Big Stories

T20 World Cup 2024 Final Match: ఫైనల్ మ్యాచ్ లైవ్ ఎంతమంది చూశారో తెలుసా?

India vs South Africa Final Match Records(This week’s sports news): టీ 20 ప్రపంచకప్ ఫీవర్ ఇంకా పోలేదు. ఇదిప్పుడప్పుడే పోయేలా కూాడా లేదు. ఇంకో వారం రోజుల వరకు ఏదొక వార్త నెట్టింట హల్చల్ చేస్తూనే ఉంటుంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య లైవ్ మ్యాచ్ ను ఇండియాలో ఎంతమంది చూశారో తెలిస్తే, కళ్లు తిరుగుతాయి. ఎందరంటే.. 5.3 కోట్ల మంది చూశారని డిస్నీ హాట్ స్టార్ సంస్థ అధికారులు తెలిపారు. ఈ ఫ్లాట్ పారమ్ తో పాటు స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ కూడా టీవీల్లో కూడా ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం జరిగింది.

- Advertisement -

టీవీలు, మొబైల్ పోన్లు, ల్యాప్ టాప్ల్ ఇలా విభిన్న మార్గాల ద్వారా భారీ స్థాయిలో వ్యూయర్ షిప్ వచ్చింది. ఇకపోతే 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియతో జరిగినప్పుడు ఇంతకన్నా ఎక్కువ మంది చూశారు. వారెందరంటే.. 5.9 కోట్ల మంది చూశారని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఏ క్రికెట్ మ్యాచ్ కు కూడా ఇంత వ్యూయర్ షిప్ రాలేదని అంటున్నారు.

- Advertisement -

ఇకపోతే టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని ఎంతమంది చూశారనే దానిపై అసలైన లెక్కలను వారం రోజుల తర్వాత బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ వెల్లడిస్తుంది. అప్పుడు ఏ దేశంలో ఎంతమంది చూశారనే లెక్కలు వచ్చేస్తాయి. దానిని బట్టి టీమ్ ఇండియా ఆడే మ్యాచ్ లకి రేటింగ్ ఇస్తారు. అందుకు తగినట్టుగానే యాడ్ రెవెన్యూ కూడా ఉంటుంది. 2024 టీ 20 ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారంలో వచ్చే ప్రతీ ప్రకటనకి కోట్ల రూపాయల్లో వసూలు చేస్తారు.

Also Read: 16 ఏళ్లు కప్ కోసం చూశాం.. కాసేపు ట్రాఫిక్ లో ఉండలేమా ?

అంతేకాదు అంతర్జాతీయ విపణిలో శాటిలైట్ రైట్స్ కూడా వందలకోట్ల రూపాయలు ఉంటుంది. నిజానికి వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా టీ 20 ప్రపంచకప్ మ్యాచ్ లకి ఆతిథ్యం ఇచ్చాయి. నిజానికి చూస్తే వెస్టిండీస్ లో జరిగిన సెమీస్, సూపర్ 8, ఫైనల్ మ్యాచ్ లకి పెద్దగా జనం రాలేదు.

మరి నిర్వాహకులకి నష్టం కదా అనుకుంటారు. కానీ వారికి శాటిలైట్ రైట్స్, టీవీల్లో ప్రకటనలు, ఇంకా స్టేడియంలో ప్రకటనలు ఇలా వందల కోట్ల రూపాయల ఆదాయం ఇతర మార్గాల ద్వారా వస్తుంది. అంతేకాదు స్పాన్సర్స్ ఉంటారు. వారు స్డేడియంలో తమ కంపెనీ పొడక్ట్ పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు పెడతారు. అలాగే స్టేడియంకి చూసేందుకు వచ్చిన పబ్లిక్ కొన్న టిక్కెట్ల డబ్బులు మ్యాచ్ నిర్వహణకు సరిపోతాయి. మిగిలినదంతా లాభమే అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News