Big Stories

Gautam Gambhir Condition: భారత్ క్రికెట్ లో బాంబ్.. ఆ నలుగురు వద్దు: గంభీర్ కండీషన్..?

Gautam Gambhir Condition for 4 key players in Team India: భారత్ క్రికెట్ లో ఒక బాంబ్ పేలనుంది. టీ 20 ప్రపంచకప్ కన్నా ఆ వార్త ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. అదేమిటంటే కొత్త కోచ్ గా గౌతం గంభీర్ రానున్నాడనే ప్రచారం ఒకటి నడుస్తోంది. అయితే తను కోచ్ గా రావాలంటే కొన్ని కండీషన్స్ పెట్టినట్టు తెలుస్తోంది. వాటిలో ప్రధానంగా నలుగురు సీనియర్ క్రికెటర్ల భవితవ్యాన్ని తేల్చమని చెప్పినట్టు సమాచారం.

- Advertisement -

ఇంతకీ వారెవరో కాదు. ఇన్ని సంవత్సరాలు భారత క్రికెట్ కి ఎనలేని సేవలందించి, ఎన్నో సందర్భాల్లో మ్యాచ్ లను ఒంటిచేత్తో గెలిపించి, మ్యాచ్ విన్నర్లుగా మారిన ఆ నలుగురు ఎవరంటే.. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, భారత బ్యాటింగ్ వెన్నుముక విరాట్ కొహ్లీ, స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, 2023 ప్రపంచకప్ ను ఫైనల్ వరకు తీసుకువెళ్లడంలో ప్రధాన పాత్ర పోషించిన స్టార్ పేసర్ మహ్మద్ షమీలను తప్పించమని చెప్పినట్టుగా తెలిసింది.

- Advertisement -

అది కూడా ఒక కండీషన్ పెట్టాడంట. ప్రస్తుతం జరుగుతున్న టీ 20 ప్రపంచకప్ గానీ గెలిస్తే వారి భవిష్యత్ కు ఎటువంటి ఢోకా లేదు. వాళ్లతో నాకెటువంటి ఇబ్బందులు లేవు. ఓడితే మాత్రం రాబోవు మెగా టోర్నమెంట్లలో నేను వారిని భరించలేనని ముఖమ్మీదే చెప్పాడంట. దీంతో బీసీసీఐ ప్రతినిధులు అంగీకరించారని అంటున్నారు.

Also Read: ప్యాట్ కమిన్స్ రెండో హ్యాట్రిక్.. వరల్డ్ రికార్డ్..!

వీటితో పాటు జట్టు సెలక్షన్ లో ఎటువంటి రికమండేషన్లు పనికిరావని చెప్పాడంట. అక్కడ బాగా ఆడేవారికే అవకాశాలు ఇస్తానని, ఈ విషయంలో బీసీసీఐ జోక్యం చేసుకోకూడదని అన్నాడంట. అందుకు కూడా బీసీసీఐ అంగీకరించిందని అంటున్నారు.

ఇక ముచ్చటగా మూడోది ఏమిటంటే, బౌలింగు, బ్యాటింగ్, ఫీల్డింగ్ కోచ్ లు నాకు తెలిసిన వారినే పెట్టుకునే వెసులుబాటు కల్పించమని చెప్పాడంట. అలా చేస్తే టీమ్ బాధ్యత నాది అని, అప్పుడు గెలుపు, ఓటములకు నాదే బాధ్యతని కూడా అన్నాడని అంటున్నారు.

Also Read: Gulbadin Naib Alleged Of Cheating: ఆఫ్గాన్ ఛీటింగ్ పై.. ఐసీసీ సీరియస్

అయితే సీనియర్లు నలుగురిని మూడు ఫార్మాట్ల నుంచి తప్పిస్తారా? లేక టీ 20 వరకేనా? అనే సంగతి తెలీదు. నెట్టింట అదో పెద్ద చర్చ నడుస్తోంది. టెస్టు క్రికెట్ కి ఆదరణ పెరుగుతున్నందున అందుకోసం ప్రత్యేక జట్టును తయారుచేసుకోవాలని చెప్పాడంట. అంతేకాకుండా 2027 వన్డే ప్రపంచకప్ నకు సంబంధించి ఇప్పటి నుంచే టీమ్ ను రెడీ చేయాల్సి ఉందని ఒక రోడ్ మ్యాప్ చేసి ఇచ్చినట్టు తెలిసింది.
మరి గౌతంగంభీర్ వచ్చి ఎన్ని సంచలనాలకు తెరతీస్తాడో వేచి చూడాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News