Big Stories

Dipa Karmakar Record: దీపా కర్మాకర్ రికార్డ్.. గోల్డ్ మెడల్ సాధించిన తొలి ఇండియన్ జిమ్నాస్ట్!

Asian Gymnastics Championship 2024: సీనియర్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్.. ఆదివారం జరిగిన ఆసియా సీనియర్ ఛాంపియన్ షిప్ లో మహిళల వాల్ట్ లో బంగారు పతకం సాధించింది. ఆసియా సీనియర్ ఛాంపియన్ షిప్ లో మహిళల వాల్ట్ లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. ఉజ్బెకిస్థాన్ రాజధాని నగరమైన తాష్కెంట్ లో జరిగిన చివరిరోజు వాల్ట్ ఫైనల్ లో దీపా కర్మాంకర్ 13.566 స్కోర్ చేసి.. గోల్డ్ మెడల్ సాధించింది.

- Advertisement -

ఉత్తర కొరియాకు చెందిన కిమ్ సన్ హయాంగ్ (13.466), జో క్యోంగ్ బ్యోల్ (12.966) రజత, కాంస్య పతకాలను గెలుచుకున్నారు. 2016 రియో ​​ఒలింపిక్స్‌లో వాల్ట్ ఫైనల్‌లో నాలుగో స్థానంలో నిలిచిన దీప, గతంలో 2015లో ఇదే ఈవెంట్‌లో కాంస్యం గెలుచుకుంది. ఆశిష్ కుమార్ 2015 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని సాధించాడు. 2019, 2020 లలో ప్రణతి నాయక్ వాల్ట్ ఈవెంట్ లో కాంస్య పతకాలను గెలిచింది.

- Advertisement -

గోల్డ్ మెడల్ సాధించిన దీప కర్మాకర్ ను అభినందిస్తూ.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది. ఆసియన్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్‌షిప్‌లో చరిత్ర దీపకు అభినందనలు అని X లో చేసిన పోస్ట్ లో పేర్కొంది. డోపింగ్ కారణంగా 21 నెలల సస్పెన్షన్ తర్వాత ఈ సంవత్సరం పోటీకి తిరిగి వచ్చింది దీపా. శుక్రవారం జరిగిన ఆల్ రౌండ్ విభాగంలో ఆమె 46.166 స్కోరుతో 16వ స్థానంలో నిలిచింది. 2015 పారిస్ ఒలింపిక్స్‌కు దూరంగా ఉంది.

Also Read: Singapore open 2024: సింగపూర్ ఓపెన్, భారత ఆటగాళ్లకు తొలిరౌండ్లో గట్టిపోటీ

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News