Big Stories

ICC Men’s T20 World Cup : టీ 20 ప్రపంచకప్ లో మ్యాచ్ ఫిక్సింగ్ ప్రకంపనలు.. మళ్లీ ఇదెక్కడి గొడవరా బాబూ !

Match fixing in t20 World Cup(Sports news in telugu): మ్యాచ్ ఫిక్సింగ్ అనే భూతం ఇక ప్రపంచ క్రికెట్ లో లేదని, అంతా సమసిపోయిందని అనుకున్నారు. కానీ అదింకా బతికే ఉందని తెలిసి, క్రీడాభిమానులందరూ ఒక షాక్ కి గురయ్యారు. మ్యాచ్ ఫిక్సింగ్ అనే భూతం భారత్ క్రికెట్ ని ఎలాంటి కుదుపు కుదిపిందో, ఎలాంటి గొప్ప క్రీడాకారుల భవిష్యత్తు నాశనమైపోయిందో అందరికీ తెలిసిందే.

- Advertisement -

ఈ భూతం టీ 20 ప్రపంచకప్ 2024లో మళ్లీ తెరపైకి వచ్చింది. కెన్యా మాజీ క్రికెటర్ ఒకరు ఉగండా జట్టు ఆటగాడిని సంప్రదించాడంట. తక్షణం ఆ ఆటగాడు.. ఈ సమాచారాన్ని వెంటనే, ఐసీసీ అవినీతి నిరోధక శాఖ విభాగానికి తెలియజేశాడంట.

- Advertisement -

గ్రూప్ సిలో ఉన్న ఉగండా.. నాలుగు మ్యాచ్ లు ఆడి, ఒక దాంట్లో విజయం సాధించింది. ఈ క్రమంలో కెన్యాతో కూడా ఒక మ్యాచ్ ఆడింది. అక్కడే మోళీ చేయమని చెప్పడంతో ఆ ఆటగాడు నిరాకరించినట్టు తేలింది. అంతేకాదు సమాచారాన్ని ఐసీసీకి చెప్పడంతో ఫిక్సర్లు ఎక్కడికక్కడ గప్ చుప్ అయ్యారని అంటున్నారు.

Also Read : పాక్ వైఫల్యాలకు కారణాలివే: కోచ్ గ్యారీ కిర్ స్టెన్

అయితే మ్యాచ్ ఫిక్సింగ్ అంటే అతిగా ఉలిక్కిపడేది భారతదేశమే అని చెప్పాలి. ప్రపంచకప్ మ్యాచ్ ల్లో భారత్ ఓడిపోయిన ప్రతిసారి మ్యాచ్ ఫిక్సింగ్ మాట తెరపైకి వచ్చేది. ముఖ్యంగా ఆ రోజుల్లో టీమ్ ఇండియా కెప్టెన్ గా ఉన్న మహ్మద్ అజారుద్దీన్, అజయ్ జడేజా లాంటి క్రీడాకారులు వివాదాల్లో చిక్కుకున్నారు. దీంతో వారిని బీసీసీఐ బహిష్కరించింది.

అలా వారి క్రీడా జీవితాలు మసకబారిపోయాయి. తదుపరి కాలంలో పేసర్ శ్రీశాంత్ కూడా ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. తను న్యాయపోరాటం చేసి, చేసి అలసిపోయాడు. మొత్తానికి కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చేసరికి, చూస్తే తన వయసైపోయింది. అయితే తను కూడా అనవసర వివాదాలు కొని తెచ్చుకున్నాడు. అందరితో గొడవలు పెట్టుకున్నాడు. మొత్తానికి తన ఆవేశం… అతని క్రీడా భవిష్యత్తుని నాశనం చేసిందని అంతా అంటారు.

ఇప్పుడు ఉగండా ప్లేయర్ ఉదంతం బయటకు వచ్చేసరికి, భారత్ చిన్నగా షేక్ అయ్యింది. ఎందుకంటే ఆనాటి ఘటనలను భారతీయులెవరూ మరిచిపోలేరు. భారత్ క్రికెట్ ని అంధకారంలోకి నెట్టేసి, కోట్లాదిమంది భారతీయుల మనసులు ముక్కలు చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ ఘటన భారత క్రికెట్ డైరీలో ఒక చీకటి పేజీ అని చెప్పాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News