Big Stories

Sunil Chhetri Retirement: ముగిసిన శకం.. ఫుట్‌బాల్‌కు సునీల్‌ ఛెత్రి కన్నీటి వీడ్కోలు..!

Sunil Chhetri Retires from International Football: జెర్సీ నంబర్ ఎలెవన్.. 19 ఇయర్స్ కెరీర్.. 94 గోల్స్.. టీమ్ ఇండియా కెప్టెన్.. కౌంట్‌లెస్‌ మెమరీస్.. Not only Captain.. He is also leader.. Legend.. ఆ వీరుడు వీడ్కోలు పలికాడు.. తన ఆటకు సెలవిచ్చాడు..

- Advertisement -

సునీల్ ఛెత్రి.. టీమ్‌ ఇండియా ఫుట్‌బాల్‌ క్యాప్టెన్. 2005లో నేషనల్‌ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి.. నిన్నటి వరకు టీమ్‌ ఇండియా కోసమే డే అండ్ నైట్‌ చెమటోడ్చాడు ఛెత్రి.. టు బీ ఫ్యాక్ట్. ఇండియాలో ఫుట్‌బాల్‌కు ఉన్న గుర్తింపు ఎంత? ఎంత మంది ఈ గేమ్‌ను ఫాలో అయ్యే వారు ఉన్నారు? ఆన్సర్.. చాలా తక్కువ.. చాలా అంటే చాలా తక్కువ. కాని ఛెత్రి ఇంకా వారి టీమ్ మాత్రం.. ఎప్పుడూ ఫేమ్ కోసమో.. పర్సనల్ గెయిన్‌ కోసమో ఆడలేదు. “ఇండియా” అనే పదం కోసం ఆడారు. ఎప్పటికీ మరువలేని విజయాలు అందించారు. అందులో ఛెత్రిది కీ రోల్.. ఇందులో ఎలాంటి డౌట్స్ లేవు..

- Advertisement -

19 ఇయర్స్.. నిజానికి చాలా లాంగ్ పిరియడ్.. కానీ ఈ 19 ఇయర్స్‌లో ఛెత్రి ఇండియన్‌ ఫుట్‌బాల్ ఫేస్‌గా ఉన్నాడు. ఎన్నో ఘనతలు సాధించాడు.. రికార్డులు తన పేరున రాసుకున్నాడు. టీమ్‌ కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నో వండర్స్ చేశాడు. ఇండియా తరపున 151 మ్యాచ్‌లు ఆడిన ఛెత్రి.. 94 గోల్స్‌ చేశాడు. ఒక నేషనల్ టీమ్‌ తరపున అత్యధిక గోల్స్‌ చేసిన నాలుగో ప్లేయర్ ఛెత్రి.. అతని కంటే ముందున్న ముగ్గురు ఎవరో తెలుసా.. క్రిస్టియానా రొనాల్డో 128 గోల్స్.. అలీ దాయ్ 109 గోల్స్.. లియోనల్ మెస్సీ 106 గోల్స్.. ఇది అంత సులభం కాదు.. నేను ఖచ్చితంగా చెప్పగలను.. ఛెత్రి అంటే ఎవరో తెలియని వారికి కూడా రొనాల్డో, మెస్సీ ఎవరో తెలుసు. అలాంటి వారి సరసన గర్వంగా తలెత్తుకుని నిల్చున్నాడు ఛెత్రి. కానీ గుర్తింపు విషయంలో మాత్రం.. వారికి ఛెత్రికి ఎంత గ్యాప్‌ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

Also Read: కెనడా గెలుపు.. పోరాడి ఓడిన ఐర్లాండ్

మరి ఛెత్రి ఫ్యామిలీ హిస్టరీ ఎంటో తెలుసా..?
అసలు ఛెత్రికి ఫుట్‌బాల్‌ ఆడాలని ఎందుకు అనిపించింది? 1984.. సునిల్‌ ఛెత్రి బర్త్‌ ఇయర్.. పుట్టింది ఎక్కడో తెలుసా.. మన హైదరాబాద్‌లో.. యస్.. ఛెత్రి మన హైదరాబాద్‌లోనే పుట్టాడు. ఛెత్రి ఫాదర్‌ ఆర్మీలో జాబ్‌ చేసేవారు కాబట్టి.. దేశంలోని అనేక ప్రాంతాలు తిరిగేవారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఛెత్రి ఫాదర్‌ కేబీ ఛెత్రి.. మదర్‌ సుశీల ఇద్దరూ సాకర్ ప్లేయర్సే.. సుశీల నేపాల్‌ టీమ్‌కు ఆడారు కూడా.. సో ఛెత్రి పేరెంట్స్‌ నుంచే ఫుట్‌బాట్ వారసత్వంగా వచ్చేసింది. 17 ఇయర్స్‌ ఏజ్‌లోనే మోహన్ బగాన్ క్లబ్‌కు త్రీ ఇయర్స్‌ కాంట్రాక్ట్‌ సైన్ చేశాడు ఛెత్రి. ఇక అక్కడి నుంచి అతని ప్రపంచం మొత్తం ఫుట్‌బాల్.. ఫుట్‌బాల్.. బగాన్ క్లబ్‌ కోసం 48 మ్యాచ్‌లు ఆడిన ఛెత్రి.. ఏకంగా 21 గోల్స్ చేశాడు. ఇక అక్కడి నుంచి అతని గోల్స్ వర్షం మొదలైంది. టీమ్ ఇండియా కోసం చేసిన గోల్స్‌ 94 అయితే అన్ని క్లబ్‌లో కోసం ఆడినప్పటివి కూడా యాడ్ చేస్తే 253 అని చెప్పవచ్చు.

ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్ అవార్డ్స్.. చాంపియన్‌ షిప్స్‌.. హీరో ఆఫ్‌ ది ఇండియన్ సూపర్ లీగ్.. గోల్డెన్‌ బూట్స్.. స్పోర్ట్స్‌మెన్‌ ఆఫ్‌ ఇయర్.. ఫుట్‌ బాల్ రత్న.. ఇలా ఎన్నో అవార్డ్స్‌ ఛెత్రి కెరీర్‌లో ఉన్నాయి. గ్రౌండ్‌లో అతని చిరుత లాంటి వేగం.. రికార్డులు బద్దలు కొడుతున్న తీరును చూసిన కేంద్ర ప్రభుత్వం కూడా.. 2011లో అర్జున అవార్డు.. 2019లో పద్మశ్రీ అవార్డు.. 2021లో ఖెల్‌ రత్న అవార్డుతో సత్కరించింది.

Also Read: WI vs UGA HighlightsT20 World Cup 2024: మరో అత్యల్ప స్కోరు నమోదు.. ఉగండా 39కి ఆలౌట్ .. వెస్టిండీస్ ఘన విజయం

ఇండియాలో క్రికెట్‌కు ఉన్నంత ఆదరణ.. మరే స్పోర్ట్‌కు లేదు. ఎస్పెషల్లీ ఫుట్‌బాల్‌ కూడా లేదు. ఇది ఫ్యాక్ట్.. అలాంటి ఇండియన్‌ ఫుట్‌ బాల్‌ గురించి నేషనల్‌ వైడ్‌గా ఈరోజు డిస్కస్ చేసుకునే రోజు వచ్చిందంటే.. అందులో ఛెత్రి చూపించిన ఇంపాక్ట్‌ చాలా ఉంది. అయితే ఈ క్రెడిట్‌ మొత్తం నాది కాదంటాడు ఛెత్రి.. ఫుట్‌బాల్‌లో ప్లేయర్ గోల్ చేయాలంటే మిగిలిన వారంతా సహకరించాలి. నా టీమ్‌ మేట్స్‌ ఎప్పుడూ తనకు సహకరించారన ఎలాంటి గర్వం లేకుండా చెప్తాడు ఛెత్రి..పెనాల్టీ షుటౌట్‌ అనగానే అందరికి ఛెత్రి గుర్తొస్తాడు అంటే అది వారికి నాపై ఉన్న నమ్మకం.. అభిమానం అని చెప్తాడు. తను ఇన్ని గోల్స్‌ చేశానంటే అందులో వారి కో ఆపరేషన్‌ ఎంతో ఉందంటాడు ఛెత్రి..

ఛెత్రి కెరీర్ ప్రారంభం.. ముగింపు.. రెండు మ్యాచ్‌లు డ్రాగానే ముగిశాయి. పాకిస్థాన్‌పై ఆడిన ఫస్ట్‌ మ్యాచ్‌ 1-1తో డ్రాగా చివరిగా కువైట్‌తో ఆడిన మ్యాచ్‌ కూడా 0-0తో డ్రా అయ్యింది. కానీ మ్యాచ్ ముగియగానే అర్థమైనట్టు ఉంది. ఇదే తన చివరి మ్యాచ్ అని అతని కంట కన్నీరు ఆగలేదు. ఆ కన్నీటితో చివరి సారి అభిమానులకు వీడ్కోలు పలికాడు. థ్యాంక్యూ ఛెత్రి.. నీ లెగసిని ఓ జనరేషన్‌కు ఇన్‌స్పిరేషన్‌గా మార్చినందుకు.. థ్యాంక్యూ.. ఇండియన్‌ ఫుట్‌బాల్‌ను ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేసినందుకు.. థ్యాంక్యూ.. సరైన గుర్తింపు లేకపోయినా.. ఇంత కాలం ప్రయాణించినందుకు.. థ్యాంక్యూ.. టు నెవర్ గివప్.. థ్యాంక్యూ.. ఫర్ ఎవ్రీథింగ్.. గుడ్‌లక్‌ సునీల్‌ ఛెత్రి.. అండ్ హ్యాపి రిటైర్‌మెంట్..

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News