Big Stories

IND vs SA Final T20 WC 2024: ఒత్తిడిని జయించిన ఇండియా.. తడబాటుతో ఓడిన దక్షిణాఫ్రికా: అంతర్జాతీయ మీడియా

International Media On India Winning the T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ ను టీమ్ ఇండియా గెలిచిన వార్తను అంతర్జాతీయ మీడియా ప్రముఖంగా ప్రచురించింది. అందులో చెప్పిందేమిటంటే.. ఒత్తిడిలో టీమ్ ఇండియా గొప్ప విజయం సాధించిందని అంటూనే, అదే ఒత్తిడిలో పడి దక్షిణాఫ్రికా పరాజయం పాలైందని పేర్కొన్నారు.

- Advertisement -

లండన్ నుంచి సండే టైమ్స్ హెడ్డింగ్ ఏం పెట్టిందంటే.. గేరు మార్చి, భారత్ కి కప్ అందించిన కొహ్లీ అని రాసుకొచ్చి.. విరాట్ ని ఆకాశానికెత్తేశారు. కరెక్టు టైమ్ లో కొహ్లీ కనెక్ట్ అయ్యాడని ఫాక్స్ క్రికెట్ పొగడ్తలతో ముంచెత్తింది. మొదట్లో విఫలమైనా, కీలకమైన మ్యాచ్ లో ఒంటరిగా నిలిచి, భారత్ ని గెలిపించాడని పేర్కొన్నారు. ఇక భారత బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా బ్యాటర్లు తీవ్ర ఒత్తిడికి గురై ఓటమి పాలయ్యారని రాసుకొచ్చారు.

- Advertisement -

ఒత్తిడి మధ్య కప్ చేజార్చుకున్న సౌతాఫ్రికా అంటూ టెలిగ్రాఫ్ రాసింది. క్రికెట్. కామ్. ఏయూ మ్యాచ్ విశ్లేషణను రాస్తూ కీలక మ్యాచ్ ల్లో ఒత్తిడి తట్టుకోలేక ఓటమి పాలు కావడం దక్షిణాఫ్రికాకు అలవాటేనని రాశారు. ఇక్కడ కూడా అదే పరంపరను కొనసాగించారని పేర్కొంది.

పాకిస్తాన్ కు చెందిన డాన్ పత్రిక భారత జట్టు విజయోత్సాహాలకు సంబంధించిన పొటోను మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించింది. కొహ్లీ అంటే పాకిస్తాన్ లో కూడా అభిమానులున్నారని రాసుకొచ్చింది. తనే లేకుంటే, ఫైనల్ మ్యాచ్ లో భారత్ గెలవడం అసాధ్యమని రాసింది.

అంతేకాకుండా పాకిస్తాన్ క్రికెటర్లు పలువురు టీమ్ ఇండియాకి అభినందనలు తెలిపారు. రోహిత్ కెప్టెన్సీని షాహిద్ ఆఫ్రిది కొనియాడాడు. కప్ గెలవడానికి పూర్తి అర్హుడని ప్రశంసించాడు. అయితే దాయాదులు సైతం ఇండియాని ప్రశంసిస్తే ఆస్ట్రేలియా మాత్రం తన అక్కసును వెళ్లగక్కింది.

Also Read: రోహిత్, కొహ్లీ స్థానాలను భర్తీ చేసేవారున్నారా?

ఒత్తిడిలో టీమ్ ఇండియా గెలిచిందని రాస్తూనే, కొన్ని అంపైర్ నిర్ణయాలు భారత్ కి కలిసి వచ్చాయని చెబుతూ సిడ్నీ మార్నింగ్ పత్రిక రాసింది. కీలకమైన సమయంలో దక్షిణాఫ్రికా కుప్పకూలడం వల్లే పరాజయం పాలైందని, క్లాసెన్, మిల్లర్ ఉండి ఉంటే, ఆ కథే వేరుగా ఉండేదని, మరో ఓవర్ మిగిలి ఉండగానే మ్యాచ్ గెలిచేవారని రాసింది. అంతేకానీ టీమ్ ఇండియా విజయాన్ని ప్రశంసిస్తూ ఒక్క ముక్క రాయలేకపోయింది.

ఆస్ట్రేలియాను సూపర్ 8లో ఓడించామనే అక్కసుతో ఇలా రాసిందని అంతా అనుకుంటున్నారు. అలాగైతే 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్, డబ్ల్యూటీసీ ఛాంపియన్ షిప్ ల్లో ఆస్ట్రేలియా గెలిచినప్పుడు మన మీడియా ఎప్పుడూ అలా రాయలేదని నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News