Big Stories

PCB Scheduled: సందట్లో సడేమియా.. పీసీబీ షెడ్యూల్, మార్చిలో భారత్-పాక్ మ్యాచ్

PCB Scheduled: ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా ఉంది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పరిస్థితి. వచ్చే ఏడాది భారత్-పాకిస్థాన్ మధ్య ఛాంపియన్స్ ట్రోపీ జరుగుతుందో లేదో తెలీదు. భారత్ జట్టు పాక్‌లో పర్యటిస్తుందో కూడా క్లారిటీ లేదు. కానీ టోర్నీకి ముహూర్తం ఖరారు చేసింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.

- Advertisement -

మార్చి ఒకటిన భారత్-పాక్ మధ్య లాహోర్ వేదికగా మ్యాచ్ జరగనున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రణాళికను రెడీ చేసింది. దీనికి సంబంధించిన డీటేల్స్ ఇప్పటికే బీసీసీఐకి పంపింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది.

- Advertisement -

లాహోర్‌లో ఏడు మ్యాచ్‌లు, కరాచీలో మూడు, రావల్పిండిలో ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి. ముఖ్యంగా భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ లాహోర్‌లో నిర్వహించనున్నట్లు అందులో ప్రస్తావించింది. ఛాంపియన్స్ ట్రోఫీకి పూర్తి మద్దతు ఇస్తామని భారత్ మినహా మిగిలిన దేశాలు పీసీబీకి హామీ ఇచ్చాయి.

ALSO READ:  భారత్‌కు తిరిగొచ్చిన రోహిత్ సేన..ఛాంపియన్స్‌కు ఘన స్వాగతం

ఈ విషయంలో బీసీసీఐ సైలెంట్‌గా ఉంది. భారత ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే తమ నిర్ణయం చెబుతామని బీసీసీఐ అన్నట్లు ఐసీసీ బోర్డు సభ్యుడు చెబుతున్నమాట. టోర్నీ నిర్వహణకు కేవలం ఏడెనిమిది నెలలు మాత్రమే ఉన్నాయి. ఈలోగా బీసీసీఐ నుంచి క్లారిటీ వస్తుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంచనా వేస్తోంది. ఒక వేళ సెట్ కాకుంటే తటస్థ వేదికపై టోర్నీ జరగడం ఖాయంగా చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News