Big Stories

IND Vs NZ : రాంచీలో భారత్ -న్యూజిలాండ్ తొలి టీ20.. పృథ్వీ షాకు చోటు దక్కేనా..?

IND Vs NZ : న్యూజిలాండ్ పై వన్డే సిరీస్ ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా ..టీ 20 సిరీస్ లో అదే జోరు కొనసాగించేందుకు సిద్ధమైంది. టీమిండియా -కివీస్ జట్ల మధ్య శుక్రవారం రాత్రి 7.30 గంటలకు తొలి టీ20 మ్యాచ్ ప్రారంభకానుంది. రాంచీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. తొలి టీ20లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. వన్డే సిరీస్ లో ఘోర పరాజయం చవిచూసిన కివీస్.. టీ20 సిరీస్‌నైనా కైవసం‍ చేసుకుని ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉంది.

- Advertisement -

జట్టు కూర్పు..
సూపర్ ఫామ్ లో శుభ్ మన్ గిల్ టీ 20ల్లోనూ సత్తా చాటుతాడని క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓపెనర్లుగా గిల్, ఇషాన్ కిషన్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ బ్యాటింగ్ కి వస్తారు. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్ లతో భారత్ బ్యాటింగ్ లైన్ అప్ బలంగా ఉంది. ఇక పేస్ బౌలింగ్ విభాగంలో శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్ , అర్ష్ దీప్ సింగ్ కు అవకాశం దక్కవచ్చు. స్పిన్నర్లలో కులదీప్, చాహల్ ల్లో ఒక్కరికే ఛాన్స్ ఉంది. ఇక పృథ్వీ షాకు చోటుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడాల్లో ఎవరో ఒకరిని తప్పిస్తేనే పృథ్వీ షాకు చోటు దక్కుతుంది. దాదాపు ఏడాదిన్నర తర్వాత టీమిండియాకు ఆడే అవకాశం షాకు లభించనుంది. షా చివరిసారిగా 2021 జులైలో శ్రీలంకతో తన తొలి టీ20 మ్యాచ్‌ ఆడాడు. ఆ మ్యాచ్‌లో షా తొలి బంతికే గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. కివీస్‌తో టీ20 సిరీస్‌కు ముందు మరో ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ గాయం బారిన పడి జట్టుకు దూరమయ్యాడు.

- Advertisement -

పిచ్ కండీషన్..
రాంచీ పిచ్ మొదటి బౌలింగ్ చేసే జట్టుకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జరిగిన 25 టీ20 మ్యాచ్ ల్లో 16 సార్లు ఛేజింగ్ చేసిన జట్లే గెలిచాయి. మంచు వల్ల రెండో ఇన్నింగ్స్ లో బౌలర్లకు బంతిపై గ్రిప్ సరిగా కుదరదు. అందువల్లే ప్రత్యర్థి బ్యాటర్లను నిలువరించడం కష్టమవుతుంది. ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఉష్టోగ్రత 15 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుందని అంచనా.

లక్కీ గ్రౌండ్..
రాంచీలో ఆడిన 3 టీ20 మ్యాచ్ ల్లోనూ భారత్ విజయం సాధించింది. 2021 నవంబర్ లో ఇక్కడ న్యూజిలాండ్, భారత్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో టీమిండియానే విజయం వరించింది.

భారత జట్టు అంచనా..
శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా (కెప్టెన్) దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్ దీప్ సింగ్ , కులదీప్ యాదవ్/ యుజ్వేంద్ర చాహల్.

న్యూజిలాండ్‌ జట్టు అంచనా..
ఫిన్‌ అలెన్‌, డెవాన్‌ కాన్వే, మార్క్‌ చాప్‌మన్, గ్లెన్‌ ఫిలిప్స్‌, డారల్‌ మిచెల్‌, మైఖేల్‌ బ్రేస్‌వెల్‌, మిచెల్‌ సాంట్నర్‌ (కెప్టెన్‌),బ్లెయిర్‌ టిక్నర్‌, ఐష్‌ సోధీ,బెన్‌ లిస్టర్‌, లోకీ ఫెర్గూసన్‌.

రెండో టీ20 లక్నో వేదికగా జనవరి 29, అహ్మదాబాద్ వేదికగా మూడో మ్యాచ్ ఫిబ్రవరి 1న జరగనున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News