Big Stories

Rahul Dravid: బ్యాలన్స్ తప్పిన.. మిస్టర్ డిపెండబుల్

Rahul Dravid irked at Reporter Reminds Him of 1997 Barbados Test: టీమ్ ఇండియా తన తొలి సూపర్ 8 మ్యాచ్ ఆఫ్గనిస్తాన్ తో ఆడనుంది. ఈ నేపథ్యంలో బార్బడోస్ పిచ్ , భారత జట్టులో మార్పులు-చేర్పులు తదితర అంశాలపై టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడాడు. అలాగే విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చాడు. ఈ క్రమంలో ఒక విలేకరి 1997లో బార్బడోస్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ పై అడిగిన ప్రశ్న.. తనకి చిరాకు తెప్పించింది. దీంతో ఎప్పుడూ కూల్ గా ఉండే ద్రవిడ్ కొంచెం అన్ బ్యాలెన్స్ అయ్యాడు.

- Advertisement -

1997లో భారత్-వెస్టిండీస్ పర్యటనకు వెళ్లినప్పుడు బార్బడోస్ లో  ఒక టెస్ట్ మ్యాచ్ జరిగింది. అక్కడ ఇండియా 38 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక్కడ ద్రావిడ్ తొలి ఇన్నింగ్స్ లో 78 పరుగులు చేశాడు. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో 2 పరుగులు మాత్రమే చేశాడు. ఆ విలేకరి ఇదే ప్రశ్న అడిగాడు. ఆటగాడిగా మీకు విండీస్ లో గొప్ప రికార్డ్ లేదు కదా.. ఇప్పుడెలా వ్యూహాలు ప్లాన్  చేశారని అన్నాడు.

- Advertisement -

దీనికి ద్రావిడ్  బదులిస్తూ.. నేనిప్పుడు ప్లేయర్ ని కాదు కదా.. అన్నాడు. ఈ గ్రౌండ్ లో నాకు మంచి రికార్డ్ లేకపోవచ్చు.. కానీ అంతకన్నా మంచి అనుభవాలు  వెస్టిండీస్ లో ఉన్నాయి. వాటిని మీరు మరిచిపోయినట్టున్నారని అన్నాడు. కానీ నేను గతాన్ని మరిచిపోయాను. ఆ పాత్ర అయిపోయింది. ఇప్పుడు కోచ్ గా  ఏం చేయాలనేది ఆలోచిస్తున్నానని అన్నాడు. 27 ఏళ్ల క్రితం ఓడిపోయిన టెస్ట్ మ్యాచ్ గురించి, ఇప్పటివరకు విచారిస్తూ కూర్చుంటామా? అని అసహనం వ్యక్తం చేశాడు. అయినా మావాళ్లు ఆఫ్గాన్ తో జరగబోయే మ్యాచ్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Also Read: టీమ్ ఇండియా.. ఓటమికి కారణాలేమిటి? గంభీర్ కు.. బీసీసీఐ ప్రశ్నలు

నేను అప్పుడెప్పుడో ఆడిన ఆట కాదు.. ఇప్పుడు మావాళ్లు ఆడే ఆటను చూడండి…అని అన్నాడు. ద్రవిడ్ ఇలా ఇరిటేట్ కావడంపై నెట్టింట కామెంట్లు వినిపిస్తున్నాయి. కొందరు భలే బదులిచ్చాడని అంటున్నారు. కొందరు తనేం చెత్తగా ఆడలేదు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 78 పరుగులు చేశాడు కదా అంటున్నారు. అయినా ఒక క్రీడాకారుడు అనగానే గెలుపు, ఓటములు అనేవి సహజమని అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News