Big Stories

IND vs AUS 1st T20 : చివరి బంతి వరకు ఉత్కంఠ.. ఆసిస్ పై భారత్ ఘన విజయం

IND vs AUS 1st T20 : వన్డే వరల్డ్ కప్ ఫైనల్ షాక్ నుంచి భారతీయులు ఇంకా కోలుకోలేదు. అప్పుడే ఆస్ట్రేలియాతో 5 టీ 20 మ్యాచ్ ల సిరీస్  స్టార్ట్ అయ్యింది.  తొలి మ్యాచ్ విశాఖపట్నంలో జరిగింది. అయితే చివరి బాల్ వరకు టెన్షన్ టెన్షన్ గా నడిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసిస్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.

- Advertisement -

తర్వాత భారీ లక్ష్యంతో టీమిండియా దిగింది. అంతవరకు బాగానే ఆడింది. అయితే చివర్లో విజయానికి 15 పరుగులు కావాలి. అప్పుడు అయిదో వికెట్ పడింది. తర్వాత  ఆ పరుగులు చేయడానికి మరో మూడు వికెట్లు టీమిండియా కోల్పోయింది. ఎట్టకేలకు ఆఖరి బాల్ వరకు పరిస్థితి వచ్చింది. దీంతో లాస్ట్ బాల్ రింకూ సింగ్ సిక్స్ కొట్టి ఉత్కంఠ మ్యాచ్ ని ముగింపు పలికాడు. ఘన విజయాన్ని అందించాడు.

- Advertisement -

టాస్ గెలిచిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మొదట ఫీల్డింగ్ తీసుకున్నాడు. బ్యాటింగ్ కి వచ్చిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు టీమ్ ఇండియా బౌలర్లను ఒక ఆట  ఆడుకున్నారు. ఓపెనర్ గా వచ్చిన స్టీవ్ స్మిత్ 52 పరుగులు చేసి శుభారంభం అందించాడు. మరో ఓపెనర్ మాట్ షార్ట్ 13 పరుగులు మాత్రమే చేశాడు.

ఫస్ట్ డౌన్ వచ్చిన జోష్ ఇంగ్లీషు 50 బాల్స్ లో 110 పరుగులు చేసి ఇండియా బౌలింగ్ ని చితక్కొట్టాడు. చివర్లో టిమ్ డేవిడ్ (19) పరుగులు చేశాడు…మొత్తానికి 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 208 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఇండియా బౌలింగ్ లో ప్రసిద్ధ కృష్ణ, రవి బిష్ణోయ్ చెరొక వికెట్ తీసుకున్నారు.

209 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన టీమ్ ఇండియా పని అయిపోయిందనే అంతా అనుకున్నారు. అందుకు తగినట్టుగానే ఓపెనర్లు జైస్వాల్ (21), రుతురాజ్ గైక్వాడ్ (0) ఇద్దరూ తక్కువ స్కోరుకే అవుట్ అయ్యారు. 2.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి కేవలం 22 పరుగులు మాత్రమే చేసింది.

ఆ సమయంలో ఇషాన్ కిషన్ (58) వచ్చి వికెట్టు పడకుండా చూసుకున్నాడు. మరో ఎండ్ లో కెప్టెన్ సూర్యకుమార్ (80) ధడ్ ధడ్ లాడించాడు. ఇద్దరూ కూడా స్కోరు బోర్డుని పరుగులెత్తించారు. సూర్యకుమార్ 9 ఫోర్లు, 4 సిక్స్ ల సాయంతో 80 పరుగులు చేశాడు. వీటిని కేవలం 42 బంతుల్లోనే చేయడం విశేషం. తర్వాత తిలక్ వర్మ (12) చేసి అవుట్ అయ్యాడు.

ఆ దశలో రింకూ సింగ్ (22 నాటౌట్ ) కి సపోర్ట్ ఇచ్చేవారే కరవయ్యారు. చివరికి 49 ఓవర్ లో హై డ్రామా స్టార్ట్ అయ్యింది. అది ఆఖరి ఓవర్… 6 బాల్స్ కి 7 పరుగులు చేయాలి. మొదటి బాల్ ని రింకూ సింగ్ 4 కొట్టాడు. ఇక 3 పరుగులు చేయాలి.-5 బాల్స్ ఉన్నాయి. ఆ టైమ్ లో అక్షర్ పటేల్ (2) అవుట్ అయ్యాడు. తర్వాత రవి బిష్ణోయ్ (0), అర్షదీప్ సింగ్ (0) ఇద్దరూ రన్ అవుట్ అయ్యారు.

దీంతో 1 బాల్ 1 రన్ పరిస్థితి వచ్చింది. బ్యాటింగ్ లో రింకూ ఉన్నాడు. అంతే ఆఖరి బాల్ ని లాగి పెట్టి కొడితే అదెళ్లి స్టాండ్ లో పడింది. అలా 6 పరుగులు వచ్చాయి. అయితే అది నో బాల్ గా డిక్లేర్ చేశారు. అప్పటికే విజయం సాధించడంతో టీ 20 యువ ఆటగాళ్లు ఉబ్బి తబ్బిబ్బయ్యారు. ఫైనల్ మ్యాచ్ లో ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్టయ్యిందని అంతా అనుకున్నారు. ఆస్ట్రేలియా బౌలింగ్ లో తన్వీర్ సంఘా 2, జాసన్ 1, మాట్ షార్ట్ 1, సీన్ అబోట్ 1 వికెట్లు తీశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News