BigTV English

Sports Allocation: బడ్జెట్ పెరిగింది.. కుమ్మేయడమే మిగిలింది..

Sports Allocation: బడ్జెట్ పెరిగింది.. కుమ్మేయడమే మిగిలింది..

Sports Allocation:బడ్జెట్‌లో క్రీడారంగానికి భారీగా కేటాయింపులు పెంచింది… కేంద్రం. గత బడ్జెట్ కంటే ఈసారి క్రీడలకు రూ.335 కోట్లు పెంచారు. 2022-23 బడ్జెట్‌లో క్రీడా రంగానికి రూ.3062 కోట్ల మేర కేటాయింపులు జరగ్గా.. ఈ ఏడాది అది రూ.3397 కోట్లకు పెరిగింది. బడ్జెట్‌ చరిత్రలో క్రీడారంగానికి ఈ స్థాయిలో నిధులు మంజూరు కావడం ఇదే మొదటిసారి. గత ఐదేళ్ల కేంద్ర బడ్జెట్‌లను పరిశీలిస్తే… ఒకసారి మినహా, ఏటా ఓ మోస్తరు స్థాయిలో క్రీడలకు నిధులు పెరుగుతూ వస్తున్నాయి. ఈ ఏడాది ఆసియా క్రీడలు, వచ్చే ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌ ఉన్న నేపథ్యంలో… బడ్జెట్‌లో క్రీడారం‍గానికి మరింత ప్రాధాన్యత ఇచ్చారు.


2018-19 బడ్జెట్లో క్రీడలకు రూ.2,197 కోట్లు కేటాయించగా… 2019-20 బడ్జెట్లో రూ.579 కోట్లు పెంచి… రూ.2,776 కోట్లు కేటాయించారు. 2020-21 బడ్జెట్లో మాత్రం కేవలం రూ.50 కోట్లు మాత్రమే పెంచి… రూ.2,826 కోట్లు ఇచ్చారు. ఇక 2021-22లో అయితే… రూ.230 కోట్లు తగ్గించి… రూ.2,596 కోట్లకు పరిమితం చేశారు. ఇక గత బడ్జెట్లో రూ.466 కోట్లు పెంచి… రూ.3,062 కోట్లు కేటాయించారు. ఇప్పుడు రూ.335 కోట్లు పెంచి… రూ.3397 కోట్లు ఇచ్చారు.

స్పోర్ట్స్‌ బడ్జెట్‌లో ఖేలో ఇండియాకు రూ.1045 కోట్ల నిధులు కేటాయించారు. గత ఏడాది కంటే ఇప్పుడు రూ.439 కోట్లు ఎక్కువగా కేటాయించిందంటే… ఈ పథకానికి కేంద్రం ఎంత ప్రాధాన్యం ఇస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇక స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు రూ.785.52 కోట్ల నిధులు ఇచ్చారు. అథ్లెట్లకు జాతీయ శిబిరాలు నిర్వహించడంతో పాటు, వారికి మౌలిక సదుపాయాలు కల్పించడం… వారికి అవసరమైన సామాగ్రి కొనడం సాయ్‌ పని. ఇక నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ కు రూ.325 కోట్లు, నేషనల్ సర్వీస్ స్కీమ్ కు రూ.325 కోట్లు, నేషనల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఫండ్ కు రూ. 15 కోట్లు కేటాయించారు.


Related News

AUS Vs NZ : రాబిన్స‌న్ సెంచ‌రీ చేసినా.. ఆస్ట్రేలియానే విజ‌యం

Tilak-Dube : శివమ్ దూబేకు తిలక్ వర్మ వెన్నుపోటు…? గంభీర్ కు జరిగిన అన్యాయమే ఇప్పుడు రిపీట్

Mohsin Naqvi : సూర్య.. నా ఆఫీస్‍‌కొచ్చి కప్పు తీసుకెళ్లు… నఖ్వీ కొత్త కండీష‌న్లు

Vaibhav Suryavanshi : ఆస్ట్రేలియాపై సూర్యవంశీ సూపర్ సెంచరీ… ఏకంగా 8 సిక్సర్లు

Tilak Verma : త‌మ్ముడు తిల‌క్‌…ఆంధ్ర వాడి దెబ్బ.. పాకిస్తాన్ వాడి అబ్బా… జై జగన్ అంటూ

Saeed Ajmal Cheque : పాక్ PM ఇచ్చిన చెక్కులు బౌన్స్..ఆ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం

Ind vs SL: వరల్డ్ కప్ లో టీమిండియా బోణీ… శ్రీలంక చిత్తు చిత్తు

PCB : భారత్ చేతిలో ఓటమి.. పాక్ ప్లేయర్లకు PCB శిక్ష

Big Stories

×