Big Stories

India Vs England match Weather Update: టీమ్ ఇండియా సెమీఫైనల్ కి.. వర్షం ఆటంకం..? మ్యాచ్ జరుగుతుందా..?

T20 World Cup 2024 – India Vs England Semi Final Weather Updates: టీ 20 ప్రపంచకప్ లో సెమీస్ పోరు మొదలు కానుంది. ఈ సమయంలో టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ గయానా స్టేడియంలో జరగనుంది. అయితే వరుణుడి ముప్పు పొంచి ఉందని అంటున్నారు. ప్రస్తుతం అక్కడ చిన్న చినుకులతో కూడిన జల్లులు కురుస్తున్నాయని అంటున్నారు.

- Advertisement -

మరి మ్యాచ్ సమయానికి వర్షం తగ్గి, అవుట్ ఫీల్డ్ సిద్ధమైతే మ్యాచ్ జరుగుతుంది. లేదంటే మాత్రం రద్దు అవుతుందని అంటున్నారు. దురదృష్టం ఏమిటంటే , టీమ్ ఇండియా ఆడే సెమీస్ కి రిజర్వ్ డే లేదు. ఇదే ఇప్పుడు అందరినీ కలవరపాటుకు గురిచేస్తోంది. అదే తొలి సెమీఫైనల్ అయిన ఆఫ్గాన్ వర్సెస్ సౌతాఫ్రికాకు రిజర్వ్ డే ఉంది.

- Advertisement -

అదేమిటి చిత్రం అంటే, ఫస్ట్ సెమీఫైనల్ అక్కడ ట్రినిడాడ్ లో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతుంది. మ్యాచ్ పూర్తయ్యేసరికి సాయంత్రం 5 అవుతుంది. వర్షం పడితే ఒక గంట అదనపు సమయం కేటాయించారు. అంటే సాయంత్రం 6 వరకు చూస్తారు. కుదరకపోతే మరుసటి రోజు ఉదయం రిజర్వ్ డే ఉంది. అప్పుడు కూడా వర్షం పడితే అదనగంగా 3 గంటల 10 నిమిషాల సేపు చూస్తారు. అదీ లేకపోతే మ్యాచ్ రద్దు అయిపోతుంది.

Also Read: తొలి సెమీస్.. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న అఫ్గాన్

అదే టీమ్ ఇండియా విషయానికి వస్తే.. వెస్టిండీస్ లో సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. మ్యాచ్ పూర్తయ్యేసరికి రాత్రి 9 గంటలు అవుతుంది. ఇక్కడ కూడా వర్షం పడితే మరో 4 గంటల 10 నిమిషాలు చూస్తారు. అంటే 5 ,10, 15 ఓవర్ల వరకు ఆడే అవకాశాలుంటే చూస్తారు. అప్పటికి జరగకపోతే మ్యాచ్ రద్దు అయిపోతుంది.

ఎందుకంటే గయానా నుంచి ఫైనల్ మ్యాచ్ జరిగే బార్బడోస్ బయలుదేరాలి. 928 కిలోమీటర్ల దూరం ఉంది. ఫ్లయిట్ లో 2 గంటల ప్రయాణం ఉంటుంది. బోర్డింగ్ దగ్గర నుంచి మళ్లీ దిగి హోటల్ రూమ్స్ కి వెళ్లడానికి సమయం సరిపోదు. అందుకే కనీసం ఒకరోజైనా ఉండాలని ఐసీసీ భావిస్తోంది. ఆటగాళ్లు రెస్ట్ తీసుకోవడానికి, ప్రాక్టీసు, ప్రయాణ బడలికకు ఆ మాత్రం సమయం కావాలని భావిస్తోంది.

Also Read: Rohit and Kohli Got Emotional : రోహిత్ ని కోహ్లీ ఓదార్చితే.. కోహ్లీని ద్రావిడ్ ఓదార్చాడు

మొదటి సెమీఫైనల్ వాళ్లకి మధ్యాహ్నం మ్యాచ్ జరుగుతుంది కాబట్టి, 24 గంటల సమయం సరిపోతుంది. రెండో సెమీఫైనల్ వాళ్లకి, ఆ అవకాశం లేదు. అదీ సంగతి. ఒకవేళ వర్షం కారణంగా సెమీఫైనల్ రద్దయితే టీమిండియా టైటిల్ పోరుకు దూసుకెళ్తుంది. ఎలాగంటే గ్రూప్ లో ఎవరైతే టాప్ లో ఉన్నారో వారు ఫైనల్ కి వెళతారు. అక్కడ కూడా వర్షం పడితే సంయుక్తంగా విజేతను ప్రకటిస్తారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News