Big Stories

Frank Duckworth Dies: ‘డక్‌వర్త్ లూయిస్’ రూపకర్త ఫ్రాంక్ డక్‌వర్త్ కన్నుమూత!

DLS Method Inventor Frank Duckworth Dies: క్రికెట్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు పెరిగిపోతున్నారు. అలాగే క్రికెట్‌ను ప్రేమించే అభిమానుల్లో ‘డక్‌వర్త్ లూయిస్’ విధానం గురించి అసలు తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎందుకంటే ఈ విధానం అంతలా పాపులర్ అయింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో అనుకోకుండా వర్షం ఆటంకం ఎదురైన సమయాల్లో ఆటను కొనసాగించడంతోపాటు విన్నర్స్ ఎవరనేది నిర్ణయించడానికి ఈ విధానాన్ని గత కొంతకాలంగా ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

అయితే ‘డక్‌వర్త్ లూయిస్ స్టెర్న్’ విధానాన్ని అంతర్జాతీయ క్రికెట్‌కు పరిచయం చేసిన వారిలో ఒకరైన ఫ్రాంక్ డక్‌వర్త్(84) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న డక్‌వర్త్ ఇక లేరనే విషయాన్ని క్రిక్ ఇన్ఫో వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. 1997లో టోనీ లూయిస్‌తో కలిసి ఫ్రాంక్ డక్‌వర్త్ ఈ డీఎల్ఎస్ విధానాన్ని ప్రతిపాదించారు. దీనికి ఐసీసీ 1999లో ఆమోదం తెలిపింది. తర్వాత వెంటనే వన్డే క్రికెట్ ఫార్మాట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా, ఈ ‘డక్‌వర్త్ టూయిస్’లో ఒకరైన లూయిస్ 2020లో మృతి చెందారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News