Big Stories

India vs Pakistan Pitch Report: ఇండియా -పాక్ మ్యాచ్.. న్యూయార్క్ పిచ్ కీలకం..?

T20 World Cup 2024 Match 19- India Vs Pakistan Pitch Report: టీ 20 ప్రపంచకప్ లో ఇంతవరకు జరిగే మ్యాచ్ లను చూస్తుంటే.. ఎవరికి అర్థం కాకుండా ఉన్న పిచ్ ఏదైనా ఉందంటే అది న్యూయార్క్ పిచ్ అనే అందరూ అంటున్నారు. నేడు అక్కడే టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. నిజానికి రెండు దేశాల మధ్య జరిగే మ్యాచ్ కంటే పిచ్ పైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. కొత్తగా నిర్మించిన నాసా కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో డ్రాప్ ఇన్ పిచ్ లను ఆస్ట్రేలియా నుంచి తీసుకువచ్చారు. కొన్ని ఇండియా నుంచి కూడా వెళ్లాయి. అవి వేరే చోట వేశారు. అవి బాగానే ఉన్నాయి.

- Advertisement -

కానీ న్యూయార్క్ లో పిచ్ ఒక్కటీ ప్రమాదకరంగా మారింది. దీనిపై అప్పుడే బీసీసీఐ ఫిర్యాదు కూడా చేసింది. వీలైతే మ్యాచ్ వెన్యూ మార్చమని ఐసీసీకి  చెప్పింది. ఇప్పటికిప్పుడు మార్చడం కష్టమని ఐసీసీ తేల్చి చెప్పింది. ఎందుకంటే టిక్కెట్లు అమ్మేశారు. కేవలం పాక్-ఇండియా మ్యాచ్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి స్టేడియం ను సిద్ధం చేశారు. ఏదైనా చావో రేవో ఆడక తప్పదని అంటున్నారు.

- Advertisement -

ఇక్కడ మ్యాచ్ లు ఆడిన చాలామంది ఆటగాళ్లు గాయపడ్డారు. మన టీమ్ ఇండియాలో అయితే కెప్టెన్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్, హర్దిక్  అందరూ గాయపడ్డారు. హార్దిక్ పాండ్యా సంగతి తెలిసిందే కదా…బాల్ కన్నా ముందు తను వెళ్లి అడ్డం పడిపోతాడు. అలా గాయాలపాలై ఏడాదిలో సగం రోజులు మంచంపైనే ఉంటాడు. ఇప్పుడిలాంటి పిచ్ పై అదీ కాక, పాకిస్తాన్ మ్యాచ్ అంటే తనలో హై వోల్టేజీ స్టార్టవుతుంది. అందుకని ఇలాంటి వాళ్లు జాగ్రత్తగానే ఉండాలని అంటున్నారు.

Also Read: టీ 20 ప్రపంచకప్ లో.. పాకిస్తాన్ పై టీమ్ ఇండియా రికార్డు

నిజానికి ఆ పిచ్ పై బౌన్స్, స్వింగ్ ఎలా అవుతుందో ఎవరికి అర్థం కావడం లేదని రోహిత్ శర్మలాంటి వాళ్లు తల పట్టుకుంటున్నారు. ఆ బౌలర్ ఒకలా వేస్తుంటే, అది పిచ్ పై ఏదోలా  పడి , ఎక్కడో  టర్న్ అవుతోందని అంటున్నారు. అంతేకాదు.. అది బ్యాటర్ల ముఖాల మీదకి, బాడీ మీదకి రయ్ మని దూసుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇలాంటి పిచ్ లపై అంతర్జాతీయ మ్యాచ్ లు నిర్వహించడం సరికాదని ప్రముఖ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ శ్రీలంక-దక్షిణాఫ్రికా, అలాగే భారత్-ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ ల్లో స్వల్ప స్కోర్లే నమోదయ్యాయి. ఇప్పుడీ ప్రతిష్టాత్మక మ్యాచ్ ఇలాగే చప్పగా జరిగితే కిక్ ఉండదు.

Also Read: Virat Kohli’s Poor Performance: కోహ్లీకి ఏమైంది..? పాక్ పై నాటౌట్ రికార్డ్ అంతేనా?

ఆదివారం కావడంతో టీవీ ముందు ఇంటిళ్ల పాది స్నేహితులు, బంధువులు అందరూ దుప్పట్లు, తలగడ దిండ్లు, స్నాక్స్, కూల్ డ్రింక్స్ అన్నీ పెట్టుకుని, సర్దుకుని కూర్చునేలోగా ఒక జట్టు బ్యాటింగ్ అయిపోతే ఎలా? అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. నిజానికి ఆకాశం మేఘావృతమై పిచ్ మరింత స్వింగ్ అయితే, అదింకా ప్రమాదం కదా అంటున్నారు.  మరేం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News