Big Stories

Rohit Sharma Comments: ఎన్ని హాఫ్ సెంచరీలు చేశామన్నది కాదు.. గెలిచామా..? లేదా..? అన్నదే ముఖ్యం: రోహిత్ శర్మ

India Captain Rohit Sharma Speaks after Win against Bangladesh: టీ 20 ప్రపంచకప్ సూపర్ 8లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ హార్దిక్ పాండ్యా అద్భుతంగా ఆడాడని అన్నాడు. తను మాకు కీలకమైన ఆటగాడని తెలిపాడు. అటు మిడిలార్డర్, ఇటు లోయర్ ఆర్డర్ రెండు బాధ్యతలను తనే తీసుకుని విలువైన పరుగులు చేశాడని అన్నాడు. అదే మ్యాచ్ కి టర్నింగ్ పాయింట్ అని తెలిపాడు. ఇక బౌలింగులో కూడా ఫస్ట్ వికెట్ తనే తీసుకుని బ్రేక్ ఇచ్చాడని తెలిపాడు.

- Advertisement -

టీ 20ల్లో బౌలర్లపై ఆధిపత్యం చేయాలని, అప్పుడే ప్రత్యర్థులపై ఒత్తిడి పెరుగుతుందని రోహిత్ తెలిపాడు. ఇక్కడ దూకుడైన ఆట కరెక్ట్ అని తెలిపాడు. ఎన్ని 50 హాఫ్ సెంచరీలు, ఎన్ని సెంచరీలు చేశామన్నది ముఖ్యం కాదని అన్నాడు. మ్యాచ్ గెలిచామా? లేదా? అనేదే ప్రధానమనే అర్థం వచ్చేలా మాట్లాడాడు. దీంతో అందరిలో రకరకాల అర్థాలు స్ఫురించాయి.

- Advertisement -

ఓపెనర్లు త్వరగా అయిపోతున్నారని కాదు.. ఇప్పుడు మన జట్టులో 8 మంది బ్యాటర్లు ఉన్నారని అన్నాడు. ఇది 20 ఓవర్ల మ్యాచ్.. తీరిగ్గా 50 ఓవర్ల వన్డేలా ఆడుతామంటే కుదరదని అన్నాడు. జట్టులో అనుభవం ఉన్న ప్లేయర్లు ఉన్నారని తెలిపాడు. ఇక బౌలర్లు కులదీప్, బుమ్రా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని అన్నాడు. వాళ్ల ప్రత్యేకతే వేరు అని తెలిపాడు.

కెప్టెన్ రోహిత్ శర్మ  మాటలు.. నెట్టింట సంచలనంగా మారాయి. హాఫ్ సెంచరీ విషయంలో పాండ్యాని ఉద్దేశించి అన్నాడా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక హాఫ్ సెంచరీ చేశాడని తనని ఆకాశానికి ఎత్తేయవద్దని ఇండైరక్టుగా అన్నాడా? అని నెట్టింట రంధ్రాన్వేషణ మొదలుపెట్టారు. లోకం తీరు తెలుసు కదా.. ఇలాగే ఉంటుంది.

కాకపోతే బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్ ని రోహిత్ శర్మ ప్లాన్ ప్రకారమే పాండ్యా బౌలింగ్ చేశాడు. దీంతో సూర్యా చేతుల్లోకి క్యాచ్ వెళ్లింది. మ్యాచ్ లో ఇద్దరూ కలిసి ఒక ప్రణాళిక ప్రకారం ఆడుతున్నారు కదా…ఇక ఇలాంటి డిస్కషన్స్ ఆపమని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న జట్టులో పుల్లలు పెట్టవద్దని మరికొందరు అంటున్నారు. నిజమే కదా..!
- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News