Big Stories

ICC T20 WC 2024 Team of the Tournament: టీ 20 వరల్డ్ కప్ ఐసీసీ అవార్డుల లిస్ట్ ఇదే..

ICC Announced list of Tournament Best Players of T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ విజేతగా టీమ్ ఇండియా నిలిచింది. అయితే టోర్నమెంటు అంతా అద్భుతంగా ఆడిన ఆటగాళ్లకు ఐసీసీ అవార్డ్స్ ప్రకటించింది. అందులో ముగ్గురు భారతీయులు ఉండటం విశేషం. ఇంతకుముందే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుని జస్ప్రీత్ బుమ్రాకి ఇచ్చారు. ఈ టోర్నీలో బుమ్రా 15 వికెట్లను పడగొట్టి.. ఎకనామీ 4.17గా కొనసాగించాడు. ప్రత్యర్థుల బ్యాటర్లకు చుక్కలు చూపించి.. కట్టడి చేయగలిగాడు. భారత బౌలింగ్ దళానికి నాయకత్వం వహించడంతో బుమ్రాకు ఈ అవార్డు దక్కింది. ఫైనల్ మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన విరాట్ కొహ్లీ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
అయితే బుమ్రా కన్నా  2 వికెట్లు ఎక్కువ తీసిన అర్షదీప్ సింగ్ (17) ఉత్తమ బౌలర్ అవార్డు దక్కింది. తనతో పాటు ఆఫ్గనిస్తాన్ బౌలర్ ఫరూఖీ (17) కి కూడా అవార్డు దక్కింది.
ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన క్యాచ్ పట్టుకుని మిల్లర్ ని అవుట్ చేసిన తీరు నభూతో నభవిష్యత్ అని చెప్పాలి. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ క్యాచ్ అందుకున్న సూర్యకుమార్ యాదవ్ కి ఐసీసీ అవార్డు అందించింది.
వరల్డ్ కప్ లో ఆడి అవార్డు విజేతలుగా నిలిచిన వివరాలు ఇవే..

* ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ –
జస్ప్రీత్ బుమ్రా (15 వికెట్లు, ఎకానమీ రేటు 4.17)
* ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ – విరాట్ కోహ్లీ (76 పరుగులు)
* స్మార్ట్ క్యాచ్ ఆఫ్ ది ఫైనల్ – సూర్యకుమార్ యాదవ్
* అత్యధిక పరుగులు – రహ్మానుల్లా గుర్బాజ్ (281 పరుగులు)
* అత్యధిక వికెట్లు – అర్ష్‌దీప్ సింగ్, ఫజల్‌హాక్ ఫరూఖీ (17 వికెట్లు)
* అత్యధిక వ్యక్తిగత స్కోరు – నికోలస్ పూరన్ (98, ఆఫ్ఘనిస్థాన్‌పై)
* బెస్ట్ బౌలింగ్ గణాంకాలు
– ఫజల్‌హాక్ ఫరూకీ (9 పరుగులకు 5 వికెట్లు, ఉగాండాపై)
* అత్యధిక స్ట్రైక్ రేట్ –   షాయ్ హోప్ (187.71)
* బెస్ట్ ఎకానమీ రేట్ – టిమ్ సౌథీ (3.00)
* అత్యధిక సిక్సర్లు – నికోలస్ పూరన్ (17 సిక్సులు)
* అత్యధిక 50+ స్కోర్లు – రోహిత్ శర్మ, రహ్మానుల్లా గుర్బాజ్ (చెరో 3)
* అత్యధిక క్యాచ్‌లు – ఐడెన్ మార్క్‌రమ్ (8 క్యాచ్‌లు)

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News