Big Stories

Suryakumar Yadav-Virat Kohli: కోహ్లీ వరల్డ్ రికార్డ్ సమం చేసిన సూర్యకుమార్

Suryakumar Yadav Equals Virat Kohli’s World Record In T20Is: టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్, టీ 20 స్పెషలిస్ట్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డుకి ఒక అడుగుదూరంలో ఉన్నాడు. ప్రస్తుతం విరాట్ కొహ్లీకి సమానంగా నిలిచాడు. విషయం ఏమిటంటే, ఆఫ్గనిస్తాన్ తో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో సూర్య 28 బంతుల్లో 53 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

- Advertisement -

టీమ్ ఇండియా కష్టకాలంలో.. ఒంటరిగా పోరాడి హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇలా టీ 20 మ్యాచ్ ల్లో అత్యధికసార్లు అవార్డు అందుకున్న విరాట్ కొహ్లీ (15) సరసన నిలిచాడు. మరొక్క మ్యాచ్ లో అవార్డు సాధిస్తే, వరల్డ్ రికార్డ్ సూర్యా సొంతం అవుతుంది.

- Advertisement -

విరాట్ కోహ్లీ 121 మ్యాచ్‌ల్లో 15 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. సూర్యకుమార్ మాత్రం 64 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించి సూపర్ హీరో అనిపించాడు. సూర్యా, కొహ్లీ కన్నా ముందు ఈ జాబితాలో విరందీప్ సింగ్ ( మలేసియా, 78 మ్యాచ్‌లు), సికిందర్ రాజా ( జింబాబ్వే, 86 మ్యాచ్‌లు), మహమ్మద్ నబీ ( ఆఫ్గనిస్తాన్, 126 మ్యాచ్‌లు) 14 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నారు.

ఇకపోతే టీ 20 మ్యాచ్ ల్లో సూర్యకుమార్ గత రెండేళ్లుగా నెంబర్ వన్ బ్యాటర్ గా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన మూడేళ్లలోనే 64 టీ 20 మ్యాచ్ లు ఆడాడు. 45.06 సగటుతో 2253 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. రోహిత్ శర్మ, గ్లేన్ మ్యాక్స్‌వెల్ తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా సూర్యకుమార్ ఉన్నాడు.

Also Read: ప్యాట్ కమిన్స్ హ్యాట్రిక్.. అర్షదీప్ కి వచ్చేదే.. జస్ట్ మిస్!

2024 టీ 20 ప్రపంచకప్ లో జరిగిన లీగ్ మ్యాచ్ ల్లో టీమ్ ఇండియా బౌలర్లకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు వచ్చాయి. మొదటి సారి బ్యాటర్ గా సూర్యకుమార్ అందుకున్నాడు. మొన్న లీగ్ దశలో అమెరికాతో మ్యాచ్ లో కూడా ఒంటరిగా పోరాడి, జట్టుకి విజయాన్ని అందించాడు.

నిజానికి ఓపెనర్లుగా కొహ్లీ, రోహిత్ రావడం, వారు వెంటనే అయిపోవడంతో భారమంతా సూర్యాపై పడుతోంది. దీనిని టీమ్ మేనేజ్మెంట్ ఆలోచించాలని అంటున్నారు. కీలకమైన సమయంలో సూర్యా అవుట్ అయితే పరిస్థితేమిటి? అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News