Big Stories

IND vs SA Final T20 WC 2024 Preview: నిలిచేదెవరు? గెలిచేదెవరు? టీ 20 ప్రపంచకప్ మహాపోరు నేడే..

India vs South Africa final match prediction(Latest sports news telugu):

టీ 20 ప్రపంచకప్ మహాపోరుకు బార్బడోస్ లో వేదిక సిద్ధమైంది. అటు దక్షిణాఫ్రికా, ఇటు ఇండియా సమఉజ్జీలుగా పోరులో తలపడనున్నాయి. రాత్రి 8 గంటలకు జరిగే మ్యాచ్ ని కొన్ని కోట్లమంది భారతీయులే కాదు, ప్రపంచవ్యాప్తంగా టీవీల ముందు కూర్చుని చూస్తారని అంచనా వేస్తున్నారు.

- Advertisement -

దక్షిణాఫ్రికా వైపు చూస్తే, ఇంతవరకు టీ 20 ప్రపంచకప్ ఫైనల్ కే ఆ జట్టు రాలేదు. ఇక ఇప్పుడు కప్పు కొట్టి, తమ దేశానికి తీసుకువెళ్లాలని ఆశ పడుతోంది. ఇండియా నుంచి చూస్తే సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలని చూస్తోంది. ఆల్రడీ ఒకసారి కప్ గెలిచిన ఇండియా, మరొకసారి ఫైనల్ కి చేరింది. ఈసారి మాత్రం ఎలాగైనా గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. ఎందుకంటే ఇది రోహిత్ శర్మ కెప్టెన్సీకి ఒక సవాల్ గా మారింది. రిటైర్మెంట్ కి దగ్గరగా ఉన్న రోహిత్ శర్మ ఇండియాకి ఒక ఐసీసీ కప్ అందించి, ఘనంగా ముగిద్దామని చూస్తున్నాడు.

- Advertisement -

గణాంకాలు చూస్తే.. ఈ రెండు జట్ల మధ్య ఇంతవరకు 25 సార్లు టీ 20 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో టీమ్ ఇండియా 14 సార్లు విజయం సాధిస్తే, దక్షిణాఫ్రికా 11 సార్లు గెలిచింది. ఈ రకంగా చూస్తే ఇండియాదే పై చేయిగా ఉంది.

టీ 20 వరల్డ్ కప్ ల్లో రెండు జట్లు ఆరుసార్లు తలపడ్డాయి. టీమ్ ఇండియా 4, దక్షిణాఫ్రికా రెండింట్లో గెలిచాయి.

ఛేదనలో టీమ్ ఇండియా నాలుగు సార్లు గెలిస్తే, దక్షిణాఫ్రికా 8 సార్లు గెలిచింది.

టీమ్ ఇండియా తొలిసారి బ్యాటింగ్ చేసి 10 సార్లు గెలవగా, దక్షిణాఫ్రికా మూడుసార్లు మాత్రమే గెలిచింది.

దక్షిణాఫ్రికాపై రోహిత్ శర్మ (420) అత్యధిక పరుగులు చేశాడు. టీమ్ఇండియా పై డేవిడ్ మిల్లర్ (431) చేశాడు. వీరిద్దరే ఇప్పుడు కీలకంగా ఉన్నారు. టీమ్ ఇండియా బౌలింగుని మిల్లర్ సులభంగా ఎదుర్కొంటే, సఫారీల బౌలింగుని రోహిత్ శర్మ ఈజీగా ఆడుతున్నాడు.

సౌతాఫ్రికాపై టీమ్ ఇండియా అత్యధిక స్కోరు 237, అత్యల్ప స్కోరు 92గా ఉంది. అదే దక్షిణాఫ్రికా అయితే అత్యధికం 227, అత్యల్పం 87గా ఉన్నాయి. ఇక్కడ వ్యత్యాసం తక్కువే అయినా
ఒత్తిడిలో టీమ్ఇండియా ఆధిక్యం చూపించేలా ఉంది.

ఎన్నిరకాలుగా చూసుకున్నా భారత్ పై డేవిడ్ మిల్లర్ ప్రమాదకరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాలో ట్రావిస్ హెడ్ ఎలాగో ఇక్కడ మిల్లర్ ఉన్నాడు. జట్టుకొకరు సైంధవుల్లా అడ్డు పడుతున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Also Read: కత్తుల కొనలకు.. కత్తెర కొనలకు యుద్ధం.. సై

ఎందుకంటే డేవిడ్ మిల్లర్ సెంచరీ (106) చేశాడు. రోహిత్ శర్మ కూడ (106)అంతే చేశాడు. ఇక సిక్సర్లలో తనే టాప్ గా ఉన్నాడు. మిల్లర్ 29 కొడితే, సూర్యా 23 చేశాడు. బౌండరీలు రోహిత్ శర్మ 49 కొడితే, డికాక్ 29 కొట్టాడు. హాఫ్ సెంచరీలు సూర్య 4 చేస్తే, డికాక్ 4 చేశాడు. సెంచరీలు సూర్యా, రోహిత్, రైనా చేస్తే, దక్షిణాఫ్రికా నుంచి రిలీ రుస్సో, డేవిడ్ మిల్లర్ చేశారు.

వికెట్లు ఎక్కువగా తీసిన వాళ్లలో టీమ్ ఇండియా నుంచి భువనేశ్వర్ (14) ఉన్నాడు. అటు నుంచి కేశవ్ (10), ఎంగిడి (10) ఉన్నారు. బెస్ట్ చూస్తే కులదీప్ (5 /17), ఎంగిడి  (4/21) ఉన్నారు.

ఈ గణాంకాలన్నీ పరిశీలిస్తే ప్రస్తుతం జట్టులో దక్షిణాఫ్రికా ఆధిక్యం చూపినవారిలో కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. ప్రస్తుతం తను కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక్కడ క్లిక్ అయితే, ఇక ఎదురు లేదని చెప్పాలి. తర్వాత సూర్య కుమార్ యాదవ్ కి మంచి రికార్డ్ ఉంది. తను కూడా టచ్ లోకి వచ్చాడు. వీరిద్దరూ ఆడితే చూసుకో అక్కర్లేదని అంటున్నారు.

దక్షిణాఫ్రికా నుంచి చూస్తే ఓపెనర్ డికాక్, డేవిడ్ మిల్లర్ ఇద్దరూ ప్రమాదకరంగా ఉన్నారు. వీరిని అవుట్ చేయడంపై ఫోకస్ పెట్టాలి.

ఇక బౌలింగ్ లో టీమ్ ఇండియా ట్రంప్ కార్డు కులదీప్ యాదవ్ కి సౌతాఫ్రికాపై బెస్ట్ ఉంది. అటు చూస్తే బెస్ట్ కాకపోయినా కేశవ్ మహరాజ్ ఉన్నాడు. ఇవన్నీ చూస్తే.. అంతా ఇండియాకి పాజిటివ్ గా ఉంది. గ్రౌండులో దిగాక గానీ ఏమీ తెలీదని మరి రోహిత్ శర్మ అన్నట్టు ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News