Big Stories

T20 world cup 2024: కొహ్లీ ఆట తీరుపై ఆనందంగా లేను: బ్యాటింగ్ కోచ్

T20 world cup 2024: టీ 20 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించే విరాట్ కొహ్లీకి 2024 ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయేలా ఉంది. ప్రతీ మెగా టోర్నమెంటులో భారత్ కప్పు కొట్టినా, కొట్టకపోయినా తన ప్రత్యేకతను నిలబెట్టుకునే విరాట్ కొహ్లీ ఈసారెందుకో తేలిపోతున్నాడు. మొన్ననే ఐపీఎల్ 2024లో అద్భుతంగా ఆడి ఆరెంజ్ క్యాప్ కూడా అందుకున్న విరాట్, ఈసారెందుకో విఫలమవుతున్నాడు.

- Advertisement -

ఇది విరాట్ అభిమానులనే కాదు, సగటు భారతీయుడి మనసుల్ని కూడా కలచివేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మాట్లాడుతూ ఈ మెగా టోర్నమెంటులో విరాట్ ఆట తీరుపై అందరిలాగే నేను కూడా ఆనందంగా లేనని అన్నాడు. ఒక కోచ్ గా కాదు, ఒక అభిమానిగా కూడా బాధ పడుతున్నానని అన్నాడు.

- Advertisement -

ఎందుకంటే ఆఫ్గాన్ మ్యాచ్ లో రాకరాక టచ్ లోకి వచ్చాడు. 24 బంతుల్లో 24 పరుగులు చేశాడు. అంతసేపు క్రీజులో స్టాండ్ అయ్యి, ఇక గేర్ మార్చుతాడని అనుకునేలోపు అవుట్ అయిపోయాడని అన్నాడు. అన్నింటికన్నా మించి, మనకన్నా ఎక్కువగా విరాట్ ఒత్తిడిలో ఉన్నాడని అన్నాడు.

గొప్ప ఆటగాడిగా పేరు రావడం కూడా ఒకొక్కసారి ఇబ్బందికరమేనని అన్నాడు. దానిని నిలబెట్టుకోవడంలో ఒత్తిడితో కూడిన ఆట ఆడాల్సి ఉంటుంది. అప్పుడే అవుట్ అవుతుంటామని అన్నాడు. ఇక నుంచి రాబోవు సెమీస్, ఫైనల్ మ్యాచ్ ల్లో తను విజృంభించాలని కోరుకుంటున్నానని అన్నాడు. తనతోపాటు పరుగులు ఎక్కువగా చేయని వారు కూడా చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు.

Also Read: ఫిక్సింగ్ ఆరోపణలు చేసేవారిపై.. పాక్ బోర్డు సీరియస్

ఇక రిషబ్ పంత్ మంచి రిథమ్ పై ఆడుతున్నాడు. తను వచ్చే మ్యాచ్ ల్లో కూడా టాప్ ఆర్డర్ లోనే వస్తాడని అన్నాడు. టీమ్ ఇండియాలో మంచి ఆప్షన్లు ఉన్నాయని అన్నాడు. ఒకరు ఆడకపోతే మరొకరు రెడీగా ఉన్నారని తెలిపాడు. అలాగే పిచ్ లకు తగినట్టుగా సీమర్లు, స్పిన్నర్లు, ఆల్ రౌండర్లు, బ్యాటర్లతో నిండుగా ఉందని అన్నాడు. వీరందరిలో అక్షర్ పటేల్ బాగా ఆడుతున్నాడని కితాబిచ్చాడు. బంగ్లాదేశ్ ను తక్కువగా అంచనా వేయడం లేదని అన్నాడు. జాగ్రత్తగానే ఆడుతామని తెలిపాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News