Big Stories

T20 WC 2024 IND Vs AUS Weather Update: నేటి మ్యాచ్ కి వర్షం ఆటంకం..? ఆసిస్ కి గుబులు.. ఇండియాకి దిగులు!

T20 World Cup 2024- India Vs Australia Weather and Pitch Report: ఆఫ్గనిస్తాన్ ఎంత పనిచేసింది.. అని ఆస్ట్రేలియా ఇప్పుడు తలబాదుకుంటోంది. ఓడితే  ఓడిపోయారు. ఇప్పుడు వారి అదృష్టమే తలకిందులైపోయేలా కనిపిస్తోంది. ఎందుకంటే నేడు భారత్ తో జరగనున్న మ్యాచ్ కి వర్షం ఆటంకం కలిగించేలా ఉంది.

ఎందుకంటే సెయింట్ లూసియా లో నిన్నటి నుంచి వర్షం పడుతూనే ఉంది. అందువల్ల పిచ్ బాగున్నా, అవుట్ ఫీల్డ్ తడిసిపోయి ఉంటే, అంపైర్లు మ్యాచ్ నిర్వహించరు. ఇది ఆసిస్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. నిజానికి వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోతే ఇప్పటికి 2 పాయింట్లతో ఉన్న ఆస్ట్రేలియాకి మరో పాయింట్ కలుస్తుంది కాబట్టి 3 అవుతాయి.

- Advertisement -

ఇంతవరకు బాగానే ఉంది. కానీ అక్కడ ఆఫ్గనిస్తాన్ చేతిలో కూడా 2 పాయింట్లు ఉన్నాయి. వారింకా బంగ్లాదేశ్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. అందులో గానీ వారు గెలిస్తే మాత్రం.. 4 పాయింట్లతో సెమీస్ కి చేరిపోతారు.

- Advertisement -

Also Read: Rohit sharma Reveals victory secret: సీక్రెట్ బయటపెట్టిన రోహిత్‌శర్మ, విజయం వెనుక…

ఒకవేళ ఓడితే మాత్రం ఆస్ట్రేలియా 3 పాయింట్లతో సెమీస్ చేరుతుంది. ఇక వర్షం వల్ల వారి మ్యాచ్ కూడా రద్దయిపోతే, ఆఫ్గనిస్తాన్ పాయింట్లు కూడా 3 అవుతాయి. అప్పుడు నెట్ రన్ రేట్ ఆధారంగా సెమీస్ నిర్ణయం జరుగుతుంది.

అయ్యో, ఎంత పని జరిగింది? ఆఫ్గాన్ లాంటి చిన్నజట్టు చేతిలో ఓడిపోయినందుకు పరువు పోయింది, దాంతో పాటు సెమీస్ కూడా పోయేలా ఉందని అనుకుంటున్నారు.  .

ఇక్కడ టీమ్ ఇండియాకి అనుకున్నంత తేలికగా లేదు. నిజంగా వర్షం వచ్చి ఆగిపోతే ఇండియా 5 పాయింట్లతో సెమీస్ కి దర్జాగా వెళ్లిపోతుంది. లేదంటే కొంచెం ఇక్కట్లతోనే వ్యవహారం ముడిపడి ఉంది. అదేమిటంటే ఆస్ట్రేలియా ఒకవేళ గెలిస్తే ఇండియాపై 41 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. అప్పుడు 4 పాయింట్లు నెట్ రన్ రేట్ తో ఇండియాని దాటి గ్రూప్ టాపర్ గా వెళుతుంది.

Also Read: Afghanistan win by 8 runs on bangladesh: బంగ్లాదేశ్‌పై సంచలన విజయం, సెమీస్‌లో అఫ్గాన్, ఇంటికి ఆస్ట్రేలియా

అప్పుడేం చేయాలంటే భారత్ ఓడినా 41 పరుగుల తేడా లేకుండా చూసుకోవాలి. ఒక 20 లేదా 30 పరుగుల తేడాతో ఓడిపోయినా పర్వాలేదు. అప్పుడు ఆస్ట్రేలియా 2వ స్థానంలోనే ఉంటుంది.

ఇప్పుడు మరొకటి వచ్చే చిక్కు ఏమిటంటే.. అక్కడ ఆఫ్గనిస్తాన్ గానీ బంగ్లాదేశ్ ని 81 పరుగుల తేడాతో ఓడించిందంటే, గ్రూప్ 2 లో రెండో స్థానంలో ఉన్న జట్టుకి ఇక్కట్లు తప్పవు. అది ఇండియా అయినా ఆస్ట్రేలియా అయినా ఒక జట్టు ఇంటికి చేరాల్సిందే.  అందుకని నేడు రాత్రి జరిగే ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ అత్యంత కీలకంగా మారనుందనేది స్పష్టంగా అందరికీ తెలుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News