Big Stories

IND vs AFG T20 WC 2024 Preview: ఆఫ్గాన్ తో యుద్ధానికి రెడీ.. నేడే టీమ్ ఇండియా తొలి సూపర్ 8 మ్యాచ్

India vs Afghanistan Dream11 Prediction T20 World Cup 2024 Super 8:  టీ 20 ప్రపంచకప్ లో టీమ్ ఇండియా తన తొలి సూపర్ 8 మ్యాచ్ ను ఆఫ్గనిస్తాన్ తో ఆడనుంది. ఆంటిగ్వాలోని వివియన్ రిచర్డ్స్ గ్రౌండులో భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

- Advertisement -

ఇంతవరకు ఆఫ్గనిస్తాన్ వర్సెస్ భారత్ మధ్య 8 సార్లు మ్యాచ్ లు జరిగాయి. వీటిలో 7 మ్యాచ్ ల్లో టీమ్ ఇండియా విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై మూడు మ్యాచ్ లు ఆడి, అన్నింటా భారత్ విజయం సాధించింది.

- Advertisement -

బార్బడోస్‌ పిచ్ విషయానికి వస్తే.. ఇది బ్యాటింగ్ పిచ్ అని అంటున్నారు. ఎందుకంటే టీ 20 లీగ్ మ్యాచ్ లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా 201 పరుగులు చేసింది. అయితే.. ఇది  డే అండ్ నైట్ మ్యాచ్ కాబట్టి, మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. మంచు సమస్య ఉండకపోవచ్చునని అంటున్నారు. అందువల్ల టాస్ పెద్ద సమస్య కాబోదని చెబుతున్నారు.

ఆఫ్గనిస్తాన్ కి మ్యాచ్ కి ముందే ఒక దెబ్బ తగిలింది. మిస్టరీ స్పిన్నర్ గా పేరుపొందిన ముజీబ్ ఉర్ రెహ్మాన్ గాయంతో మ్యాచ్  కి దూరం కానున్నాడు. ఇక కెప్టెన్ రషీద్ ఖాన్ ఒకడే ఉన్నాడు. ఇది వారికి బలహీనతగా మారవచ్చునని అంటున్నారు.

టీమ్ ఇండియా వైపు చూస్తే… భారత్ పేసర్ మహ్మద్ సిరాజ్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌ రావచ్చునని చెబుతున్నారు.  టోర్నమెంట్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా.. శివమ్ దూబే టీమ్ ఇండియా ఎలెవన్ లో ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు. ఎందుకంటే తను ఆల్ రౌండర్ కావడమే అందుక్కారణమని చెబుతున్నారు.

Also Read: అందుకే ఓడిపోయాం.. అమెరికా కెప్టెన్ ఆరోన్ జోన్స్

ఆఫ్గనిస్తాన్ అప్పుడప్పుడు పెద్ద జట్లపై గెలిచి సంచలనం సృష్టించవచ్చు. కానీ టీమ్ ఇండియాతో పోల్చితే, వారి ముందు.. ఆ పప్పులు ఉడకవని సీనియర్లు అంటున్నారు. ఇక టీమ్ ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడుతూ ఆఫ్గనిస్తాన్ చాలా డేంజరస్ టీమ్ అని చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లో ఉదాసీనత పనికిరాదని అన్నాడు.

ఇప్పటివరకు అమెరికాలో ఆడి, అక్కడ నుంచి భిన్నమైన వాతావరణం ఉన్న వెస్టిండీస్ కి వచ్చామని అన్నాడు. జట్టుపరంగా ఇవన్నీ పక్కన పెట్టినా, అమెరికా పిచ్ లు, వెస్టిండీస్ పిచ్ లు చాలా డిఫరెంటు అని అన్నాడు. వీటికి అలవాటు పడేసరికి సూపర్ 8 అయిపోతుందని అన్నాడు. దానిని అధిగమిస్తే విజయం భారత్ కే సొంతమని తెలిపాడు.

అయితే వెస్టిండీస్ లో గతంలో ఆడిన అనుభవం తమకు అక్కరకు వస్తుందని తెలిపాడు. అండర్ డాగ్స్ గా ఉన్న ఆఫ్గాన్లను అన్నిరకాలుగా ఓడించేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని, మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నామని తెలిపాడు. మరేం జరుగుతుందో, మనోళ్లు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News