Big Stories

Jasprit Bumrah Record: ఒక రికార్డ్ కి దగ్గరలో బుమ్రా.. టీ 20 ప్రపంచకప్ లో సాధ్యమేనా..?

Jasprit Bumrah New Record: టీమ్ ఇండియా ప్రధానాస్త్రం, గేమ్ ఛేంజర్ ,స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. ఈ పేరు వింటేనే భారత క్రికెట్ అభిమానుల్లో ఒక వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. టీ 20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ తో జరిగిన ‘లో స్కోరు మ్యాచ్’ ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఆరోజు కీలకమైన సమయంలో, మూడు ఇంపార్టెంట్ వికెట్లు తీసి భారత్ విజయానికి దారులు వేశాడు.

- Advertisement -

అలాంటి బుమ్రాకి చేరువలో ఒక రికార్డు ఉంది. చేరువంటే చేరువ కాదు.. కొంచెం దగ్గరలో ఉంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు సాధ్యమే అంటున్నారు. మరికొందరు అసాధ్యం అంటున్నారు. మరి ఆ రికార్డు గొడవేంటో చూద్దామా..

- Advertisement -

ఇంతకీ ఆ రికార్డు ఏమిటంటే, టీ 20 క్రికెట్ లో 100 వికెట్లు తీయడానికి బుమ్రా ఇంకా 21 వికెట్ల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం తను 65 మ్యాచ్ లు ఆడి 79 వికెట్లు తీశాడు. అంటే ప్రస్తుతం టీ 20 ప్రపంచకప్ లో ఆడిన మూడు మ్యాచ్ ల్లో కలిపి 5 వికెట్లు తీశాడు. అయితే అమెరికాతో జరిగిన మ్యాచ్ లో వికెట్లు పడలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడింకా గ్రూప్ లో కెనడాతో ఒక మ్యాచ్ ఉంది. అలాగే సూపర్ 8లో మూడు మ్యాచ్ లు ఉన్నాయి.

Also Read: Team India Super 8 Schedule: టీ20 ప్రపంచ కప్.. టీమిండియా షెడ్యూల్ ఇదే.. మళ్లీ వారితోనే..!

అక్కడ నుంచి దైవాధీనం సర్వీసు.. మొత్తం నాలుగు మ్యాచ్ లు అయితే తప్పక ఆడాలి. మరి వీటిలో 21 వికెట్లు తీయడం అసంభవమే కానీ, సెమీఫైనల్, ఫైనల్ కూడా ఆడగలిగితే మాత్రం.. ఒక మోస్తరు అవకాశాలు ఉంటాయని నెటిజన్లు అంటున్నారు. అది కూడా కష్టమేనని మరికొందరంటున్నారు.

అది కూడా లెక్కలు వేసి మరీ చెబుతున్నారు. సెమీస్, ఫైనల్ కలిపి మొత్తం 6 మ్యాచ్ లు అవుతాయి. ఒకొక్కదాంట్లో మూడేసి చొప్పున వికెట్లు తీసినా 18 అవుతాయి. ఇంకా 100 వికెట్లకి 3 అవసరం అవుతాయి. మరది సాధ్యమేనా? అని ప్రశ్నిస్తున్నారు.

అదీకాక ఐర్లాండ్ మ్యాచ్ లో 2, పాకిస్తాన్ మ్యాచ్ లో 3, అమెరికా మ్యాచ్ లో సున్నా వికెట్లు వచ్చాయి. మరి బుమ్రా విషయంలో 100 వికెట్లు టీ 20 ప్రపంచ కప్ లో సాధ్యం కాకపోవచ్చునని ఢంకా భజాయించి చెబుతున్నారు.

Also Read: స్వింగ్ కింగ్.. అర్షదీప్ ‘సింగ్’

అభిమానం ఉండవచ్చుగానీ, మరీ అంత యావ ఉండకూడదని అంటున్నారు. ఈ కామెంట్లు చూసిన సీనియర్లు మాత్రం టీ 20లో 100 వికెట్ల రికార్డు, ఇప్పుడిప్పుడే కష్టమని అంటున్నారు. ఏదైనా అద్భుతాలు జరిగితే తప్పా సాధ్యం కాకపోవచ్చునని చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News