీం షా!

Naseem Shah:బాడీ షేమింగ్.. పాక్ పరువు తీసిన నసీం షా!

Naseem Shah:బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న పాకిస్థాన్ యువ పేసర్ నసీం షా… అంతర్జాతీయంగా దేశం పరువు తీశాడు. తన తోటి పాక్ ఆటగాడిని ఎగతాళి చేసి… యావత్ క్రీడా ప్రపంచం నుంచి ఛీత్కారాలు ఎదుర్కొంటున్నాడు. అతని ఓవరాక్షన్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… నెటిజన్లంతా నసీం షాపై విరుచుకుపడుతున్నారు. సొంత దేశం ఆటగాడితో ఇలా ప్రవర్తించావు కాబట్టి సరిపోయింది గానీ… మరో దేశం ఆటగాడితో ఇలాగే ప్రవర్తించి ఉంటే అభిమానులు ఈపాటికి చితగ్గొట్టి ఉండేవాళ్లు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు… ఏ దేశానికి చెందిన ఆటగాడినైనా బాడీ షేమింగ్ చేయడం సరికాదని హితబోధ చేశారు. ఇంకొందరు ఇంకాస్త ముందుకెళ్లి… షేమ్‌, షేమ్‌ నసీం షా.. షేమ్‌, షేమ్‌ పాకిస్తాన్‌ అంటూ కామెంట్ చేస్తున్నారు.


బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా వేర్వేరు జట్ల తరఫున ఆడిన పాక్ ఆటగాళ్లు నసీం షా, ఆజంఖాన్… మైదానంలో ఎదురుపడ్డారు. బ్యాటింగ్ చేసేందుకు వస్తున్న ఆజంఖాన్‌ను నసీం షా సరదాగా వెళ్లి ఢీ కొట్టాడు. నసీంను పట్టించుకోని ఆజంఖాన్‌, అతణ్ని పక్కకు నెట్టేసి క్రీజ్‌వైపు వెళ్లాడు. అయినా అతణ్ని నసీం షా వదల్లేదు. ఆజంఖాన్ వెనకాలే… అతనిలా నడుస్తూ ఇమిటేట్ చేశాడు. అతని శరీరతత్వంపైనా నసీం షా వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు. ఇదంతా… మ్యాచ్‌ను రికార్డ్ చేస్తున్న కెమెరాల కంట పడింది. అంతే… ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. సాటి ఆటగాడి పట్ల నసీం షా వ్యవహరించిన తీరుపై… అంతా దుమ్మెత్తిపోస్తున్నారు.

ఆజంఖాన్… పాక్‌ దిగ్గజ వికెట్‌కీపర్‌ మొయిన్‌ ఖాన్‌ తనయుడు. అతని విషయంలోనే నసీం షా ఇలా ప్రవర్తించడంతో… పాక్ క్రికెటర్లతో పాటు, ఆ దేశ క్రికెట్ అభిమానులు కూడా షాకయ్యారు. మైదానంలో ఇదేం విపరీత ప్రవర్తన అంటూ అంతా అతనికి చివాట్లు పెడుతున్నారు. నసీం షా తెలిసి చేసినా, తెలియక చేసినా… సరగాదా చేసినా, కావాలని చేసినా… తప్పేనని మండిపడుతున్నారు.


Sports Allocation: బడ్జెట్ పెరిగింది.. కుమ్మేయడమే మిగిలింది..

T20:కప్ చేతిలో పెట్టాడు.. కూల్ చేశాడు..

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×