Big Stories

IND-W vs SA-W One-off Test Highlights: అమ్మాయిలు అదుర్స్.. సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ లో విజయభేరీ

India Women vs South Africa Women Highlights Day 4 one-off Test: టీమ్ఇండియా అమ్మాయిలు ఘన విజయం సాధించారు. సౌతాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో దుమ్ముదులిపారు. 10 వికెట్ల తేడాతో గెలిచి, టీమ్ ఇండియా మగవాళ్ల క్రికెట్ కు ఏ మాత్రం తీసిపోమని తెలిపారు. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో నాలుగో రోజు ఉదయం 2 వికెట్ల నష్టానికి 232 పరుగులతో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ కొనసాగించింది. అయితే ఎంతో సేపు వారి ప్రయాణం సాగలేదు. 373 పరుగుల వద్ద ఆగిపోయింది.

- Advertisement -

ఫస్ట్ ఇన్నింగ్స్ లో చేసిన 266 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో చేసిన 373 పరుగులు కలిపి 639 పరుగులు చేసింది. కానీ భారత్ అమ్మాయిలు తొలి ఇన్నింగ్స్ ని 603 పరుగులకి డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ 37 పరుగుల లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి 9.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ఏకైక టెస్ట్ మ్యాచ్ గెలిచి విజయ భేరీ మోగించింది.

- Advertisement -

తొలి ఇన్నింగ్స్ ఆడిన అమ్మాయిలు ఉమన్స్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా రికార్డ్ సృష్టించారు. మొదట  షఫాలీ వర్మ డబుల్ సెంచరీ చేసింది. స్మృతి మంథాన 149 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ (69), రిచాఘోష్ (86), రొడ్రిగస్ (55) ధనాధన్ ఆడి  6 వికెట్ల నష్టానికి 603 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇంతకుముందు ఈ రికార్డ్ ఆస్ట్రేలియా (575/9 డిక్లేర్డ్) పేరిట ఉండేది. వాళ్లు కూడా సౌతాఫ్రికాపైనే చేయడం విశేషం.

చివరికి రెండోరోజు లంచ్ ముందు దక్షిణాఫ్రికాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. అయితే సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 266 పరుగులకు ఆలౌట్ అయిపోయి, ఫాలో ఆన్ లో పడింది. సునే లూస్ (65), మారిజేన్ కాప్ (74) హాఫ్ సెంచరీలు చేశారు. తర్వాత వెంటనే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.

ఈసారి సౌతాఫ్రికా ఓపెనర్ కెప్టెన్ లౌరా వాల్వార్డట్ (122), సూనె సునే లూస్ (109) సెంచరీలు చేశారు. వీరితో నాడిన్ డక్లేర్క్ (61) పరుగులు చేసింది. అందరూ కలిసి ఇన్నింగ్స్ ఓటమి నుంచి కాపాడారు.
మొత్తానికి నాలుగో రోజే 373 పరుగులకు ఆలౌట్ అయిపోయింది. చివరికి తొలి ఇన్నింగ్స్ 266 పరుగులు కలిపి, 36 పరుగుల ఆధిక్యంతో ముగించారు.

Also Read: వింబుల్డన్ టోర్నీ.. టాప్ సీడ్ ఆటగాళ్లు ముందంజ, సెకండ్ రౌండ్‌లో అల్కరాస్

అనంతరం 37 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన అమ్మాయిలు వికెట్ నష్టపోకుండా 9.2 ఓవర్లలో విజయ దుందుభి మోగించారు.

టీమ్ ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ బౌలింగులో స్నేహ్ రాణా 2, పూజా వస్త్రాకర్ 1, దీప్తీ శర్మ 2, రాజేశ్వరి 2, షఫాలీ వర్మ 1, హర్మాన్ ప్రీత్ (1) వికెట్లు పడగొట్టారు.

తొలి ఇన్నింగ్ లో స్నేహ్ రాణా ఒక్కరే  8 వికెట్లు తీసి, సౌతాఫ్రికా నడ్డి విరిచింది. తను మొత్తం 25.3 ఓవర్లు వేసి 77 పరుగులిచ్చి 8 వికెట్లు తీసింది. రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్లు తీసింది. మొత్తమ్మీద ఒక టెస్ట్ మ్యాచ్ లో 10 వికెట్లు తీసి తనొక రికార్డ్ సృష్టించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News