Big Stories

India vs England: బౌలర్ల దెబ్బకు ఇంగ్లాండ్ చిత్తు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్

India vs England Semi final T20 World Cup 2024 Live Scores: ఇంగ్లాండ్‌- భారత్ సెమీ ఫైనల్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్..

- Advertisement -
  • టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇంగ్లాండ్‌ను భారత్ 68 పరుగులతో తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది. అనంతరం బౌలర్ల దెబ్బకు ఇంగ్లాండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ బౌలర్లలో అక్షర్ పటేల్, కుల్దీప్ చెరో మూడు వికెట్లు, బుమ్రా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ నెల 29న జరిగే ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది.
  • ఇంగ్లాండ్ ఆలౌట్. 16.4 ఓవర్లలో 103 పరుగులకు పరిమితమైంది.
  • 16 ఓవర్లకు ఇంగ్లాండ్ 9 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఆర్చర్(20), టాప్లీ(1) పరుగులతో ఉన్నారు.
  • తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్. ప్రస్తుతం ఇంగ్లాండ్ స్కోరు 88/9.
  • ఇంగ్లాండ్ ఎనిమిదో వికెట్. లివింగ్ స్టోన్ 11 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు.Liam Livingstone was run-out after a mix-up with Jofra Archer, England vs India, T20 World Cup semi-final, Providence, Guyana, June 27, 2024
  • 14 ఓవర్లకు ఇంగ్లాండ్ 77 పరుగులు చేసింది.
  • భారత్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తుంది. కుల్దీప్ బౌలింగ్‌లో జోర్దాన్ ఎల్బీగా ఔట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ ఏడో వికెట్ కోల్పోయింది. 13 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోరు 73/7.
  • జడేజా వేసిన 12వ ఓవర్‌లో 3 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్ స్కోరు 71/6.
  • ఆరో వికెట్ డౌన్. బ్రేక్ తర్వాత తొలి ఓవర్ వేసిన కుల్దీప్ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్(25) రివర్స్ ఆడేందుకు ప్రయత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అంతకుముందు బంతికి బ్రూక్ రివర్స్ ఆడి బౌండరీ కొట్టాడు. 11 ఓవర్లకు ఇంగ్లాండ్ 68/6.
  • డ్రింక్స్ బ్రేక్
  • జడేజా వేసిన 10వ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. ఇంగ్లాండ్ 62/5. ప్రస్తుతం బ్రూక్(19). లివింగ్‌స్టోన్(3) క్రీజులో ఉన్నారు.
  • ఐదో వికెట్ డౌన్. సగం వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. కుల్దీప్ వేసిన 9వ ఓవర్‌లో తొలి బంతికి సామ్ కరన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 9 ఓవర్లలో ఇంగ్లాండ్ 53/5.Kuldeep Yadav didn't let Sam Curran prosper, England vs India, T20 World Cup semi-final, Providence, Guyana, June 27, 2024
  • నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్. అక్షర్ పటేల్‌ వేసిన 8వ ఓవర్‌లో తొలి బంతికి మొయిన్(8) స్టంప్ ఔట్ అయ్యాడు. ఇంగ్లాండ్ 8 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది.Moeen Ali tried to make his way back, but Rishabh Pant was too quick for him, England vs India, T20 World Cup semi-final, Providence, Guyana, June 27, 2024
  • 7 ఓవర్లకు ఇంగ్లాండ్ 46/3. ప్రస్తుతం క్రీజులో మొయిన్(8), బ్రూక్(8) ఉన్నారు.
  • భారత్ బౌలర్లు అదరగొడుతున్నారు. పవర్ ప్లేలో 3 వికెట్లు పడగొట్టారు. 6 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్ 39/3.
  • మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్. అక్షర్ పటేల్ వేసిన 6వ ఓవర్‌లో తొలి బంతికి జానీ బెయిర్‌స్టో డకౌట్.Axar Patel sent back Jonny Bairstow for his second wicket, England vs India, T20 World Cup semi-final, Providence, Guyana, June 27, 2024
  • 5 ఓవర్‌లో బుమ్రా రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇంగ్లాండ్ 35/2.
  • ఇంగ్లాండ్ రెండో వికెట్. బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన సాల్ట్(5) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.Jasprit Bumrah's slower delivery sent Phil Salt back, England vs India, T20 World Cup semi-final, Providence, Guyana, June 27, 2024
  • నాలుగో ఓవర్‌లో 7 పరుగులు వచ్చాయి. ఇంగ్లాండ్ 33/1. క్రీజులో సాల్ట్(5), మొయిన్(4) ఉన్నారు.
  • మొదటి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్. అక్షర్ పటేల్ వేసిన నాలుగో ఓవర్‌లో తొలి బంతికి బట్లర్(23) పరుగుల వద్ద కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.Axar Patel got Jos Buttler out, England vs India, T20 World Cup semi-final, Providence, Guyana, June 27, 2024
  • మూడో ఓవర్‌లో అర్ష్‌దీప్ 13 పరుగులు ఇచ్చాడు. ఇంగ్లాండ్ 26/0.
  • బుమ్రా వేసిన రెండో ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. ఇంగ్లాండ్ 13/0. బట్లర్(10), సాల్ట్(2) ఉన్నారు.
  • తొలి ఓవర్ వేసిన అర్ష్ దీప్ సింగ్ 5 పరుగులు ఇచ్చాడు.
  • 172 పరుగుల లక్ష్య ఛేదనకు ఇంగ్లాండ్ బరిలోకి దిగింది. ఓపెనర్లుగా సాల్ట్, బట్లర్ వచ్చారు.
  • ఇంగ్లాండ్ టార్గెట్ 172
  • భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. చివరి బంతికి ఒక్క పరుగు మాత్రమే వచ్చింది.
  • ఆఖరి ఓవర్‌ను జోర్దాన్ వేయగా ..మొదటి బంతికి జడేజా రెండు పరుగులు తీశాడు. రెండో బంతికి సింగిల్ వచ్చింది. మూడో బంతికి అక్షర్ పటేల్ రెండు పరుగులు, నాలుగో బంతికి అక్షర్ సిక్స్ బాదాడు. ఐదో బంతికి అక్షర్ ఔట్ అయ్యాడు. భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. 19.5 ఓవర్లలో భారత్ స్కోరు 170/7.
  • ఆర్చర్ వేసిన 19వ ఓవర్లలో 12 పరుగులు వచ్చాయి. జడేజా రెండు ఫోర్లు బాదాడు. భారత్ స్కోరు 159/6.
  • 18 ఓవర్లకు భారత్ స్కోరు 147/6. క్రీజులో అక్షర్ పటేల్(1), జడేజా(3) ఉన్నారు.
  • ఆరో వికెట్ కోల్పోయిన్ భారత్. శివమ్ దూబే డకౌట్.
  • జోర్దాన్ వేసిన 18వ ఓవర్‌లో పాండ్యా వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. తర్వాత బంతికే పాండ్యా(23) ఔట్ అయ్యాడు.
  • లివింగ్ స్టోన్ వేసిన 17 ఓవర్‌లో 6 పరుగులు వచ్చాయి. దీంతో భారత్ స్కోరు 132/4. ప్రస్తుతం క్రీజులో పాండ్యా(9), జడేజా(3) ఉన్నారు.
  • నాలుగో వికెట్ కోల్పోయిన భారత్. సూర్య(47) ఔట్. 16 ఓవర్లకు భారత్ 126/4.Suryakumar Yadav fell in trying to attack Jofra Archer, England vs India, T20 World Cup semi-final, Providence, Guyana, June 27, 2024
  • 15 ఓవర్లకు భారత్ 118/3. పాండ్యా, సూర్య(46) క్రీజులో ఉన్నాడు.
  • రషీద్ వేసిన 14వ ఓవర్‌లో 4వ బంతికి రోహిత్(57) పరుగుల వద్ద ఔట్ అయ్యాడు.Rohit Sharma hit six fours and two sixes in his innings, England vs India, T20 World Cup semi-final, Providence, Guyana, June 27, 2024
  • రోహిత్, సూర్య హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నమోదైందిజ 13 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ 110/2. ప్రస్తుతం క్రీజులో రోహిత్(56), సూర్య(39) ఉన్నారు.
  • గుడ్ న్యూస్. వర్షం ఆగిపోయింది. 11.15 కి మ్యాచ్ తిరిగి ప్రారంభం కానుంది.
  • మ్యాచ్‌కు వర్షం అంతరాయం.
  • జోర్దాన్ వేసిన 8వ ఓవర్‌లో సూర్య సిక్స్ బాదాడు. 8 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ 65/2. ప్రస్తుతం రోహిత్(37), సూర్య(13) పరుగులతో క్రీజులో ఉన్నారు.
  • రషీద్ వేసిన 7 వ ఓవర్‌లో రోహిత్ 2 ఫోర్లు కొట్టాడు. దీంతో ఈ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. భారత్ 55/2.
  • 6 ఓవర్లు పూర్తయ్యాయి. భారత్ 46/2. రోహిత్(26), సూర్య(5)క్రీజులో ఉన్నారు.
  • కరన్ వేసిన ఆరో ఓవర్‌లో రెండో బంతికి పంత్(4) ఔట్.
  • రోహిత్ శర్మ దూకుడు పెంచాడు. 5వ ఓవర్‌లో 2 పోర్లు బాదాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 40/1.
  • నాలుగు ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ 29/1. ప్రస్తుతం క్రీజులో రోహిత్(16), పంత్(2) పరుగులతో ఉన్నారు.
  • టాప్లీ వేసిన మూడో ఓవర్‌లో నాల్గో బంతికి కోహ్లి 9 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. అంతకుముందు రెండో బంతికి కోహ్లి సిక్స్ కొట్టాడు. క్రీజులోకి పంత్ వచ్చాడు.Virat Kohli's poor run at the World Cup continued, England vs India, T20 World Cup semi-final, Providence, Guyana, June 27, 2024
  • రెండో ఓవర్‌ ముగిసింది. భారత ఓపెనర్లు ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 11/0.
  • టోప్లీ వేసిన మొదటి ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోర్ 6/0.
  • భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, కోహ్లీ క్రీజులోకి వచ్చారు. తొలి ఓవర్ టాప్లీ వేస్తున్నాడు.

టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా గురువారం కీలక మ్యాచ్ జరగనుంది. గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం 7.30 నిమిషాలకు జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యంగా టాస్ వేశారు.

- Advertisement -

ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుద బ్యాటింగ్ చేపట్టనుంది. రాత్రి 9.15 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

జట్లు ఇవే..

భారత్: రోహిత్ శర్మ(C), విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, అర్ష్ దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ ప్రీత్ బుమ్రా.<

ఇంగ్లాండ్: జోస్ బట్లర్(C), ఫిల్ సాల్ట్, జానీ బెయిర్ స్టో, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్ స్టోన్, సామ్ కరణ్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్.

సాయంత్రం నుంచి ఏకధాటిగా వర్షం పడడంతో టాస్ వేయలేదు. తాజాగా, వర్షం తగ్గడంతో మ్యాచ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఔట్ ఫీల్డ్ కొంచెం తడిగా ఉండడంతో టాస్ ఆలస్యం కానుంది. కాసేపటి తర్వాత అంఫైర్లు మైదానాన్ని పరిశీలించనున్నారు. ఇప్పటికీ పిచ్‌తోపాటు మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు.

అభిమానులను టెన్షన్‌కు గురిచేసిన వరుణుడు శాంతించాడు. వర్షం తగ్గినప్పటికీ పిచ్‌పై కవర్లు తీయలేదు. కాగా, మైదానం సిబ్బంది పిచ్ రెడీ చేసేందుకు శ్రమిస్తున్నారు.

అయితే, మ్యాచ్‌కు ఎలాంటి అంతరాయం ఉండదని కామెంటేటర్లు చెబుతున్నారు. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. శనివారం ఫైనల్ మ్యాచ్ ఉండడంతో ఐసీసీ రిజర్వ్ డే కేటాయించలేదు. కానీ, వెయిటింగ్ సమయాన్ని మాత్రం ఏడు గంటలకు పొడిగించింది.

మ్యాచ్ రద్దయితే..
ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే.. రిజర్వ్ డే లేనందున ఇరు జట్లు కనీసం 5 ఓవర్లు అయినా తప్పనిసరిగా ఆడాల్సి ఉంటుంది. ఇలా జరగని సమక్షంలో మ్యాచ్ రద్దు అవుతోంది. టీ20 ప్రపంచకప్ నిబంధనల ప్రకారం.. సెమీఫైనల్ మ్యాచ్ రద్దయితే పాయింట్స్ టేబుల్‌లో ఏ జట్టుకు ఎక్కువ పాయింట్లు ఉంటే ఆ జట్టు నేరుగా ఫైనల్ చేరేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ మ్యాచ్ రద్దయితే మాత్రం భారత్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఇంగ్లాండ్..పాయింట్ల పట్టికలో వెనుకంజలో ఉన్నందున వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఇంటి బాట పట్టే అవకాశం ఉంటుంది.

మైదానాన్ని పరిశీలించే సమయం తొలుత 8.30 గంటలుగా నిర్ణయించగా.. తాజాగా, దానిని 8.45కి వాయిదా వేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News