Big Stories

T20 World Cup 2024: జస్ప్రీత్ బూమ్రా రికార్డ్ బ్రేక్

T20 World Cup 2024: టీ 20 ప్రపంచ కప్ క్రికెట్ లో ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో.. టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఒక రికార్డ్ బ్రేక్ చేశాడు. అదేమిటంటే అంతర్జాతీయ టీ 20ల్లో భారత్ తరఫున అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్ గా బుమ్రా రికార్డ్ నెలకొల్పాడు.

- Advertisement -

ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో బుమ్రా ఒక మెయిడిన్ ఓవర్ వేశాడు. టీ 20ల్లో ఇది బుమ్రాకు 11వ మెయిడిన్ ఓవర్ కావడం విశేషం. అంతకుముందు భువనేశ్వర్ కుమార్ (10) మెయిడిన్ ఓవర్లతో ఉన్నాడు. ఈ మ్యాచ్ ద్వారా తనని బుమ్రా అధిగమించాడు. ఓవరాల్ గా చూస్తే తను ఇంతవరకు టీ 20 మ్యాచ్ లలో 63 ఓవర్లు వేశాడు. వాటిలో 11 మెయిడిన్ ఓవర్లు ఉన్నాయి.

- Advertisement -

అంతర్జాతీయంగా చూస్తే బుమ్రాకన్నా ఎక్కువ ఓవర్లు వేసినవారున్నారు. వారేదో పెద్ద పెద్ద జట్ల వాళ్లు కాదు.. చాలా చిన్న జట్ల బౌలర్లు అంతర్జాతీయ మ్యాచ్ లలో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేయడం విశేషం. ఇంతకీ వారెవరంటే ఉగాండా బౌలర్ ఎఫ్ నుసుబుగా 15 మెయిడిన్ ఓవర్లు వేసి అగ్రస్థానంలో ఉన్నాడు.

కెన్యా బౌలర్ సోంగోచ్ 12 మెయిడిన్ ఓవర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అయితే ఐసీసీ టాప్ 8 ర్యాంక్స్‌ జట్లలో అత్యధిక ఓవర్లు మెయిడిన్ చేసిన బౌలర్‌ మాత్రం బుమ్రా ఒక్కడే ఉన్నాడు. ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 3 ఓవర్లు వేసి 6 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక మెయిడిన్ ఓవర్ ఉంది.

30 ఏళ్ల బుమ్రా భారత్ తరఫున 36 టెస్టులు, 89 వన్డేలు, 63 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 384 వికెట్స్ పడగొట్టాడు. ప్రస్తుతం భారత జట్టుకు ప్రధాన ఆయుధంగా ఉన్నాడు. ఐపీఎల్ లో చూస్తే ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీ మార్పుపై తన నిరసనను బహిరంగంగానే వ్యక్తం చేశాడు.

Also Read: వార్ వన్ సైడ్ : తొలిమ్యాచ్ లో టీమిండియా ఘనవిజయం

బహుశా తను కూడా రేపు ముంబయి నుంచి బయటకు వచ్చి, వేరే ఫ్రాంచైజీకి కెప్టెన్ గా వెళతాడని అంటున్నారు. తనతోపాటు సూర్యకుమార్ కూడా వచ్చేసేలా ఉన్నాడని చెబుతున్నారు. రోహిత్ శర్మ అయితే ఇక ఉండడని, బహుశా ప్రీతిజింతా పిలిచింది కాబట్టి, పంజాబ్ కింగ్స్ కి వెళ్లవచ్చునని అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News