Big Stories

IND Vs ENG T20 World Cup 2024: ఇండియా – ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్.. రసవత్తరంగా సాగనున్న మ్యాచ్!

T20 World Cup 2024 Semi Finals – India Vs England: టీ20 వరల్డ్ కప్ 2024 రెండో సెమీ ఫైనల్ లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ నేడు రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్నది. ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు భారీగా ఉన్నాయి. ఎందుకంటే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమఉజ్జీవులుగా ఉన్నారు. టీమిండియా బ్యాటింగ్ విషయంలో పటిష్టంగానే ఉన్నా కూడా విరాట్ కోహ్లీ విషయంలో జట్టు కొద్దిగా ఆందోళనగా ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

అయితే, ఇటీవలి కాలంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మంచి ఫామ్ లోనే ఉంటూ వచ్చాడు. ఇటు ఐపీఎల్ 2024 సీజన్ లో కూడా అధిక పరుగులు తీశాడు. కానీ, టీ20 వరల్డ్ కప్ 2024లో మాత్రం విరాట్ అంతగా రాణిస్తున్నట్లు కనిపించడంలేదు. ఆడిన ఆరు మ్యాచ్ లలో కేవలం 66 పరుగులు మాత్రమే చేశాడు. పైగా రెండుసార్లు డకౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో విరాట్ బ్యాటింగ్ విషయంలో టీమ్ మేనేజ్మెంట్ కొంతవరకు ఆందోళనగా ఉన్నట్లు తెలుస్తోంది. అదిరిపోయే లెవెల్ లో బ్యాటింగ్ చేస్తూ ఎప్పుడూ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే కోహ్లీ ఈసారి అంతగా రాణించడంలేదు. దీంతో కొంతవరకు నిరాశతో ఉన్నారు. నేడు జరిగే మ్యాచ్ చాలా అత్యంత కీలకంగా మారనున్నది. ఎందుకంటే ఇరు జట్లలో సమఉజ్జీవులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ రసవత్తరంగా జరిగే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో బాగా రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

- Advertisement -

Also Read: Yuvraj Singh Tweet Viral: ‘గుడ్ నైట్ బామ్మర్దులూ’.. ఇంగ్లాండ్ ఆటగాళ్లపై యువరాజ్ సెటైరికల్ పోస్ట్..

అదేవిధంగా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ క్రికెట్ ఫ్యాన్స్ సూచిస్తున్నారు. సీమర్ జోఫ్రా ఆర్చర్ పై రోహిత్ గణాంకాలు ఏమంతగా బాగాలేవు. టీ20ల్లో ఆర్చర్ వేసిన 20 బంతులను ఆడిన రోహిత్ శర్మ కేవలం 17 పరుగులు మాత్రమే చేసి మూడుసార్లు అవుటయ్యారు. ఆర్చర్ బౌలింగ్ విషయంలో టీమిండియా బీకేర్ ఫుల్ గా ఉండాలంటున్నారు. ఆచితూచి ఆడుతూ మరోసారి రెచ్చిపోతే టీమిండియా గెలుపు ఖాయమంటున్నారు అభిమానులు.

అయితే, టీమిండియా – ఇంగ్లండ్ జట్లు తలపడినప్పుడల్లా మ్యాచ్ ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ పై టీమిండియా విజయాల శాతం ఎక్కువగా ఉందంటూ గూగుల్ పేర్కొన్నది. టీమ్ ఇండియా విజయాల శాతం 58 శాతం కాగా, ఇంగ్లండ్ జట్టుకు 42 శాతంగా ఉన్నట్లు పేర్కొన్నది.

ఇండియా టీమ్ మెంబర్స్.. రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, అర్ష్ దీమ్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా ఉన్నారు.

Also Read: ఒత్తిడి భారత్ పైనే ఉంది, అయినా ? : రోహిత్ శర్మ

ఇంగ్లండ్ టీమ్ మెంబర్స్.. జోస్ బట్లర్(కెప్టెన్), మొయిన్ అలీ, లియామ్ లివింగ్ స్టోన్, జానీ బెయిర్ స్టో, సామ్ కర్రాన్, క్రిస్ జోర్దాన్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీ, జోఫ్రా ఆర్చర్, హ్యారీ బ్రూక్ ఉన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News