Big Stories

ICC T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలో భారత్.. ఏడో ప్లేస్‌లో పాకిస్థాన్..!

Team India is No.1 in ICC T20 Rankings: వెస్టిండీస్, USAలో జరుగుతున్న T20 ప్రపంచ కప్‌లో ఇప్పటికి 24 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో పలు సంచలనాలు నమోదయ్యాయి. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పలు జట్లు ప్రభావితమయ్యాయి.

- Advertisement -

టీమిండియా తొలి స్థానాన్ని నిలుపుకోగా.. పాకిస్థాన్ మాత్రం త్రీవంగా నష్టపోయింది. టోర్నమెంట్‌ ప్రారంభంలో సూపర్ ఓవర్‌లో తమ తొలి గేమ్‌లో అమెరికా చేతిలో ఓడిపోయి పాయింట్లు కోల్పోయిన జట్లలో పాకిస్థాన్ ఒకటి. అంతేకాకుండా, టీమిండియా చేతిలో 120 పరుగులు చేధించలేక పాకిస్థాన్ చతికిలపడింది. కానీ మంగళవారం కెనడాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి టోర్నీలో తొలి విజయం నమోదు చేసింది.

- Advertisement -

అయితే, తాజా ICC T20I జట్టు ర్యాంకింగ్స్‌లో కెనడాతో జరిగిన విజయం ఆ జట్టుని ఏడో స్థానానికి దిగజారకుండా కాపాడలేక పోయింది. పాకిస్థాన్‌కు ప్రస్తుతం 241 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. 230 పాయింట్లో శ్రీలంక వారి తరువాతి స్థానంలో కొనసాగుతుంది. ఫ్లోరిడాలో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌ రద్దు కావడంతో శ్రీలంక ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించే పరిస్థితిలో ఉంది.

Also Read: నమీబియాకి చుక్కలు చూపించిన ఆస్ట్రేలియా.. 5.4 ఓవర్లలో విజయం

ఇక ముఖ్యంగా అమెరికా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.. ప్రపంచ కప్‌లో తమ తొలి రెండు మ్యాచుల్లో పాకిస్థాన్, కెనడాలను ఓడించి సంచలనాలు నమోదు చేసింది. ఈ ఆటతీరుతో అమెరికా 17వ స్థానానికి ఎగబాకింది. ఇక గ్రూప్-ఏ నుంచి సూపర్ 8 లోకి చేరేందుకు అమెరికా అడుగు దూరంలో ఉంది. నమీబియా, ఒమన్‌పై విజయాలు సాధించిన స్కాట్లాండ్ 12వ స్థానానికి ఎగబాకింది.

ఐర్లాండ్‌, పాకిస్థాన్‌లపై జంట విజయాలతో 265 రేటింగ్‌ పాయింట్లతో టీమ్‌ ఇండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రపంచ కప్ ఛాంపియన్ ఆస్ట్రేలియా కూడా ఈ మెగా ఈవెంట్‌లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉంది. భారత్‌ కంటే కేవలం ఏడు పాయింట్లు మాత్రమే వెనుకబడి ఉంది.

ఇంగ్లాండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా వరుసగా 3,4,5,6 స్థానాల్లో నిలిచాయి. ఇక బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్ వరుసగా 9,10 స్థానాల్లో నిలిచాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News