Big Stories

ICC T20I Rankings: ఐసీసీ టీ20 ర్యాకింగ్స్.. అగ్రస్థానానికి పాండ్యా..

ICC T20I Rankings Hardik Pandya becomes No. 1 all-rounder: 2024 టీ20 ప్రపంచకప్‌లో రాణించిన భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా ఐసీసీ టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానానికి ఎగబాకాడు. శ్రీలంక స్టార్ క్రికెటర్ వనిందు హసరంగా కూడా పాండ్యాతో అగ్రస్థానంలో నిలిచాడు. టీమిండియా ప్రపంచ కప్ సాధించడంలో హార్థిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు.

- Advertisement -

బార్బడాస్ వేదికగా జరిగిన ఫైనల్లో పాండ్యా క్లాసెన్ వికెట్ తీసి టీమిండియాను ఆటలో నిలబెట్టాడు. చివరి ఓవర్లో 16 పరుగులు డిఫెండ్ చేయాల్సి ఉండగా తొలి బంతికి మిల్లర్‌ను అవుట్ చేసి టీమిండియా కప్పు సాధించేలా చేశాడు. మొత్తంగా పాండ్యా ఫైనల్లో 20 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీసుకున్నాడు. అంతకుముందు ఇంగ్లాండ్‌తో జరిగిని సెమీఫైనల్లో పాండ్యా కేవలం 13 బంతుల్లో 23 కీలక పరుగులు చేసి ఇండియాను గట్టెక్కించాడు.

- Advertisement -

హార్థిక్ పాండ్యా, వనిందు హసరంగా తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా ఆటగాడు మార్కస్ స్టోయినిస్, జింబాబ్వే ఆటగాడు సికందర్ రాజా, బంగ్లాదేశ్ ఆటగాడు షకిబ్ అల్ హసన్ తొలి ఐదు స్థానాలను ఆక్రమించారు. ఇండియా నుంచి మరో ఆటగాడు అక్షర్ పటేల్ 12వ స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ బౌలర్ అదిల్ రషీద్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సౌతాఫ్రికా బౌలర్ నోకియా ఏడు స్థానాలు ఎగబాకి రెండో స్థానంలో నిలిచాడు. ఇక టీమిండియా నుంచి అక్షర్ పటేల్ 7, కుల్దీప్ యాదవ్ 9వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇక టీమిండియా ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా ఏకంగా 12 స్థానాలు ఎగబాకి 12వ స్థానంలో నిలిచాడు. అతని తర్వాత అర్ష్‌దీప్ సింగ్ 13వ స్థానంలో నిలిచాడు.

Also Read: కోహ్లీ విషయంలో.. నాడు ధోనీ, నేడు రోహిత్

ఇక బ్యాటింగ్ విషయానికొస్తే ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ తొలి స్థానంలో కొనసాగుతుండగా.. టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. యశస్వి జైశ్వాల్(7) మాత్రమే టాప్-10లో చోటు దక్కించుకున్నాడు.

ఇక జట్ల విషయానికొస్తే టీమిండియా మొదటి స్థానంలో ఉండగా ఆస్ట్రేలియా జట్టు రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇక ఆ తర్వాత స్థానాలలో ఇంగ్లాండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా ఉన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News