Big Stories

IND vs IRE T20 World Cup 2024: నేడు టీమ్ ఇండియా.. తొలి మ్యాచ్ ఐర్లాండ్ తో పోటీకి రెడీ

IND vs IRE T20 World Cup 2024 Dream11 Prediction: టీ 20 ప్రపంచకప్ లో టీమ్ ఇండియా తోలి మ్యాచ్ ఆడనుంది.  ఐర్లాండ్ తో జరగనున్న మ్యాచ్ న్యూయార్క్ లో నేటి రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. మ్యాచ్ పై ఎక్కువ అంచనాలు లేకపోయినా.. టీ 20 మ్యాచ్ కాబట్టి.. చిన్న జట్టు అయినా.. జాగ్రత్తగానే ఉండాలని సీనియర్లు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఓవర్లు తక్కువ. వికెట్లు ఎక్కువ. అందుకని ఒకడు పోతే ఒకడు వస్తూనే ఉంటాడు. ధనాధన్ కొడుతూనే ఉంటాడు. అందుకే తేలిగ్గా తీసుకోవద్దని అంటున్నారు.

- Advertisement -

ఒకవేళ  ఐర్లాండ్ పై ఓడిపోయినా, పడుతూ లేస్తూ ఆడినా పరువు పోతుందని, అది కూడా గుర్తు పెట్టుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు. న్యూయార్క్ పిచ్ పై ‘లో స్కోర్లు’ వస్తున్నాయి కాబట్టి, ముగ్గురు పేసర్లను ఆడించేలా  ఉన్నారని అంటున్నారు. అలాగే త్వరగా వికెట్లు పడుతున్నాయి కాబట్టి.. అదనంగా ఒక బ్యాటర్ ని కూడా తీసుకుంటారని చెబుతున్నారు.

- Advertisement -

ఈ క్రమంలో స్పిన్నర్ ఒకరికే అవకాశాలుంటాయని చెబుతున్నారు. మరి ఆ స్పిన్నర్ ఎవరు కులదీప్ ? చాహల్? రవీంద్ర జడేజా ? ఎవరు వస్తారనేది ప్రశ్నార్థకంగా ఉంది. టీమ్ ఇండియా వార్మప్ మ్యాచ్ లో ఆడినవారే ఉండవచ్చు. ముఖ్యంగా విరాట్ కొహ్లీ కొత్తగా వస్తాడు. అలాగే యశస్వి కూడా ఆడతాడని అంటున్నారు.

ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి వస్తారు. ఫస్ట్ డౌన్ విరాట్ వస్తాడు. సెకండ్ డౌన్ సంజూ శాంసన్, ఇక అక్కడ నుంచి రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా వస్తారు. ఇక్కడికి ఆరుగురు అయ్యారు. వీరిలో ఐదుగురు బ్యాటర్లు, ఒక ఆల్ రౌండర్ ఉన్నారు. తర్వాత ముగ్గురు పేసర్లు అర్షదీప్, బుమ్రా, సిరాజ్ ఉన్నారు. ఇక్కడికి 9 మంది అయ్యారు. మరో ఇద్దరిలో ఒకరు రవీంద్ర జడేజా, మరొకరు కులదీప్ ఉంటారని అంటున్నారు.

Also Read: అతికష్టమ్మీద గెలిచిన నెదర్లాండ్స్.. నేపాల్ ఓటమి

ఐర్లాండ్ జట్టు విషయానికి వస్తే.. పాల్ స్టిర్లింగ్ కెప్టెన్సీలో ఆడనుంది. గొప్పగా పేరున్నవారు లేరు.  ఇక నుంచి ప్రపంచానికి పరిచయం అవుతారేమో చూడాలి. ఇకపోతే న్యూయార్క్ పిచ్ పై.. అన్నిటికి మించి క్రికెటర్లు దెబ్బలు తగిలించుకుంటున్నారు. క్రీజు ముందు కదల్లేక.. వేగంగా వచ్చే బాల్ ని కొట్టలేక గిర్రున తిరిగి అక్కడే పడిపోతున్నారు.

అలాగే గ్రౌండ్లు కూడా పెద్దవిగా ఉంటున్నాయి. ఇండియాలో అయితే 66 ఫీట్ల నుంచి 68 ఫీట్ల వరకు గ్రౌండు ఉంటే.. ఇక్కడ 10 ఫీట్లు ఎక్కువగా ఉంటున్నాయి. అంటే 78 నుంచి 84 వరకు ఉంటున్నాయి. అందువల్ల ఎంతో బలంగా కొడితే తప్ప, అవి గ్రౌండ్ అవతల పడటం లేదు. లేదంటే లాంగ్ ఆన్ లో సింపుల్ క్యాచ్ లు ఇచ్చేస్తున్నారు. మరిలాంటి పిచ్ పై నేటి మ్యాచ్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News