Big Stories

IND vs SA-Women Test: భారత ఉమెన్ ఓపెనర్లు న్యూ రికార్డు, సెంచరీలు చేసిన..

IND vs SA-Women Test: భారత మహిళలు టెస్టు క్రికెట్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పారు. టెస్టుల్లో ఫస్ట్ వికెట్‌కు రికార్డు భాగస్వామ్యం పరుగులు నమోదు చేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. ఓపెనర్లు స్మృతి మంధాన- షఫాలీవర్మలు సెంచరీలతో చెలరేగిపోయారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 292 పరుగులు జోడించి కొత్త రికార్డును నెలకొల్పారు.

- Advertisement -

చెన్నై వేదికగా భారత్- సౌత్‌ఆఫ్రికా మహిళల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ శుక్రవారం మొదలైంది. తొలుత టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా స్మృతిమంధాన- షఫాలీవర్మ దిగారు. ఆదిలో కాస్త తడబడిన ఈ జంట, ఆ తర్వాత విశ్వరూపం చూపించారు. లంచ్ బ్రేక్ సమయానికి వికెట్ నష్టపోకుండా 130 పరుగులు చేసింది.

- Advertisement -

వీరిద్దరూ మైదానం నలుమూలలా చూడచక్కని షాట్లతో సౌతాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ జోడిని విడగొట్టేందుకు సౌతాఫ్రికా ఆటగాళ్లు రకరకాలు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. అటు షషాలీ వర్మ అయితే సిక్స్‌ల మోత మోగించింది. కేవలం 52 ఓవర్లలో 292 పరుగులు చేసింది ఈ జోడి.

ఓపెనర్లు స్మృతిమంధాన- షఫాలీవర్మ సెంచరీలు నమోదు చేశారు. ఇప్పటివరకు మహిళా టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి వికెట్‌కు 241 పరుగులు చేసిన కిరన్ బలుచ్-సజ్జిదా షా జోడి రికార్డును భారత్ ఓపెనర్లు అధిగమించారు. మరింత దూకుడుగా ఆడే క్రమంలో స్మృతిమంధాన 149 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యింది. స్మృతికి టెస్టుల్లో ఇదే తొలి సెంచరీ. వన్డేల్లో రెండు సెంచరీలు చేసింది కూడా.

సెకండ్ సెషన్‌లో ఓ వికెట్ నష్టానికి 340 పరుగులు చేసింది టీమిండియా మహిళల జట్టు. వర్మ 167 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఈ లెక్కన తొలిరోజు రికార్డు స్కోర్ నమోదు చేయడం ఖాయం.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News