Big Stories

Jasprit Bumrah: నేనిప్పుడే మొదలు పెట్టా.. రిటైర్మెంట్‌పై బుమ్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Jasprit Bumrah makes retirement statement: టీ20 ప్రపంచకప్ 2024 విశ్వవిజేతగా భారత్ నిలిచింది. ఈ మేరకు గురువారం భారత్‌కు వచ్చిన టీమిండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అనంతరం టీమిండియా నేరుగా ముంబై ఎయిర్ పోర్ట్‌కు ప్రత్యేక విమానంలో వెళ్లారు. అక్కడినుంచి సాయంత్రం 5 గంటలకు రోడ్ షో నిర్వహించారు. ఈ మేరకు వాంఖడే స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో ఆటగాళ్లను అభినందించడంతోపాటు ప్రైజ్ మనీ అందజేశారు. ఈ విజయోత్సవ వేడుల్లో విరాట్ కోహ్లి ఓ ఆసక్తికర విషయం పంచుకున్నాడు. బుమ్రా ఎంతకాలం ఆడితే అప్పటి వరకు జట్టులోనే కొనసాగించాలని సూచించాడు.

- Advertisement -

టీ20 ప్రపంచ కప్ గెలిచిన అనంతరం టీమిండియా కీలక ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించారు. టీ20 ఫార్మాట్ నుంచి విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వీడ్కోలు చెప్పారు. ఈ క్రమంలో వాంఖడే వేదికగా జరిగిన విజయోత్సవ కార్యక్రమంలో బుమ్రా ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడారు. టోర్నీ విజయంలో తన పాత్ర కూడా ఉండడం సంతోషంగా ఉందన్నారు. స్టేడియానికి అభిమానులు తరలిరావడం మరచిపోలేమన్నారు.

- Advertisement -

అంతకుముందు అండర్ 19 క్రికెట్ ఆడేందుకు వాంఖడే స్టేడియానికి వచ్చానని..ఆ తర్వాత కూడా చాలాసార్లు వచ్చినట్లు తెలిపాడు. కానీ ఇప్పుడు రావడం అద్భుతంగా అనిపిస్తుందని తన మనసులో ఉన్న మాటలను బయటకు చెప్పాడు. విరాట్, రోహిత్, జడేజా వంటి సీనియర్ ఆటగాళ్లతో ఆడడం అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించాడు.

Also Read: వింబుల్డన్‌లో మరో సంచలనం, మూడో రౌండ్‌లో జకోవిచ్..

ఈ సమయంలో బుమ్రాకు టీ20ల నుంచి రిటైర్మెంట్‌పై ఎదురైన ప్రశ్నకు స్పందించాడు. రిటైర్మెంట్ ఆలోచనలకు చాలా దూరంగా ఉన్నట్లు స్పష్టం చేశాడు. ‘నేను ఇప్పుడూ మొదలు పెట్టినా. ఇప్పటివరకు సాధించిన విజయాలు ఆనందం ఇస్తున్నాయి. ఇప్పట్లో రిటైర్మెంట్ ఆలోచన లేదు. దానికి చాలా సమయం ఉంది. నేను యువ ప్లేయర్ గానే భావిస్తా. ఫ్యాన్స నుంచి అపూర్వ స్పందన దక్కింది. విరాట్, రోహిత్ జట్టును ముందుండి నడిపించారు.’ అంటూ వ్యాఖ్యలు చేశాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News