Big Stories

Ind vs Afg Highlights T20 World Cup 2024: గెలిపించిన సూర్యా, బుమ్రా.. ఆఫ్గాన్ పై టీమ్ ఇండియా ఘన విజయం

India vs Afghanistan Highlights T20 World Cup 2024: టీ ప్రపంచకప్ లో సూపర్ 8 మ్యాచ్ లు ఎలా ఉంటాయి? అందులో ఇండియా ఎలా ఆడుతుంది? అని టెన్షన్ పడిన అందరికీ పెద్ద రిలీఫ్ దొరికింది. ఎందుకంటే బార్బడోస్ లో ఆఫ్గనిస్తాన్ తో జరిగిన తొలి సూపర్ 8 మ్యాచ్ లో టీమ్ ఇండియా సాధికారికంగా ఆడింది. అంతే కాదు సమష్టిగా ఆడి ఘన విజయం సాధించింది. ఇది భవిష్యత్ మ్యాచ్ లకి ఒక ఆశావాహ పరిణామంగా చెప్పాలి. ఇలాగే ఆడితే ఇండియా కచ్చితంగా కప్ కొడుతుందని అందరూ అంటున్నారు.

- Advertisement -

టాస్ గెలిచిన టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ తీసుకుని, 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆఫ్గనిస్తాన్ 20 ఓవర్లలో 134 పరుగులకి ఆలౌట్ అయ్యింది. దీంతో 47 పరుగుల తేడాతో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది.

- Advertisement -

182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ తొలి ఓవర్ లోనే ఇండియాని బెంబేలెత్తించింది. అర్షదీప్ వేసిన మొదటి ఓవర్ లో 13 పరుగులు చేసింది. గుర్బాజ్ ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టి ఘనంగా ప్రారంభించాడు. అయితే రెండో ఓవర్ బుమ్రా వచ్చి రెండో బంతికి గుర్భాజ్ (11) ని అవుట్ చేసి పెవిలియన్ కి పంపించాడు. అలా ఇండియాకి ఊపిరి పోశాడు.

మరో ఓపెనర్ హర్జతుల్లా (2) కూడా బుమ్రా రెండో ఓవర్ లో  అయిపోయాడు. ఇక ఫస్ట్ డౌన్ వచ్చిన జర్దాన్ (8) ని లెగ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. అంతే ఆఫ్గాన్లు 4.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 23 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో పడ్డారు.

ఈ మధ్యలో విరాట్ కొహ్లీ క్యాచ్ ఒకటి మిస్ చేశాడు. లేదంటే 4 వికెట్లు అయిపోయేవని నెటిజన్లు కామెంట్లు పెట్టారు. అయితే ఫీల్డింగ్ లో బ్రహ్మాండమైన ఎఫర్టు పెట్టే కొహ్లీ చేతుల్లోంచి బాల్ జారిపోవడంతో అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. అయితే ఆ తర్వాత వచ్చిన ఆఫ్గాన్ బ్యాటర్లు ఎవరూ క్రీజులో కుదురుకోలేదు.

నయిబ్ (17), ఒమర్ జాయ్ (26), నజిబుల్లా జర్దాన్ (19), మహ్మద్ నబి (14), నూర్ అహ్మద్ (12) కాసేపు పోరాడారు. అయితే తలా ఒక ఫోర్, సిక్స్ కొట్టి అవుట్ అయిపోయారు. కెప్టెన్ రషీద్ ఖాన్ బౌలింగులో ఆకట్టుకున్నాడు గానీ, బ్యాటింగ్ లో విఫలమయ్యాడు. 2 పరుగులు మాత్రమే చేశాడు.
మొత్తానికి ఆఫ్గనిస్తాన్ 20 ఓవర్లలో 134 పరుగులు చేసి ఆలౌట్ అయిపోయింది. ఏ దశలోనూ వారు పోరాటపటిమ చూపలేదు. చివరికి 47 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

Also Read: బ్యాలన్స్ తప్పిన.. మిస్టర్ డిపెండబుల్

అయితే మిడిల్ ఆర్డర్ వికెట్లను స్పిన్నర్లు తీశారు. అక్షర్ పటేల్,  కులదీప్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ తీసుకున్నారు. స్లో పిచ్ మీద బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీయడమే కాదు 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తను కంట్రోల్ చేయడం వల్లే మ్యాచ్ గెలిచింది. మరో పేసర్ అర్షదీప్ కూడా 3 వికెట్లు తీసుకున్నాడు. ఫస్ట్ స్పెల్ ఎక్కువ పరుగులిచ్చానా తర్వాత వికెట్లు తీసి మ్యాచ్ త్వరగా ముగించాడు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియాకి ఓపెనర్లుగా సీనియర్లు రోహిత్ శర్మ, కొహ్లీ వచ్చేశారు. కొంచెం డిఫెన్సెవ్ గానే ఆడారు. అయితే రోహిత్ శర్మ (8) త్వరగా అయిపోయాడు. అయితే కొహ్లీ ఎలా ఆడతాడని అంతా అనుకున్నారు. కానీ కాసేపు క్రీజులో నిలదొక్కుకున్నాడు. ఒక స్ట్రయిట్ సిక్స్ కూడా కొట్టాడు.

ఈలోపు ఫస్ట్ డౌన్ వచ్చిన రిషబ్ పంత్ ధనాధన్ ఆడాడు. ఒక ఓవర్ లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడు. అదే ఊపులో అవుట్ అయిపోయాడు. చివరికి 11 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 20 పరుగులు చేశాడు. మళ్లీ అందరూ కొహ్లీ వైపు చూశారు. సరిగ్గా 24 పరుగుల వద్ద షాట్ కొట్టి తను అవుట్ అయిపోయాడు. అప్పటికి 8.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 62 పరుగులతో భారత్ ఉంది. 150 పరుగులైనా చేస్తుందా? అని అంతా అనుకున్నారు.

కీలకమైన టాప్ ఆర్డర్ మూడు వికెట్లు పడిపోయిన తర్వాత వచ్చిన సూర్య కుమార్ యాదవ్ మళ్లీ బాధ్యతలను తన భుజ స్కంధాలపై వేసుకున్నాడు. జట్టు పరిస్థితుల రీత్యా వికెట్లకి అడ్డంగా నిలబడిపోయాడు. 28 బంతుల్లో 3 సిక్స్ లు, 5 ఫోర్ల సాయంతో 53 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే హార్దిక్ పాండ్యాతో  కలిసి చేసిన 60 పరుగుల పార్టనర్ షిప్.. టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించింది.

అయితే పాండ్యా కూడా ఒక రేంజ్ లో ఆడాడు. 24 బంతుల్లో 2 సిక్స్ లు, 3 ఫోర్ల సాయంతో 32 విలువైన పరుగులు చేశాడు. ఒక సిక్స్ అయితే స్టేడియం అవతల పడింది. ఈ మధ్యలో శివమ్ దుబె (10), రవీంద్ర జడేజా (7) చేశారు. అయితే ఆఖరి ఓవర్ లో అక్షయ్ కుమార్ చేసిన 12 పరుగులు మాత్రం మ్యాచ్ కే హైలైట్ అని చెప్పాలి. తనే స్కోరుని 180 పరుగులు దాటించాడు. మొత్తానికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి టీమ్ ఇండియా 181 పరుగులు చేసింది.

Also Read: టీమ్ ఇండియా.. ఓటమికి కారణాలేమిటి? గంభీర్ కు.. బీసీసీఐ ప్రశ్నలు

ఆఫ్గాన్ బౌలింగులో కెప్టెన్ రషీద్ ఖాన్ టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ ను అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు గానీ, సూర్య, పాండ్యా ఇద్దరూ మళ్లీ ఇండియాని గేమ్ లోకి తీసుకొచ్చారు. మొత్తానికి రషీద్ ఖాన్ 3 వికెట్లు తీశాడు. నవీన్ ఉల్ హక్ 1, ఫరూఖి 3, వికెట్లు పడగొట్టారు.

సూపర్ 8ని టీమ్ ఇండియా విజయంతో ప్రారంభించింది. పాయింట్ల పట్టికలో 2 పాయింట్లతో నిలిచింది. రన్ రేట్ కూడా ఆశాజనకంగా ఉండటంతో సెమీస్ కి వెళ్లే అవకాశాలున్నాయి. అయితే బంగ్లాపై కూడా ఇలాగే గెలిస్తే తిరుగుండదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News