Big Stories

India Won By 50 Runs with Bangladesh: హార్దిక్ ఆల్ రౌండ్ షో.. బంగ్లాదేశ్ పై భారత్ ఘన విజయం..సెమీస్‌లోకి అడుగు..

Hardik and Kuldeep put India on the cusp of Semi Finals: టీ 20 ప్రపంచకప్ సూపర్ 8లో భాగంగా టీమ్ ఇండియా సమష్టి కృషితో మరో అద్భుత విజయాన్ని అందుకుంది. బంగ్లాదేశ్‌తో ఆంటిగ్వాలో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఆల్ రౌండ్ షో తో అదరగొడితే.. కీలకమైన సమయంలో 3 వికెట్లు తీసి కులదీప్ బ్రేక్ అందించాడు. భారత్ విజయంలో వీరిద్దరూ కీలకపాత్ర పోషించడంతో దాదాపు సెమీఫైనల్‌లో అడుగుపెట్టింది.

- Advertisement -

టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మొదట బౌలింగ్ తీసుకుంది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. దీంతో 50 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

- Advertisement -

197 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ కి ఓపెనర్లు మంచి ప్రారంభాన్నే ఇచ్చారు. ఒక దశలో 4 ఓవర్లు గడిచినా వికెట్లు పడలేదు. ఈ సమయంలో రోహిత్ శర్మ.. పాండ్యాకి బౌలింగ్ ఇచ్చాడు. వేసిన రెండు బంతుల్లో ఒక్క బంతిని లిటన్ దాస్ సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత బంతికి లిటన్ దాస్ (13) భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి సూర్యకి క్యాచ్ ఇచ్చాడు.

Also Read: IND vs AUS T20 World Cup 2024 Preview: హోరాహోరీ పోరు తప్పదా?.. నేడు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్

తర్వాత వచ్చిన కెప్టెన్ షాంటో నిలకడగా ఆడాడు. అయితే బుమ్రా బౌలింగ్‌లో షాంటో క్యాచ్ ఇవ్వగా.. రిషబ్ పంత్ వదిలిపెట్టాడు. అలా బతికిపోయిన తను మరో ఓపెనర్ తంజిద్ హాసన్ (29) తో కలిసి పరుగులు రాబట్టారు.

కులదీప్ వేసిన ఓవర్‌లో నాలుగో బంతికి తంజిత్ హాసన్ ని ఎల్బీగా వెనుదిరిగాడు. ఇలా కులదీప్ వరుస ఓవర్లలో మరో రెండు వికెట్లు తీశాడు. తౌహిద్ హ్రదయ్ (4), షకీబ్ (11) ఇద్దరిని పెవిలియన్ బాట పట్టించాడు.

బంగ్లాదేశ్ 13.3 ఓవర్లలో 98 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. దీంతో ఇన్నింగ్స్ భారత్ వైపు టర్న్ తీసుకుంది. కెప్టెన్ షాంటో (32 బంతుల్లో 3 సిక్స్ లు, 1 ఫోర్ తో 40 పరుగులు) చేసి బుమ్రా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో బంగ్లా ఓటమి ఖాయమైంది.

Also Read: South Africa vs West Indies: వెస్టిండీస్‌కు షాక్.. సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన సౌతాఫ్రికా..

ఈ క్రమంలో మహ్మదుల్లా (13) ఔట్ అయ్యాడు. చివరిలో రిషద్ హొసైన్ (10 బంతుల్లో 3 సిక్స్ లు, 1 ఫోర్ తో 24 పరుగులు) చేసి హడావుడి చేశాడు. తర్వాత బుమ్రా అవుట్ చేశాడు. దీంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులకు పరిమితమైంది. దీంతో 50 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. భారత్ బౌలింగ్‌లో కులదీప్ 3, బుమ్రా 2, అర్షదీప్ 2, పాండ్యా 1 వికెట్ పడగొట్టారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్‌కు మంచి శుభారంభం దక్కింది. ఓపెనర్లుగా విరాట్, రోహిత్ దూకుడుగా ప్రారంభించారు. బంగ్లాదేశ్ ఎవరూ ఊహించని విధంగా స్పిన్నర్లతో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. రోహిత్ శర్మ (11 బంతుల్లో 1 సిక్స్, 3 ఫోర్లతో 23 పరుగులు) చేసి ఔట్ అయ్యడు.

తర్వాత రిషబ్ పంత్ తో కలిసి కోహ్లి వేగంగా ఆడారు. ఈక్రమంలో కోహ్లి( 28 బంతుల్లో 3 సిక్స్ లు, 1 ఫోర్‌తో 37 పరుగులు) చేసి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 3000 పరుగులు చేసిన తొలి బ్యాటర్ గా నిలిచాడు. తర్వాత పంత్(24 బంతుల్లో 2 సిక్స్ లు, 4 ఫోర్లతో 36 పరుగులు) ధనాధన్ ఆడాడు. చేసి, ఎప్పటిలా రివర్స్ షాట్ కొట్టి అవుట్ అయిపోయాడు.

Also Read: IND vs AUS T20 WC 2024 Weather Update: నేటి మ్యాచ్ కి వర్షం ఆటంకం? ఆసిస్ కి గుబులు.. ఇండియాకి దిగులు

సూర్యకుమార్ నిరాశ పరిచిన హార్దిక్ పాండ్యా అద్భుతంగా ఆడాడు. 27 బంతుల్లో 3 సిక్స్ లు, 4 ఫోర్లతో 50 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తర్వాత శివమ్ దుబె.. 24 బంతుల్లో 34 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. చివరిలో అక్షర్ పటేల్ (3) నాటౌట్ గా నిలిచాడు. మొత్తానికి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి భారత్ 196 పరుగుల భారీ స్కోరు చేసింది. బంగ్లాదేశ్ బౌలింగ్‌లో షకీబ్ 1, తంజిమ్ 2, రిషాద్ హొసైన్ 2 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో భారత్ సెమీస్ లోకి దాదాపు అడుగుపెట్టినట్లయింది. ఇక రెండు ఓటములతో బంగ్లాదేశ్ సూపర్ 8 నుంచి ఇంటి దారి పట్టనుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News