Big Stories

Babar Azam: 11మంది ఆట.. నన్ను ఆడమంటే సాధ్యమా: బాబర్

Babar Azam On World Cup Exit: టీ 20 ప్రపంచకప్ లో పెను సంచలనాలు నమోదయ్యాయి. ఇందులో భాగంగా పాకిస్తాన్ గ్రూప్ దశ నుంచి ఇంటికి చేరడంతో ఆ దేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పాక్ మాజీలు అంతా కలిసి ఏకమైపోయారు. కెప్టెన్ బాబర్ అజామ్ పై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. అందరూ తనవైపే వేలెత్తి చూపిస్తున్నారు. దీంతో కెప్టెన్ బాబర్ స్పందించాడు.

- Advertisement -

పాకిస్తాన్ లో దిగిన తర్వాత అందరికీ సమాధానం చెబుతానని న్నాడు. నిజానికి వన్డే వరల్డ్ కప్ అయిన వెంటనే, నా కెప్టెన్సీకి రాజీనామా చేశాను. అక్కడితో నా బాధ్యత అయిపోయింది. మళ్లీ పీసీబీ చేయమంటేనే చేశానని అన్నాడు. అయినా టోర్నమెంటులో ఓడిపోయామంటే, అందుకు నా ఒక్కడిదే బాధ్యత కాదని అన్నాడు. జట్టులో 11మంది ఆటను, నేను ఒక్కడినే ఆడలేను కదా.. అన్నాడు.

- Advertisement -

కెప్టెన్సీలో తప్పులుంటే, వ్యూహాల్లో లోపాలు ఉంటే చెప్పమనండి, అంతేకానీ అందరూ నా ఒక్కడిదే తప్పు అంటే ఎలా? అని ఆవేదన వ్యక్తం చేశాడు. జట్టులో ఎవరూ కూడా సరైన భాగస్వామ్యాలు నిర్మించకపోతే, నా తప్పు ఎలా అవుతుంది? అయితే రిజ్వాన్ ఆడాలి, లేదంటే నేను ఆడాలి…అన్నట్టుగా ఉందని అన్నాడు.

ఇక బౌలింగులో కీలకమైన సమయంలో, అవతల ప్రత్యర్థులు పార్టనర్ షిప్ లు బిల్ట్ అవుతున్న దశలో వికెట్లు తీయాలి. అలాంటిదెక్కడ జరుగుతోంది? నేను వెళ్లి బౌలింగు చేయాలా? అన్నట్టు మాట్లాడాడు. క్రికెట్ 11 మంది ఆడాలి. నేను ఒక్కడ్ని కాదు.. ఇది సమష్టి బాధ్యతని అన్నాడు.

Also Read: పడుతూ లేస్తూ.. పాక్ ని గెలిపించిన.. బాబర్

అయితే జట్టులో వైఫల్యాలను ఎవరిమీద రుద్దడం లేదు. ఒక కెప్టెన్ గా నేనే బాధ్యత తీసుకుంటాను. కానీ స్థిరత్వం లేని జట్టునిచ్చి, కెప్టెన్ దే తప్పు అని సీనియర్లు కూడా వ్యాక్యానించడం చూస్తుంటే, బాధగా ఉందని అన్నాడు. జట్టులో లోపాలు చెప్పకుండా బాబర్ ని తప్పు పట్టడం కరెక్టేనా? అని అన్నాడు.

ఒక్క బాబర్ ని మార్చేస్తే, పాకిస్తాన్ క్రికెట్ కి మేలు జరుగుతుందంటే, కెప్టెన్సీపై నాకెటువంటి అభ్యంతరం లేదని అన్నాడు. ప్రస్తుతం నేనెప్పుడో రిజైన్ చేశాను. పీసీబీ మళ్లీ కెప్టెన్సీ చేయమంటే చేశాను. ఇప్పుడు కాదంటే వదిలేస్తానని, అయినా పాకిస్తాన్ వెళ్లాక అందరికీ సరైన సమాధానం చెబుతానని అన్నాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News